twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Karthika deepam అసలు సినిమా ఇప్పుడే.. దీప కొట్టిన దెబ్బతో మోనితకు దిమ్మతిరిగి బొమ్మ చేతికి..!

    |

    కార్తీకదీపం సీరియల్‌లో చాలా రోజుల తర్వాత మరోసారి పవర్ ప్యాక్ట్ ఎపిసోడ్‌ కనిపించింది. గత కొద్దికాలంగా సాదాసీదాగా సాగదీసినట్టు కొనసాగుతున్న సీరియల్‌లో ఆసక్తికరమైన సన్నివేశాలు కనిపించాయి. డాక్టర్ మోనిత, దీప మధ్య మరోసారి పోటాపోటీ సీన్లు కనిపించాయి. అయితే మోనిత చేష్టలకు, అతి విశ్వాసానికి దీప చెక్ పెట్టింది. ఎవరూ ఊహించని విధంగా మోనితకు దీప గట్టి షాక్ ఇచ్చింది. అప్పటి వరకు ఉత్సాహంతో ఉన్న మోనిత ఒక్కసారిగా దిగ్బ్రాంతికి గురైంది. తాజా ఎపిసోడ్ 1196లో మోనిత, దీప మధ్య ఏం జరిగిందంటే..

     దోష నివారణ తర్వాత మోనితకు దీప షాక్

    దోష నివారణ తర్వాత మోనితకు దీప షాక్

    తన కుమారుడు పేగు మెడలో వేసుకొని పుట్టడంతో కార్తీక్, సౌందర్యల చేత దోష నివారణ పూజను చేయించడంలో మోనిత ప్లాన్ వర్కవుట్ అయింది. అయితే కార్తీక, సౌందర్య తన వద్దకు రప్పించుకొన్నాననే ఉత్సాహంలో దీప ఖేల్ ఖతం అని అనుకొంటూ సంతోషంలో మునిగిపోయింది. కార్తీక్ ఇంటి నుంచి దీప బయటకు.. నేను ఇంట్లోకి అంటూ కలలు కన్నది. ఇక దీపకు వంటలు చేసుకొని బతకడమే మిగిలిందంటూ జోష్‌తో కనిపించింది.

    అయితే దీప గురించి తక్కువ చేసి మాట్లాడుతూ తన టాలెంట్‌ను తానే ప్రశంసించుకొంటున్న సమయంలో వంటలక్క ఎంట్రీ ఇచ్చింది. తన ఇంటిలోకి దీప రావడం చూసి.. కాళ్ల బేరానికి వచ్చావా దీపక్క అంటూ పలకరించింది. ఇక నీకు జీవితాతం కంటతడి తప్ప మరో మార్గం లేదు. నీవు వంటలక్కగా మారడం తప్ప మరో మార్గం కనిపించడం లేదు. నేను జైలుకు వెళ్లాను. బిడ్డను కన్నాను. వాడికి దోష నివారణ పూజ కూడా కార్తీక్‌తో జరిపించాను అంటూ ఏకధాటిగా డైలాగ్స్ వర్షం కురిపించింది. అయితే ఓపికగా మోనిత మాటలు విన్న దీప.. తనదైన శైలిలో ఝలక్ ఇచ్చింది.

    దీపక్క నీ సినిమా ముగిసింది అంటూ

    దీపక్క నీ సినిమా ముగిసింది అంటూ

    దీపక్క నీ సినిమా ముగిసింది అంటూ మోనిత చెప్పిన మాటలకు దీప ఘాటుగా సమాధానం ఇచ్చింది. అసలు సినిమా ఇప్పుడే మొదలైంది. నీ క్రిమినల్ బుర్రకు అందని విధంగా ఉంటుంది చూడు. నా వైపు ఎవరున్నారని అడిగావు కదా.. నా గుండెలో ధైర్యం ఉంది. నాలో కొండంత గుండె ధైర్యం ఉంది. అది నీకు త్వరలోనే తెలుస్తుంది మోనిత అంటూ దీప షాకిచ్చింది.

    నీ మీద ఒట్టు అంటూ

    నీ మీద ఒట్టు అంటూ

    తన డైలాగ్స్‌తో కంగారు పడిపోతున్న మోనిత వద్దకు వచ్చి ముఖంపై ఉఫ్ అంటూ ఊదింది. ఉఫ్ అంటే కొట్టుకుపోతావు జాగ్రత్త. దీప అంటే దేవుడిచ్చిన అక్క.. వంటలక్క అనుకొంటున్నావు కదా.. దీప తలుచుకొంటే ఏం చేయబోతుందో అనే విషయం తెలుసుకోవడానికి రెడీగా ఉండు. సినిమా మొదలవ్వబోతున్నది. బాగా తిను మోనిత.. మున్ముందు ఏడవడానికి బాగా ఏడవాలి కదా.. ఈ దీపతో ఎందుకు పెట్టుకొన్నానా అంటూ గోడకు తల బాదుకొనేలా చేస్తాను. నీ మీద ఒట్టు అంటూ దీప డైలాగ్స్‌తో దడదడలాడించింది. అప్పటి వరకు మోనితలో ఉన్న ఉత్సాహానికి అడ్డుకట్ట వేసి అక్కడి నుంచి దీప వెళ్లిపోయింది.

    దీప ధైర్యం ఏమిటి అంటూ..

    దీప ధైర్యం ఏమిటి అంటూ..

    దీప కొట్టిన దెబ్బకు మోనితకు దిమ్మతిరిగిపోయింది. దీప వెళ్లిన తర్వాత షాక్ నుంచి తేరుకొని.. ఏంటది ప్రియమణి.. దీప ధైర్యం ఏమిటో అర్ధం కావడం లేదు అని మోనిత అంటే.. నాకు కూడా అర్ధం కావడం లేదు అంటూ ప్రియమణి సమాధానం చెప్పింది. తుఫాన్ వచ్చినట్టు మిమ్మల్ని దులిపేసి పోయింది. చూడబోతే దీపమ్మ సినిమానే హిట్ అయ్యేలా కనిపిస్తున్నదంటూ ప్రియమణి చెప్పగానే.. ఆమెను ఫ్లవర్ వాజ్‌తో మోనిత కొట్టబోయింది. కోపాన్ని ఆపుకొని ఫ్లవర్ వాజ్‌ను నేలకోసి కొట్టింది. ఆ తర్వాత దీప ధైర్యం ఏమిటి అనే ఆలోచనల్లో పడింది.

    దీప వార్నింగ్‌ను తట్టుకోలేక

    దీప వార్నింగ్‌ను తట్టుకోలేక

    సినిమా ఇప్పుడే మొదలైంది అంటూ దీప ఇచ్చిన వార్నింగ్‌ను మోనిత తట్టుకోలేకపోయింది. దీపకు అంత ధైర్యం ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి వచ్చింది? అయ్యో నా జీవితం ఇలా అయిపొయిందేమిటని ఏడువాల్సిన దీప.. ఏ మాత్రం వణకకుండా నాకే ఛాలెంజ్ విసిరిందంటే.. ఆమె ప్లాన్ ఏమిటి? నేను ఎక్కడా ఛాన్స్ ఇవ్వకుండా ప్లాన్ చేసుకొన్నాను. ఆనందరావు పుట్టుక ముందు ఉన్న ధైర్యం ఇప్పుడు కూడా ఉంది. ఆమె వేసిన ప్లాన్ ఏమిటనే ఆలోచనల్లో మోనిత పడింది.

    దీపమ్మ సినిమానే హిట్ అంటూ ప్రియమణి

    దీపమ్మ సినిమానే హిట్ అంటూ ప్రియమణి

    దీప ఇచ్చిన స్ట్రోక్‌తో ఆలోచనల్లో పడిన మోనితను చూసి ప్రియమణి.. ఏంటమ్మా అంతగా ఆలోచిస్తున్నావు. మీ ఇంటికి వచ్చి మిమ్మల్నే భయపెట్టిందంటే.. దీపమ్మ వద్ద ఏదో ప్లాన్ ఉందనే విషయం అర్ధమవుతున్నది అని ప్రియమణి అంటే.. నీకు తెలివి తేటలు ఉన్నాయనే విషయం నాకు తెలుసు. అతితెలివి తేటలు ఉన్నాయనే విషయం కూడా తెలుసు. అవి నా వద్ద ప్రదర్శించకు. నీకు సంబంధం లేని విషయాలను ఆలోచించకు. ఎక్కడ ఉండే వాళ్లు అక్కడే ఉంటే మంచిది అంటూ ప్రియమణికి వార్నింగ్ ఇచ్చింది.

    టెన్షన్ పడే బ్యాచ్ కాదు అంటూ మోనిత

    టెన్షన్ పడే బ్యాచ్ కాదు అంటూ మోనిత

    దీప ఇచ్చిన షాక్ నుంచి కోలుకొని.. నా ఇంటికి వచ్చి నాకే వార్నింగ్ ఇస్తుందా? వార్నింగ్ ఇస్తే.. నేను టెన్షన్ పడాలా? మోనిత టెన్షన్ పడే బ్యాచ్ కాదు.. టెన్షన్ పెట్టే బ్యాచ్ అంటూ మోనిత మరో కుట్రకు తెరలేపింది. ఫోన్ తీసుకొని కార్తీక్ ఫోన్ చేయడం లేదు అంటూ తనలో తాను అనుకొననది. వెంటనే కార్తీక్ ఫోన్ చేసింది. అయితే మోనిత కాల్‌ను అయిష్టంతో ఎత్తి.. ఫోన్ ఎత్తాడు. దాంతో డాక్టర్ బాబు అంటూ శబ్దం వినిపించడంతో దీప అంటూ కార్తీక్ అన్నాడు.

    నా వద్ద ఫోన్ నంబర్లు చాలా ఉన్నాయి... ఇక నుంచి ఫోన్ చేస్తూనే ఉంటాను. ఇక నుంచి నాకు ఫోన్ చేయకు. నీకు నాకు సంబంధం లేదు అంటూ గట్టిగా అరిచాడు. అయితే నా నుంచి, నా ప్రేమ నుంచి తప్పించుకొన్నావో పాతాళానికి తొక్కేస్తాను అని మోనిత అంటే.. షటప్ అంటూ కార్తీక్ గట్టిగా అరిచాడు. దీపను నీవు ఎంత ఎక్కువగా ప్రేమిస్తే.. నేను అంత ఎక్కువ ద్వేషిస్తాను. చూడు నేను ఏం చేస్తానో అంటూ మోనిత మరోసారి కొత్త కుట్రకు సిద్దమైంది.

    Recommended Video

    Bigg Boss Telugu 5 : Sarayu ఎలిమినేషన్.. జంటల రొమాన్స్ అదుర్స్ !! || Filmibeat Telugu
    కార్తీకదీపం 44వ వారం రేటింగ్ ఇలా

    కార్తీకదీపం 44వ వారం రేటింగ్ ఇలా

    ఇక కార్తీకదీపం సీరియల్ రేటింగ్ విషయానికి వస్తే.. గతంతో పోల్చుకొంటే భారీగానే తగ్గింది. కంటెంట్ సాధారణంగా ఉండటం, మిగితా సీరియల్స్ నుంచి గట్టి పోటీ ఎదురవుతున్న నేపథ్యంలో రెగ్యులర్‌గా రేటింగ్ పడిపోతూ వస్తున్నది. ఇక తాజా వారం రేటింగ్ కూడా తగ్గడం గమనార్హం. 43 వారంలో అర్బన్‌లో 13.85 రేటింగ్ వస్తే.. 44 వారంలో 13.64 రేటింగ్‌ను నమోదు చేసింది. ఇక రూరల్ ప్రాంతంలో 43 వారం 15.35 రేటింగ్ వస్తే.. 44వ వారం 14.99 రేటింగ్‌ను సొంతం చేసుకొన్నది.

    English summary
    Karthika Deepam November 13th Episode number 1196: Deepa face off with Monita. Deepa warned monita goes powerful.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X