మొట్టమొదటి సారిగా అలా.. డాక్టర్ బాబు-వంటలక్క రొమాన్స్.. ఫ్యాన్స్ షాక్
కార్తీకదీపం సీరియల్ గురించి, అందులోని పాత్రల గురించి తెలియని వారెవ్వరూ ఉండరు. డాక్టర్ బాబు, కార్తీక్ పాత్రలో నిరుపమ్.. వంటలక్క, దీప క్యారెక్టర్‌లో ప్రేమీ విశ్వనాథ్ క్రియేట్ చేసిన, చేస్తోన్న వండర్స్ అన్నీ ఇన్నీ కావు. మొన్నీ మధ్యే వెయ్యి ఎపిసోడ్‌లు పూర్తి కావడంతో కార్తీకదీపం టీం రచ్చ రచ్చ చేసింది. నిరుపమ్, ప్రేమీ విశ్వనాథ్, శోభా శెట్టి ఇలా కార్తీక దీపం టీం అంతా కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేసింది.

బుల్లితెరపై రచ్చ..
కార్తీక దీపం సీరియల్‌లో ప్రేమీ విశ్వనాథ్, నిరుపమ్ పరిటాల బాగానే ఫేమస్ అయ్యారు.అయితే ఇన్నాళ్లు వారు ఆ సీరియల్‌లో తప్పా మరేతర షోలు, ఈవెంట్లలో కనిపించే వారు కాదు. కానీ ఈ మధ్య మాత్రం బుల్లితెరపై స్పెషల్ ఈవెంట్లలో ఈ జోడియే హైలెట్ అవుతోంది.

స్పెషల్ ఈవెంట్లతో హల్చల్..
గతేడాది దసరా ఈవెంట్‌తో తొలిసారిగా ప్రేమీ విశ్వనాథ్, నిరుపమ్ పరిటాల ఇద్దరూ కూడా బుల్లితెరపైకి వచ్చారు. ఆ తరువాత మళ్లీ స్పెషల్ ఈవెంట్లకు వారు గెస్టులుగా వస్తూనే ఉన్నారు. అలా ఇప్పుడు ఉగాది ఈవెంట్‌లోనూ వీరే హైలెట్ కాబోతోన్నట్టు కనిపిస్తోంది.

రామాయణ గాథను..
దసరాకు అమ్మవారిగా కనిపించిన ప్రేమీ విశ్వనాథ్ ఇప్పుడు సీతమ్మ వారిలా మారిపోయింది. నిరుపమ్ శ్రీరాముడిలా మారిపోయాడు. పిల్లలిద్దరూ (శౌర్య, హిమ) లవకుశులుగా మారారు. వీరంతా కలిసి బుల్లితెరపై రామాయణాన్ని అందరికీ చూపించేందుకు రెడీ అయ్యారు.

రొమాన్స్ సైతం..
ఉగాది ఈవెంట్‌లో కార్తీకదీపం టీం తమలోని కోణాలన్నింటిని చూపించేందుకు రెడీ అయింది. రామాయణ గాథను చూపించడమే కాకుండా.. నీ కాళ్లను పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లు అంటూ వంటలక్క చుట్టూ డాక్టర్ బాబు తిరుగుతూ డ్యాన్సులు కూడా వేసేశాడు. ఇక ఈ సీన్ ఈవెంట్ మొత్తానికి హైలెట్ అయ్యేలా కనిపిస్తోంది. ఇలా డాక్టర్ బాబు, వంటలక్క మధ్య రొమాన్స్, కెమిస్ట్రీని చూసి ఫ్యాన్స్ కూడా షాక్ అవుతున్నారు.


Click it and Unblock the Notifications











