Karthika Deepam 2 May 30th: కార్తీక్ సలహాతో నర్సింహా కి బుద్ధి చెప్పిన బాబాయ్.. కొడుకు ప్రవర్తనకి కంగారుపడుతున
రీధర్ అతని రెండవ భార్యతో దీపకి దొరికిపోతాడు. దీప ఎక్కడ ఇంట్లో నిజం చెప్పేస్తుందో అని టెన్షన్ పడిపోతూ ఉంటాడు. స్కూల్లో కనిపించిన శౌర్య కి తనే తండ్రిని అని చెప్పాలనుకుంటాడు నర్సింహ. ఆ ప్రయత్నాన్ని అడ్డుకుంటుంది దీప. ఇదంతా గత ఎపిసోడ్‌లో జరిగిన కధ. మే 30వ తేదీ కార్తీకదీపం సీజన్ 2లో 58వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..
కంగారుపడుతూ వెళ్ళిపోతున్న శ్రీధర్ కి దీప భర్త రెండో పెళ్లి వ్యవహారం గురించి కూడా చూడండి అంటుంది పారిజాతం. మనకి ఉన్న తలనొప్పులు చాలవా మళ్లీ అవన్నీ మనకెందుకు అంటాడు శ్రీధర్. అలా అంటారేంటి టౌన్ లో కాబట్టి పోలీస్ స్టేషన్ అదీ, ఇదీ అంటున్నారు అదే పల్లెటూర్లో అయితే అలాంటి వెధవల్ని చెట్టుకేసి కట్టేసి అంటూ పారిజాతం ఇంకా ఏదో మాట్లాడబోతూ ఉంటే అదంతా వాళ్ళకి చెప్పండి అంటూ కంగారుగా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు శ్రీధర్.

అల్లుడుగారి ప్రవర్తన తేడాగా ఉందేంటి అయినా అనుమానించడానికి ఆయనకు అంత సీన్ లేదు అనుకుంటుంది పారిజాతం. మరోవైపు దీప హోటల్ కి వస్తాడు నర్సింహ. ఆలోచనలో ఉన్న దీప అతనిని గమనించదు. బాబాయ్ నర్సింహ ని చూసి మళ్లీ ఎందుకు వచ్చావు అని అడుగుతాడు. హోటల్ పెట్టింది కస్టమర్లు కోసమే కదా మంచి టీ తీసుకురా అని చెప్తాడు నర్సింహ.అప్పుడు దీప నర్సింహా ని చూస్తుంది. ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతుంది.
నువ్వు ఇక్కడ పని చేయటం నాకు ఇష్టం లేదు, నువ్వు నీ కూతురు నా కంటికి కనిపించనంత దూరం వెళ్లిపోండి లేదంటే మీ చుట్టూ ఇలాగే తిరుగుతూ ఉంటాను అంటాడు నర్సింహ. అప్పుడే టీ తీసుకువచ్చిన బాబాయ్ నర్సింహ పై కోప్పడతాడు. నీకు రెండు తగులుతాయి నువ్వు మూసుకొని ఉండు అని అతనిని బెదిరించి నోరుమూయిస్తాడు నర్సింహ. అదే సమయంలో కార్తీక్ సెల్ కి సింగింగ్ కాంపిటేషన్ డాన్సింగ్ కాంపిటేషన్ ఉంది అని స్కూల్ నుంచి మెసేజ్ వస్తుంది.

రౌడీ పేరు ఇచ్చిందో లేదో, ఈ విషయం దీప కి తెలుసో లేదో చెప్పాలి అనుకుంటూ దీప హోటల్ దగ్గరికి వస్తాడు కార్తీక్. అక్కడ జరుగుతున్న గొడవను చూసి బయటే నిలబడిపోతాడు. నేను వెళ్తే గొడవ మరింత పెరిగిపోతుంది అనుకుంటూ బాబాయ్ కి ఫోన్ చేసి వాడు అక్కడ నుంచి వెళ్లిపోవాలంటే నేను చెప్పినట్లు చేయండి అంటూ ఏదో సలహా ఇస్తాడు కార్తీక్. సరే అని ఫోన్ పెట్టేసిన బాబాయ్ నర్సింహ ని అక్కడ నుంచి వెళ్ళిపోమంటూ గదమాయిస్తాడు.
ఏంట్రా రెచ్చిపోతున్నావు నీకు రెండు తగలాలి అంటూ బాబాయ్ మీదికి వెళ్తాడు నరసింహ. నర్సింహ నిజంగానే కొట్టినట్లు పడిపోతాడు బాబాయ్. నేను ఇంకా కొట్టనే లేదు కదరా, నువ్వు కూడా నాటకాలు మొదలు పెట్టావా అంటాడు నర్సింహ. చూడడంమ్మ ఎలా కొడుతున్నాడో ఒక ఆడపిల్లని ఎలా ఏడిపిస్తున్నాడో అంటూ అక్కడ ఉన్న కస్టమర్ల తో అంటాడు బాబాయ్. వాళ్ళందరూ నర్సింహ మీద తిరగబడతారు.

ఈరోజు నీ టైం బాగుంది మళ్లీ దొరక్క పోతావా అప్పుడు నీ పని చెప్తాను అని దీపని బెదిరిస్తూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు నర్సింహ. అప్పుడు బాబాయ్ దీపతో ఏదో మాట్లాడుతూ ఉంటే నా మనసు ఏమి బాగోలేదు బాబాయ్ అంటుంది దీప. అప్పుడే అక్కడికి వచ్చిన కార్తీక్ ఆమెకి ధైర్యం చెప్తాడు. ఇది నేను పని చేసుకునే చోటు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అంటుంది దీప. స్కూల్ నుంచి వచ్చిన మెసేజ్ విషయం చెప్పి వెళ్ళిపోతాడు కార్తీక్.
అప్పుడు దీపా బాబాయ్ తో మాట్లాడుతూ నీకు గొడవలు అంటే భయం కదా అంత ధైర్యంగా నర్సింహాతో ఎలా మాట్లాడావు, కార్తీక్ బాబు ఏమైనా చెప్పారా అని అనుమానంగా అడుగుతుంది. ఆయన నాకేం చెప్తారు అంటూ కంగారుగా అక్కడినుంచి వెళ్ళిపోతాడు బాబాయ్. ఆ పని వెనుక కార్తీక్ హస్తం ఉందని అర్థం చేసుకుంటుంది దీప. మరోవైపు వంట చేసుకుంటున్న దీప దగ్గరికి వచ్చిన శౌర్య రేపటి నుంచి స్కూల్ కి వెళ్ళను మళ్ళీ ఆ బుచాడు వస్తాడు అంటుంది. అలాంటిది ఏమీ జరగదు నేను ఉన్నాను కదా అంటుంది దీప.
మనం ఒక పని చేద్దాం అమ్మ, మన నాన్నని తెచ్చేసుకుందాము అప్పుడు నాన్న ఉంటే ఆ బూచాడుతో గొడవపడతాడు అంటుంది శౌర్య. నాన్న గురించి అడగొద్దు అని చెప్పాను కదా అని కోప్పడుతుంది దీప. కార్తీక్ తో చెబుదాము కార్తీక్ నాన్నని వెతుకుతాడు అంటుంది శౌర్య. మన ఇంటి విషయాలు బయట వాళ్లకి చెప్పకూడదు అని కూతురుని కోప్పడుతుంది దీప. తల్లి మాటలకి కోపం తెచ్చుకొని అలిగి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది శౌర్య.

మరోవైపు కావేరితో మాట్లాడుతున్న శ్రీధర్ కార్తీక్ ని చూసి కంగారుపడుతూ ఫోన్ పెట్టేస్తాడు. ఏంటి మాస్టారు నన్ను చూసి అంత కంగారు పడుతున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు అంటాడు కార్తీక్. క్యాజువల్ గానే మాట్లాడుతున్నాను అని కంగారుగా చెప్తాడు శ్రీధర్. అయితే మీరు లాస్ట్ మాట్లాడిన వాళ్లతో నేను కాల్ చేసి మాట్లాడుతాను అంటూ శ్రీధర్ ఫోన్ తీసుకుంటాడు కార్తీక్. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.


Click it and Unblock the Notifications











