ఆ రోజు డాక్టర్ బాబు నిర్ణయం వల్ల నాని జీవితమే మారిపోయింది.... షాకింగ్ ట్విస్ట్!
టాలీవుడ్ ఇండస్ట్రీలో నేచురల్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న హీరో నాని. ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా కూడా సోలోగా పైకొచ్చిన ఈ యువ హీరో అంటే ఇండస్ట్రీలో అందరికి ఇష్టమే. అయితే కొన్నిసార్లు ఇండస్ట్రీలో వచ్చే విభిన్నమైన ఛాన్సులు జీవితాన్ని ఒక్కసారిగా మార్చేస్తాయి. అలాగే నాని జీవితంలో కూడా అలాంటి ఛాన్స్ రావడం వల్లే ఈ స్థాయికి రావడానికి ముఖ్య కారణమయ్యింది. అయితే అతని కెరీర్ యూ టర్న్ తీసుకోవడానికి ముఖ్య కారణం మనం కార్తీక దీపం కార్తిక్ బాబు అనే తెలుస్తోంది.

సహాయ దర్శకుడిగా
నాని మొదట ఇండస్ట్రీలోకి దర్శకుడు అవ్వాలనే టార్గెట్ తోనే అడుగు పెట్టారు అని అందరికి తెలిసిన విషయమే. బాపు రమణ వంటి అగ్ర దర్శకుల వద్ద సహాయక దర్శకుడిగా కూడా వర్క్ చేశాడు. ఫ్యామిలీ సపోర్ట్ తోనే కొన్నేళ్ల వరకు అసిస్టెంట్ డైరెక్టర్ గా కొనసాగుతూ వచ్చాడు. ఎన్నో కథలను కూడా రాసుకున్నాడు.

మొదటి కథ ఆ హీరో కోసమే
అసలు నాని డైరెక్షన్ తో టీమ్ తో వర్క్ చేసే కాలంలో యాక్టింగ్ పై ఏ రోజు కూడా ఎక్కువగా ఫోకస్ పెట్టలేదు. అల్లు అర్జున్ కోసం అప్పట్లో ఒక కథ రాయడమే కాకుండా గంటన్నర సేపు స్క్రిప్ట్ మొత్తం వినిపించాడట. కానీ ఎందుకో అతని లక్కు అటువైపు వెళ్లలేదు. ఇక మొదటిసారి అష్టాచమ్మా సినిమాతో ఛాన్స్ అందుకోగానే ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించి మొదటి విజయాన్ని అందుకున్నాడు.

లైఫ్ ఒక్కసారిగా మారిపోయింది
ఏ హీరోకైనా మొదటి సినిమా చాలా కీలకం. ఇక నానికి కూడా అష్టాచమ్మా వరుసగా ఛాన్సులను అందించింది. అలా మొదలైంది. ఈగ, పిల్ల జమిందార్ వంటి సినిమాల తరువాత అతను వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆ సినిమాలు అతని కెరీర్ కు మంచి బూస్ట్ ఇవ్వడంతో లైఫ్ ఒక్కసారిగా మారిపోయింది.
Recommended Video

క్లారిటి ఇచ్చిన డాక్టర్ బాబు
ఇక నానికి అలా మొదటి ఛాన్స్ రావడానికి పరోక్షంగా కార్తీక దీపం హీరో నిరపమ్ పరోక్షంగా హెల్ప్ అయినట్లు తెలుస్తోంది. ఎందుకంటే మొదట అష్టాచమ్మా సినినలో నిరుపమ్ ను అనుకున్నారట. కానీ అప్పటికే సీరియల్స్ తో బిజీగా ఉండడం వల్ల వెంటనే ఓకే చేయలేకపోయినట్లు ఇటీవల అలీతో సరదాగా ఇంటర్వ్యూలో చెప్పాడు. మొదట ఇంట్రెస్ట్ చూపించినట్లే చూపించి ఆ తరువాత మళ్ళీ తనను సంప్రదించలేదు అంటూ నిరుపమ్ వివరణ ఇచ్చారు.


Click it and Unblock the Notifications










