Karthika Deepam 2 April 29th: గిల్టీ గా ఫీలవుతున్న కార్తీక్.. జోత్స్న మనసు విరిచేస్తున్న పారిజాతం!
దీప వంటలు బాగా చేయడంతో సుమిత్ర వాళ్ళందరూ దీపని మెచ్చుకుంటారు. దీపని ఊరు నుంచి పొమ్మని లేదంటే బ్రతకనివ్వనని సుమిత్ర ఇంటికి వచ్చి మరీ దీపని బెదిరిస్తాడు నర్సింహ. మీ బావకి నువ్వంటే ఇష్టం లేదని జోత్స్న ని రెచ్చగొడతారు ఆమె ఫ్రెండ్స్. తాగి కార్ యాక్సిడెంట్ చేస్తుంది జోత్స్న. దీప నిజం చెప్పటంతో జోత్స్న ని పోలీసులు అరెస్టు చేస్తారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో జరిగిన కథ. ఏప్రిల్ 29 వ తేదీ కార్తీకదీపం సీజన్ 2లో 31వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..
డ్రైవింగ్ చేసే పరిస్థితిలో లేనప్పుడు నన్ను పిలవచ్చు కదా అంటాడు కార్తీక్. కాల్ వచ్చిందని వెళ్ళిపోయావు కదా అంటుంది జోత్స్న. వెళ్ళిపోతే మళ్ళీ రాననుకున్నావా, ఈ ఇంటి గౌరవాన్ని కాపాడవలసిన బాధ్యత మనదే, మన వల్ల ఒక ప్రాణం పోతే ఆ కుటుంబం ఎంత బాధ పడుతుందో తెలుసా అంటాడు కార్తీక్. నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయావు, నా ఫ్రెండ్స్ ముందు నాకెంత అవమానంగా ఉంటుంది, ఆ అవమానంతోనే తాగాను.

అయినా నీకు నేనంటే ప్రేమ ఉందా లేదా నేను నీ మీద చూపిస్తున్నంత ప్రేమ నువ్వు నా మీద ఎందుకు చూపించడం లేదు అని నిలదీస్తుంది. ఎలాగూ టాపిక్ వచ్చింది కాబట్టి నిజం చెప్పేయాలి అనుకుంటాడు కార్తీక్. కానీ అంతలోనే దీప పాలు తీసుకొని వస్తుంది. జ్యోత్స్న కోపంగా అక్కడ పెట్టి వెళ్ళిపో అంటుంది. తర్వాత దీప అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే కోపంలో ఉన్న జ్యోత్స్న పాల గ్లాసు విసిరేస్తుంది.
కార్తీక్ ఏదో చెప్పబోతే నన్ను ఒంటరిగా వదిలేయమంటూ ప్రస్టేట్ డోర్ క్లోజ్ చేసేస్తుంది. కార్తీక్ దీప తో మాట్లాడుతూ మీరు చేసింది మంచి పనే కానీ ఆ విషయం అర్థం చేసుకోవడానికి తనకి కొంచెం టైం పడుతుంది అంటాడు. మీరు నాకు సంజాయిషీ ఇవ్వక్కర్లేదు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది దీప.
మరోవైపు దీపని ఇంట్లోంచి పంపించేయటానికి ఇదే మంచి సమయం అని ఆలోచనలో ఉన్న పారిజాతం దగ్గరికి వస్తాడు కార్తీక్.జ్యోత్స్న ని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదని ఎప్పుడు చెప్తావు, ఇప్పుడు చూడు తను నా వల్లే తాగి డ్రైవ్ చేశాను అని చెప్తుంది నాకు చాలా గిల్టీగా ఉంది. నువ్వు నిజం చెప్తావా నన్ను నిజం చెప్పమంటావా అని నిలదీస్తాడు. నువ్వు పార్టీ నుంచి వచ్చేసావని ఇంత చేసింది, నువ్వు జీవితంలో ఉండవని తెలిస్తే విషం మింగేస్తుంది అంటూ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తుంది పారిజాతం.
ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అంటాడు కార్తీక్. ఈ పరిస్థితులు కొంచెం చక్కబడనీ నేను తనకి అర్థమయ్యేలాగా చెప్తాను అంటుంది పారిజాతం. మరోవైపు పగిలిపోయిన గాజు గ్లాస్ ని తీసే డస్ట్ బిన్ లో వేస్తుంది దీప. అప్పుడే అక్కడికి వచ్చిన సుమిత్ర కూతురు గురించే దీపతో చెప్పి బాధపడుతుంది. జోత్స్న చాలా మంచిది కానీ మా అత్తగారు మా ఆడపడుచు చేసిన గారాబానికి మొండిగా తయారైంది, తన మాటలని నువ్వు తప్పుగా అనుకోవద్దు అంటుంది.

నేను చెప్పింది నిజమే అవ్వచ్చు కానీ అందుకు తను బాధపడింది, అవమానాలు పాలయింది అందుకే నేను ఆమెకి క్షమాపణ చెప్పాను. అర్థం చేసుకోవడానికి కాస్త టైం పడుతుంది తనని ఏమీ అనొద్దు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది దీప . మరోవైపు జోత్స్న కి భోజనం తినిపిస్తూ దీప మీద లేనిపోని చాడీలు చెప్తుంది పారిజాతం. ఇందులో అక్క చేసిన తప్పేముంది, నేను చేసిన పని తను చూసింది కాబట్టి చెప్పింది అంటుంది జోత్స్న.
నిజమే కావచ్చు కానీ అందువల్ల నీ పరువు పోయింది, ఎప్పుడూ లేనిది మీ నాన్న, మీ తాతయ్య పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సి వచ్చింది ఇదంతా తన వల్లే అంటూ దీప మీద జోత్స్న మనసు విరిచే ప్రయత్నం చేస్తుంది పారిజాతం. మరోవైపు కార్తీక్ తల్లిదండ్రులు ఇద్దరు కార్తీక్ తో నువ్వు కోడలి దగ్గర కాసేపు ఉండవలసింది అంటారు. తను ఒంటరిగా ఉంటేనే తను చేసిన తప్పేంటో తనకి తెలుస్తుంది అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు కార్తీక్. వీడు జరిగిన దానికి ఏం బాధపడుతున్నాడా కోప్పడుతున్నాడా అంటుంది, మన కోడలు పెద్ద ప్రమాదం నుంచి బయటపడింది అంటుంది. ఇంకా ప్రమాదం నుంచి బయట పడలేదు యాక్సిడెంట్ అయిన మనిషి కోలుకుంటే పర్వాలేదు చనిపోతే మాత్రం పెద్ద ప్రమాదమే అంటాడు కార్తీక్ తండ్రి. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.


Click it and Unblock the Notifications











