Karthika deepam ఆదిత్య చేతికి అగ్గిపుల్ల అంటూ కార్తీక్ కుటుంబం చిచ్చు పెట్టిన మోనిత
కార్తీకదీపం సీరియల్‌లో డాక్టర్ మోనిత తన కుట్రలకు మరోసారి పదును పెట్టింది. తన కొడుకు పేగు మెడలో వేసుకొని పుట్టారనే కారణంతో దోష నివారణ పూజ చేయించుకొన్న తర్వాత దీప ఇచ్చిన షాక్‌తో డీలా పడినట్టు కనిపించినా.. మరో కుట్రకు తెర లేపింది. కార్తీక్ కుటుంబంలో చిచ్చు పెట్టేందుకు స్టోరిని రచించింది. అయితే తాజా ఎపిసోడ్ 1198లో మోనిత ఏం చేసిందంటే..

దీప తీరుతో కార్తీక్‌లో కంగారు..
తల్లి సౌందర్య బలవంతంతో మోనితతో పూజలో కూర్చొన్న విషయం గురించి తనకు చెప్పకపోవడంపై దీప సెటైర్లు వేసింది. డైనింగ్ టేబుల్ వద్ద భోజనం చేస్తున్న కార్తీక్, ఆనందరావు, సౌందర్య, ఆదిత్యను తాను చేసిన వంటకు ఎంత రేటింగ్ ఇస్తారని అడిగింది. అయితే పూజ విషయం తెలిసిన దీప ఎలా రియాక్ట్ అవుతుందనే కంగారులో ఉన్న కార్తీక్, ఆయన తల్లిదండ్రులకు దీప వ్యవహారం విచిత్రంగా అనిపించింది.

వంటలకు రేటింగ్ అంటూ సెటైర్లు
తాను చేసిన గుత్తి వంకాయ కూర, దోసకాయ పచ్చడి, ఇతర వంటకాలకు ఎంత రేటింగ్ ఇస్తారు దీప అడిగింది. అయితే కార్తీక్ ఏం చెప్పాలని తడబాటు పడుతుంటే.. నన్ను ఫెయిల్ చేయకండి. పాస్ చేయండి అంటూ దీప వేడుకొన్నది. దాంతో పదికి పది అంటూ కార్తీక్ సమాధానం చెప్పాడు. దాంతో మీరు అబద్దాలు చెబుతున్నారు. మీరు అన్నీ అబద్దాలు చెబుతున్నారు. గుత్తి వంకాయ కూర సరిగా కుదర్లేదు. దానికి పది పది అంటే ఎలా ఉంటుంది. వంటల్లో పాస్ చేశారని .. జీవితంలో ఫెయిల్ చేయకండి అంటూ కార్తీక్ కుటుంబానికి దీప షాకిచ్చింది. దాంతో కార్తీక్, ఆనందరావు, సౌందర్య కంగారుపడిపోయారు.

ఇల్లు.. ఇల్లాలు అంటూ ప్రియమణి
ఇక తన ఇంటిని సర్దుకొంటూ పనిమనిషి ప్రియమణికి మోనిత చివాట్లు పెడుతూ కనిపించింది. ఇంటికి ఎవరైనా వస్తే ఇల్లు ఉంటే ఎలా.. ఇంటిని చూసి ఇల్లాలిని అంచనా వేస్తారు అని మోనిత అంటే. ఇదో ఇల్లు,.. మీరో ఇల్లాలు అంటూ ప్రియమణి మనసులో గొణుక్కున్నది. మిమ్మల్ని, మీ ఆలోచనలను పసిగట్టడం అంత సులభం కాదులే అమ్మ అంటూ ప్రియమణి సమాధానం ఇచ్చింది. అంతలోనే ఊహించని రీతిలో కార్తీక్ సోదరుడు ఆదిత్య ఇంటిలోకి రావడంతో ప్రియమణి షాక్ తిన్నది.

నీవు అన్నీ అబద్దాలే అంటూ ఆదిత్య
ఇంట్లోకి ఆదిత్య వస్తూనే అన్నయ్య ఎక్కడ అంటూ మోనితను ప్రశ్నించాడు. అయితే వస్తాను అంటూ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోతుంటే.. ఆగు ఆదిత్య.. నీకు కొన్ని నిజాలు చెప్పాలి అంటూ ఆపింది. నీవు చేసేది అన్ని తప్పులే.. మాట్లాడేది అన్ని అబద్దాలు అంటూ ఆదిత్య కోపం చేశారు. అయితే నేను చెప్పేది మన ఇంటికి సంబంధించిన విషయం. నాకు బాబు పుట్టాడు. వాడికి ఆనందరావు అని పేరు పెట్టాం . అబ్బాయిని చూడు అంటూ మోనిత అంటే.. ఇక నాటకాలు ఆపు అంటూ ఆదిత్య ఫైర్ అయ్యాడు.

భర్తగా వచ్చి కార్తీక్ సంతకం అంటూ మోనిత
దాంతో ప్రియమణిని లోపలికి పంపిస్తూ.. మేము మేము చాలా మాట్లాడుకోవాలి చెప్పింది. ఆదిత్య కూర్చో అంటే.. నీతో మాట్లాడటానికి సంతోషంగా లేను కటువుగా సమాధానం ఇచ్చాడు. దీంతో అసలు విషయం చెబుతాను విను. నేను హాస్పిటల్‌లో ఉంటే.. భర్త హోదాలో వచ్చి కార్తీక్ వచ్చి సంతకం పెట్టాడు. అబ్బాయి పేగు మెడలో వేసుకొని పుడితే మీ అమ్మ స్వయంగా దోష నివారణ పూజ నిర్వహించింది. ఇవన్నీ నీకు చెప్పలేదా అంటూ పూజకు సంబంధించిన ఫోటోలను చూపించింది.

పరువు పోతుందని అబద్దం ఆడా
ఇక అందరికి చెప్పినట్టు నాది కృత్రిమ గర్బం కాదు.. ఓసారి మీ అన్నయ్య తాగి వచ్చి.. అందరి పరువు పోతుందని నేను అబద్దం చెప్పాను. లేకపోతే పూజకు మీ అన్న ఎందుకు వస్తాడు. ఇప్పుడు నేను ఫోన్ చేస్తే.. కార్తీక్ ఫోన్ ఎత్తడం లేదు అంటూ ఆదిత్యకు కథ అంతా చెప్పింది. మోనిత చెప్పిన విషయాలు విని ఆదిత్య ఆగ్రహంతో బయటకు వెళ్లిపోయాడు. ఆదిత్య వెళ్లిపోయిన తర్వాత అగ్గిపుల్ల ఆదిత్య చేతికి ఇచ్చాను. ఇంటికి వెళ్లి తానే వెలిగిస్తాడు అంటూ మోనిత సంబరపడిపోయింది.

కార్తీక్‌పై రగలిపోయిన ఆదిత్య
అన్నయ్య కార్తీక్ ఇలా చేశాడంటే.. వదినమ్మకు అన్యాయం చేస్తాడా? పెద్దవాడైతే ఏమిటి కాలర్ పట్టుకొని అడిగేస్తాను. అలా బైక్‌పై వెళ్తుంటే కారు ట్రబుల్ ఇవ్వడంతో రోడ్డుపై ఆగిపోయిన కార్తీక్‌ను చూసి ఆగాడు. అన్నయ్య ఏం చేస్తున్నావు.. వదిన బతుకు ఏం కావాలి? ఇప్పుడే మోనిత ఇంటికి వెళ్లి వస్తున్నాను. ఆమె నాకు అంతా చెప్పింది అంటూ కార్తీక్‌ను ఆదిత్య కడిగిపడేశాడు.
Recommended Video

44వ వారం కార్తీకదీపం రేటింగ్ ఇలా
కార్తీకదీపం సిరీయల్ విషయానికి వస్తే.. కొద్ది నెలలుగా రేటింగ్ విషయంలో ఎదురు లేకుండా దూసుకెళ్తున్నది. ఈ ఏడాదికి సంబంధించి 43 వారంలో అర్బన్ ప్రాంతంలో 13.85 రేటింగ్, 44వ వారంలో 13.64 రేటింగ్‌ను సొంతం చేసుకొన్నది. ఇక రూరల్ ప్రాంతంలో 43వ వారం 15.35 రేటింగ్, 44వ వారం 14.99 రేటింగ్‌ను సొంతం చేసుకొన్నది.


Click it and Unblock the Notifications











