Nirupam Paritala: కార్తీక దీపం డాక్టర్ బాబు ఆస్తుల విలువ ఎంతో తెలుసా... రెమ్యునరేషన్ మరింత పెంచడంతో..
తెలుగు టెలివిజన్ చరిత్రలోనే సరికొత్త రికార్డులు క్రియేట్ చేసిన కార్తీక దీపం సీరియల్ ఇప్పట్లో ముగిసే అవకాశం లేదని క్లారిటీగా అర్ధమయ్యింది. గతంలో ఎప్పుడు లేనంతగా నేషనల్ లెవెల్లో కూడా సీరియల్ ట్రెండ్ అవ్వడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక అందులో నటిస్తున్న నటీనటులపై నిత్యం ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది. ప్రస్తుతం డాక్టర్ బాబుకు సంబంధించిన ఆస్తుల వివరాలు కూడా సోషల్ మీడియాలో గట్టిగానే వైరల్ అవుతున్నాయి. ఇక ఆ వివరాల్లోకి వెళితే..

ఆ సినిమాలో హీరోగా.. ఛాన్స్ మిస్
కార్తిక్ పాత్రలో డాక్టరు బాబుగా ఫేమస్ అయిన నిరుపమ్ కు అభిమానులు ఏ రేంజ్ లో ఉన్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మొదట అతను సినీ నటుడు కావాలని అనుకున్నాడు. సిమియర్ నటుడు, రైటర్ ఓంకార్ తనయుడు అయినటువంటి నిరుపమ్ మొదట్లో అవకాశాల కోసం గట్టిగానే తిరిగాడు. అష్టా చమ్మా సినిమాలో ఛాన్స్ వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది.

కార్తీకదీపంతో భారీ క్రేజ్
సినిమాల్లో నటించినప్పటికీ పెద్దగా ఫోకస్ అవ్వకపోవడంతో సీరియల్స్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకొని సక్సెస్ అయ్యాడు. ప్రస్తుతం చేతిలో ఎన్ని సీరియల్స్ ఉన్నా కూడా నిరుపమ్ ఎక్కువగా క్రేజ్ అందుకుంటోంది మాత్రం కార్తీకదీపంతోనే.. ఆ సీరియల్ ఇప్పటికే వెయ్యికి పైగా ఎపిసోడ్స్ ను పూర్తి చేసుకుంది.

రోజుకు రెమ్యునరేషన్ ఎంతంటే
ఇక నిరుపమ్ ఆస్తుల వివరాలు, రెమ్యునరేషన్ అంటూ గతంలో చాలా రకాల రూమర్స్ వచ్చాయి. సేవింగ్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండే ఈ నటుడు ఇటీవల కార్తీక దీపం రేటింగ్ మరింత పెరగడంతో రెమ్యునరేషన్ డోస్ పెంచినట్లు టాక్ అయితే వచ్చింది. రోజుకు 22వేల రూపాయలు వరకు అందుకుంటున్నట్లు సమాచారం.

నెలకు లక్షల్లో ఆదాయం
మరో రెండు సీరియల్స్ చేతిలో ఉన్నాయి కాబట్టి అతని రోజు సంపాదన 60వేలకు పైగానే ఉంటుంది. ఈ లెక్కన అతను నెలకు ఈజీగా 14లక్షలకు పైగానే అందుకుంటున్నట్లు చెప్పవచ్చు. భవిష్యత్తులో ఆ రెమ్యునరేషన్ సంఖ్య మరింత పెరిగినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
Recommended Video

ఆస్తుల వివరాలు
ఇక ఆస్తుల విఆహాయనికి వస్తే వైజాగ్ లో నిరుపమ్ కు దాదాపు రూ.5కోట్లు విలువ చేసే ప్రాపర్టీ ఉందని సమాచారం. ఇక హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో 80లక్షల విలువ చేసే ఫ్లాట్ కూడా ఉంది. అంతే కాకుండా 11లక్షల విలువ చేసే రెండు కార్లు కూడా ఉన్నట్లు సమాచారం. నిరుపమ్ సతీమణి మంజుల కూడా సీరియల్స్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆమె కూడా గట్టిగానే సంపాదిస్తోంది కాబట్టి వీరి మొత్తం ఆస్తుల విలువ ఊహించిన దానికంటే ఎక్కువే ఉంటుందని సమాచారం.


Click it and Unblock the Notifications











