Karthika Deepam May 31st Episode: కోలుకోలేని దెబ్బ కొడుతా.. వాడిని వదిలిపెట్టను.. కార్తీక్‌పై మోనిత కుట్ర!
కార్తీక దీపం సీరియల్‌లో కార్తీక్ కుటుంబంలో ఆనందం వ్యక్తమైతే.. మోనిత మనసులో విషం చిమ్మే విధంగా సన్నివేశాలు కనిపించాయి. దీప ఆరోగ్యం కుదుటపడటంతో ఆమెను డిశ్చార్జి చేయడానికి ఏర్పాట్లు చేస్తుండగా కార్తీక్ వచ్చి పలకరించారు. కార్తీక్ అదోలా ఉండటం చూసి.. దీప బాధపడిపోయింది. ఎప్పుడు ఫ్రెష్‌గా ఉంటే మీరు ఇలా కనిపించడం బాగాలేదని చెప్పింది. అలా సంభాషణల మధ్య దీప డిశ్చార్జి అయి ఇంటికి చేరింది. అయితే కార్తీక్ తనను పట్టించుకోకపోవడంపై మోనిత మరోసారి కుట్రలకు ప్లాన్ చేస్తూ కనిపించింది. ఈ సీరియల్‌లోని 1053 ఎపిసోడ్‌కు సంబంధించిన వివరాల్లోకి వెళితే.
సంధ్యావేళలో అందాలతో కవ్విస్తోన్న సీరియల్ హీరోయిన్ మౌనీరాయ్

మోనితను రెచ్చగొట్టిన ప్రియమణి
దీపకు కార్తీక్ చేరువ కావడాన్ని జీర్ణించుకోలేకపోయిన డాక్టర్ మోనిత ఇంట్లో దిగాలుగా కూర్చొని బాధలో మునిగిపోయింది. దాంతో ఆమెను ఊరడించేందుకు పనిమనిషి ప్రియమణి ప్రయత్నిస్తూనే రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. ఇంతకాలం మీ ఇంటి చుట్టు తిరిగి ఇప్పుడు ముఖం చాటేశాడు. ఇప్పుడు పెళ్లాం చుట్టూ తిరుగుతూ నిన్ను పట్టించుకోవడం లేదు అంటూ ప్రియమణి దీర్ఘాలు తీసింది.

మోనితలోని కసిని మరోసారి
కార్తీక్ గురించి ప్రియమణి మాట్లాడుతూ.. గుడికి వచ్చే పూజారిలా పొద్దున్న, సాయంత్రం ఇంటి వచ్చేవాడు. ఇప్పుడు కనీసం ఇంటిముఖం చూడటం లేదు. నేనైతే తలస్నానం చేసి పట్టించుకోకపోయేదాన్ని. కానీ మీరు తల విరబూసుకొని బాధపడతున్నారంటూ మోనితలో కసిని ప్రియమణి రెచ్చగొట్టింది. దాంతో మోనిత ఏడుస్తూ బాధలో మునిగిపోయింది. ఏడవటానికి బదులు మీరు వాళ్ల ఇంటికి దులిపేయండి. కార్తీక్‌ను నమ్ముకొన్న వాళ్లు ఏడవడమేనా అంటూ ప్రియమణి ఎడాపెడా మాట్లాడింది.

కోలుకోలేని దెబ్బ కొడుతా...
ప్రియమణి మాటలకు సమాధానం చెబుతూ.. సర్దుకుపోవడానికి నేను దీపను కాను. నేను మోనితను. మోసం చేసే వాళ్లను క్షమించను. కోలుకొలేని దెబ్బ కొడతా. నా ప్రేమతో ఆడుకొంటే ప్రేమించిన వాడిని వదిలిపెట్టాను. ముందుంది.. అతి త్వరలోనే అతి భయంకర చిత్రం విడుదల కాబోతున్నదంటూ నవ్వుల్లో మునిగిపోయింది.

మీ ఆనందం ఎన్ని రోజులో చూస్తా
మోనిత ఆ తర్వాత కాస్త కోలుకొని సౌందర్యకు కాల్ చేసింది. దీప ఇంటికి వచ్చిందా అని మోనిత కాల్ చేసింది. దాంతో ఇక ముందు మాకు ఇలాంటి కాల్స్ చేయవద్దు. ఇప్పుడు మేమే చాలా హ్యాపీగా ఉన్నాం అంటూ మోనితకు సౌందర్య ఘాటుగా సమాధానం ఇచ్చింది. అందుకు జవాబిస్తూ.. ఎలాంటి మూడ్‌నైనా చెడగొట్టే టాలెంట్ నాకు ఉంది అంటూ కామెంట్ చేసింది. ఇలా హ్యాపీ మూడ్‌లో ఉన్నాడు కదా.. అలా ఎన్ని రోజులు ఉంటారో చూస్తాను అంటూ సవాల్ విసిరింది. దాంతో నా కోడలు బంగారం.. నా కొడుకు మారిపోయాడంటూ మోనిత కాల్‌ను సౌందర్య కట్ చేసింది.
Recommended Video

ఆ విషయాన్ని రేపే అంటూ మరో కుట్రకు..
అయితే సౌందర్య కాల్ కట్ చేసిన తర్వాత దీప బంగారం అయితే.. నేను ప్లాటినమ్‌నా? అంటూ విషపు నవ్వు నవ్వింది. ఇక ముందు ఇచ్చే షాక్‌లకు తట్టుకొనేందుకు సిద్ధంగా ఉండండి అంటూ తనలో తాను మోనిత అనుకొన్నది. ఎలాగైనా ఆ విషయాన్ని రేపే బయటపెట్టాలంటూ మోనిత కుట్రలకు తెర లేపింది. దీంతో తదుపరి ఎపిసోడ్స్ మరింత రంజుగా ఉండే అవకాశం ముందనే ఛాన్స్‌ను నిర్వాహకులు ఇచ్చారు. రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











