Karthika Deepam2 May31st:కొడుక్కి ఎప్పటికీ నిజం తెలియకూడదనుకుంటున్న శ్రీధర్..సుమిత్ర ని తిట్టుకుంటున్న జ్యోత్స
దీప ఎక్కడ ఇంట్లో నిజం చెప్పేస్తుందో అని టెన్షన్ పడిపోతూ ఉంటాడు శ్రీధర్. స్కూల్లో కనిపించిన శౌర్య కి తనే తండ్రిని అని చెప్పాలనుకుంటాడు నర్సింహ. ఆ ప్రయత్నాన్ని అడ్డుకుంటుంది దీప. దీప హోటల్ దగ్గరికి వచ్చి నానా రచ్చ చేస్తాడు నర్సింహ. ఇదంతా గత ఎపిసోడ్‌లో జరిగిన కధ. మే 31వ తేదీ కార్తీకదీపం సీజన్ 2లో 59వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..
తనని చూసి కంగారు పడుతున్న తండ్రిని చూసి ఏమిటి కంగారుపడుతున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు అని అడుగుతాడు కార్తీక్. ఏదో క్యాజువల్ గా మాట్లాడుతున్నాను అంటాడు శ్రీధర్. అయితే మీ లాస్ట్ కాల్ కి నేను కాల్ చేసి మాట్లాడొచ్చా అంటాడు కార్తీక్. ఒక్కసారి గా టెన్షన్ పడతాడు శ్రీధర్ కానీ తమాయించుకొని నా మీద నమ్మకం లేకపోతే కాల్ చేయొచ్చు అంటాడు. ఏదో సరదాగా అన్నాను నీ మీద నమ్మకం లేకపోవడం ఏమిటి అంటూ ఫోన్ పెట్టేస్తాడు కార్తీక్.

తర్వాత ఎప్పుడూ అమ్మ చూడకుండా ఒక సిగరెట్ కాలుస్తావు ఇప్పుడేంటి వరస పెట్టి సిగరెట్లు కాలుస్తున్నావు. నీ ఫోన్ కి, నీ టెన్షన్ కి, ఈ సిగరెట్లు కి ఏమైనా సంబంధం ఉందా అని అడుగుతాడు కార్తీక్. నేను ఏదో టెన్షన్ లో ఉండి కాలుస్తున్నాను ఇప్పటికే లేట్ అయింది వెళ్లి భోజనం చేసి పడుకో, భోజనం చేసే ముందు అమ్మకి ఫోన్ చేసి భోజనం చేసిందో లేదో కనుక్కో అంటాడు శ్రీధర్.
నువ్వు ఎంత మంచి భర్తవి నాన్న.. భవిష్యత్తులో నేను కూడా అంత మంచి భర్తను కాలేనేమో అని తండ్రిని పొగుడుతాడు కార్తీక్. కొడుకు వెళ్ళిపోయిన తరువాత మీ పిన్ని గురించి తెలిస్తే వరల్డ్ లోనే బెస్ట్ వరస్ట్ హస్బెండ్ ని నేనే అంటావు. అందుకే నీకు ఎప్పటికీ ఈ నిజం తెలియకూడదు అనుకుంటాడు శ్రీధర్. మరోవైపు అలక లో ఉన్న శౌర్య అమ్మ భోజనం తీసుకొస్తుందో లేదో అనుకుంటుంది. భోజనం తెస్తున్న దీప ని చూసి బువ్వ పెట్టిన వెంటనే తినకూడదు బెట్టు చేయాలి అనుకుంటుంది.
కానీ దీప కూతురి అలక తీర్చి భోజనం తినిపిస్తూ ఉంటుంది. ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే దీప తండ్రి ప్రస్తావన వస్తుంది, తాతయ్య ఉండి ఉంటే బాగుండేది నిన్ను బాగా చూసుకునేవారు అయినా పర్వాలేదు నేను నిన్ను తాతయ్య చూసుకున్నట్లు చూసుకుంటాను అంటూ దీపకి అన్నం తినిపిస్తుంది శౌర్య. ఆనందం కన్నీరు పెట్టుకుంటుంది దీప. మాటల్లో కాంపిటీషన్ సంగతి చెప్తుంది శౌర్య.

నువ్వు వంట చేసేటప్పుడు పాట పాడుతావు కదా ఆ పాట నేర్పించు అంటుంది శౌర్య. రేపు పొద్దున నేర్పిస్తాను పడుకోమనటంతో శౌర్య పడుకుంటుంది. మరుసటి రోజు పొద్దున్నే కూతురికి పాట నేర్పిస్తూ ఉంటుంది దీప. అప్పుడే అటుగా వచ్చిన కార్తీక్ దీపకి ఈ టాలెంట్ కూడా ఉందా సమయం వచ్చినప్పుడు ఆమెని అప్రిషియేట్ చేయాలి అనుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత సుమిత్ర వాళ్ళు కబుర్లు చెప్పుకుంటూ ఉండగా వచ్చిన కార్తీక్ ని అందరూ పలకరిస్తారు.
కాసేపు మాట్లాడిన తర్వాత కార్తీక్ తల్లితో మాట్లాడుతూ మనం బయలుదేరదామా అంటాడు. సరే అంటుంది కాంచన తర్వాత వదినతో మాట్లాడుతూ ఒకసారి భాస్వరాన్ని మా ఇంటికి పంపిస్తారా ఆవకాయ పట్టించాలి అంటుంది. దానికి మనిషిని పంపించడం ఎందుకు మాకు కూడా ఆవకాయ అవసరం ఇక్కడే పట్టిద్దాము అంటూ భాస్వరంతో దీపని తీసుకు రమ్మని చెప్తుంది. ఇంట్లోకి వచ్చిన దీపతో ఆవకాయ సంగతి చెప్పి నిన్ను ఇబ్బంది పెట్టడం లేదు కదా అంటుంది సుమిత్ర.

లేదమ్మా ఈ విధంగా అయినా మీ రుణం తీర్చుకునే అవకాశం దక్కినట్లుగా భావిస్తాను అంటుంది దీప. దీనికి మాటలతో ఎవరిని ఎలా బుట్టలో వేసుకోవాలి బాగా తెలుసు ఇంట్లో ఏ అవసరం వచ్చినా మమ్మీకి ఆ దీపే కనిపిస్తుంది అని తల్లిని తిట్టికుంటుంది జ్యోత్స్న. అప్పుడే దశరధ్ మాట్లాడుతూ నిన్న మీ నాన్న ఎందుకో కంగారుగా వెళ్ళిపోయాడు అని కార్తీక్ తో అంటాడు.
ఆ మాటలకి అక్కడ నుంచి వెళ్ళిపోతున్న దీప ఆగిపోతుంది. ఆయన నన్ను చూసే కంగారుపడి వెళ్ళిపోయారు అనుకుంటుంది. నిజం ఎక్కడ బయటపడిపోతుందో అని ఆయన వెళ్ళిపోయినట్లున్నారు అంటాడు కార్తీక్. ఆ మాటలకి కార్తీక్ కి నిజం తెలిసి మాట్లాడుతున్నాడేమో అని ఆశ్చర్యంగా చూస్తుంది దీప. దీప ఎందుకు అలా చూస్తుందో అర్థం చేసుకో లేకపోతాడు కార్తీక్. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.


Click it and Unblock the Notifications











