Karthika deepam Twist ఎందుకు పుట్టానా అని ఏడుస్తావు.. మోనితకు చెమటలు పట్టించిన దీప

అత్యంత ప్రేక్షకాదరణ పొందిన కార్తీకదీపం సీరియల్‌లో మరో భారీ ట్విస్ట్ చోటుచేసుకొన్నది. తన బిడ్డకు తండ్రి కార్తీక్ అంటూ బ్లాక్ మెయిల్ చేస్తున్న మోనితకు దీప గట్టిగానే షాక్ ఇచ్చింది. దాంతో మోనిత కథ అడ్డం తిరిగినట్టు కనిపిస్తున్నది. ఇప్పటి వరకు కార్తీక్ కుటుంబాన్ని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసిన మోనిత కుట్రలకు మరోసారి దీప అడ్డుకట్ట వేసింది. దాంతో రాబోయే ఎపిసోడ్స్‌లో ఏం జరుగుతుందనే ఆసక్తిని కార్తీకదీపం సీరియల్ కలిగించింది. తల్లి సౌందర్య బలవంతంపై దోష నివారణ పూజకు వచ్చిన కార్తీక్ ఏం చేశాడు? దీప రియాక్షన్ ఏమిటి? ఇంకా తాజా ఎపిసోడ్ 1193‌లో ఏం జరిగిందంటే..

కార్తీక్‌కు ప్రాణగండం ఉందనే కారణంతో

కార్తీక్‌కు ప్రాణగండం ఉందనే కారణంతో

ప్రాణగండం ఉందనే కారణంగా తల్లి సౌందర్య ఒత్తిడి మేరకు కార్తీక్ పూజలో పాల్గొనడానికి వచ్చాడు. పూజ జరుగుతుంటే అనుక్షణం ఇబ్బందిగా కూర్చొన్నాడు. తల్లిపై పీకల్లోతు అసహనంతో ఉన్నట్టు కనిపించాడు. ఇష్టం లేకుండా పూజలో కూర్చొన్న కార్తీక్ మొక్కుబడిగా పూజలు చేశాడు. అయితే కార్తీక్‌ రావడంతో సంతోషంలో మునిగిపోయిన మోనిత.. కాస్త అతిగా ప్రవర్తించడంతో సౌందర్య కూడా అసహనంతో ఊగిపోయింది.

అయిష్టంగా కార్తీక్ పూజ

అయిష్టంగా కార్తీక్ పూజ

పేగు మెడలో వేసుకొని పుట్టిన బిడ్డ వల్ల దోషం ఏర్పడటంతో కార్తీక్, మోనిత కలిసి పూజలు చేశారు. అయితే తనకు ఇష్టం లేకుండా చేస్తున్న పూజా కార్యక్రమంలో దృష్టిపెట్టకపోవడంతో పలుమార్లు పూజారి నిష్టతో చేయమని చెప్పారు. అయినా ఏదో మొక్కుబడిగా పూజలో కూర్చొన్నాడు. పూజ జరుగుతున్నంత సేపు కార్తీక్‌ను, సౌందర్యను రెచ్చగొట్టే విధంగా మోనిత కనిపించింది.

 గుడిలో కార్తీక, మోనితను దీప చూసి

గుడిలో కార్తీక, మోనితను దీప చూసి

గుడి వద్ద సౌందర్య కారు కనిపించడంతో అటువైపు వచ్చిన దీప.. ఆలయంలోకి వెళ్లింది. కాసేపు వెతికిన తర్వాత కార్తీక్, మోనిత పూజ పీటలపై కూర్చొని ఉండటం, పక్కనే సౌందర్య కూడా ఉండటంతో దీపకు గుండె పగిలినంత పనైంది. ఇన్నాళ్లు తనకు ముఖం చాటేయడం వెనుక కారణం ఇదేనా? నాతో అబద్దాలు ఆడటానికి కారణం ఇదేనా అంటూ గుండె పగిలేలా రోదించింది. పూజ అనంతరం బిడ్డను నూనెలో చూసే సీన్ చూసి తట్టుకోలేక బయటకు వెళ్లిపొయింది.

దీప వచ్చిందా? అంటూ కార్తీక్

దీప వచ్చిందా? అంటూ కార్తీక్

పూజపై అయిష్టంగా కూర్చొని ఉన్న కార్తీక్‌కు దీప కనిపించింది. గుడిలో దీపను చూసి షాక్ అయ్యాడు. దీప నిజంగా వచ్చిందా? లేక తాను భ్రమ పడుతున్నానా? అనే భావన గురయ్యాడు. పూజ అనంతరం పూజారితో మాట్లాడుతూ.. నా కొడుకుకు మా మామ గారు పేరు ఆనందరావు అని పెట్టాం. అతడిని ఏరా.. ఒరేయ్ అనకుండా ఆనందరావు గారు అని పిలుస్తున్నాం అని మోనిత అంటే.. ఈ కాలంలో కూడా ఇలాంటి కోడళ్లు ఉంటారా అంటూ చిన్నారిని పూజారి దీవించాడు.

మోనిత ఓవర్ యాక్షన్ చూసి..

మోనిత ఓవర్ యాక్షన్ చూసి..

ఇక మోనిత ఎక్స్‌ట్రాలు చూడలేక అమ్మా.. పూజ అయిపోయింది. ఇక వెళ్తామా అంటూ అడుగు ముందేశాడు. దాంతో అబ్బాయిని ఎత్తుకొని ముద్దు మురిపాలు చేయవా అంటూ ప్రశ్నించింది. అయితే మోనిత అంటూ గట్టిగా అరవబోయి.. ఆగి నీ పేరు పలకడమే ఇష్టం లేదు అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. ఇంకోసారి నాతో ఇలా బిహేవ్ చేయకు మోనితకు షాకిచ్చాడు. అక్కడి నుంచి బయలుదేరడానికి సిద్దమైన కార్తీక్‌ చేయిపట్టి బలవంతంగా ఆపింది. దాంతో తాజా ఎపిసోడ్ ముగిసింది.

నీ క్రిమినల్ బుర్రకు అందనంతగా

నీ క్రిమినల్ బుర్రకు అందనంతగా

ఇక తాజా ప్రోమోలో భారీ ట్విస్ట్ కనిపించింది. ఇక కార్తీక్ ఇంటి నుంచి దీప బయటకు.. నేను ఇంట్లోకి అంటూ మోనిత అంటూ తన ప్లాన్స్‌లో మునిగిపోయింది. అదే సమయంలో తన ఇంటికి దీప రావడంతో మోనిత షాక్ తిన్నది. దీపను చూసి మోనిత కార్తీక్ ప్రేమాయణం సూపర్ హిట్ అంటూ ఏదో చెప్పబోగా.. రాజసంగా వెళ్లి దీప సోఫాలో కూర్చోవడంతో మోనిత కంగుతిన్నది. నీ క్రిమినల్ బుర్రకు అందని విధంగా ఓ షాకిస్తా. నేను ఎందుకు పుట్టానా? అని గోడకు తల బద్దలు కొట్టుకొనేలా చేస్తాను. నీ మీద ఒట్టు అని ఏడ్చే రోజు వస్తుంది అంటూ మోనితకు దీప చెమటలు పట్టించింది. దాంతో సీరియల్‌ మరో మలుపు తిరిగే అవకాశం కనిపించింది.

Recommended Video

Bigg Boss Telugu 5 : Sarayu ఎలిమినేషన్.. జంటల రొమాన్స్ అదుర్స్ !! || Filmibeat Telugu
 కార్తీకదీపం 43వ వారం రేటింగ్

కార్తీకదీపం 43వ వారం రేటింగ్

ఇక కార్తీక దీపం గతంలో టాప్ రేటింగ్‌తో దూసుకెళ్లింది. అయితే ఇటీవల కాలంలో సాగదీత ఎక్కువ కావడంతో ప్రేక్షకులు ముఖం చాటేశారనే విషయం తాజా రేటింగ్స్‌లో స్పష్టమైంది. అయితే 43వ వారంలో రేటింగ్‌ను మెరుగుపరుచుకొన్నది. 42వ వారంలో అర్బన్‌ ప్రాంతంలో 13.53 రేటింగ్, సొంతం చేసుకొన్న ఈ సీరియల్ 43వ వారంలో 13.85 రేటింగ్‌ను సాధించింది. ఇక రూరల్‌లో 42వ వారంలో 14.70 రేటింగ్ సాధించింది. 43వ వారంలో 15.35 రేటింగ్‌ను నమోదు చేసుకొన్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X