Karthika Deepam నీ సినిమాకు క్లైమాక్స్ అక్కడే.. దీప ఇచ్చిన స్ట్రోక్‌కు మోనితకు చెమటలు

అత్యంత ప్రేక్షకాదరణ సొంతం చేసుకొంటూ కార్తీకదీపం సీరియల్ అనేక మలుపులతో కొనసాగుతున్నది. మోనిత కుట్రలతో కార్తీక్ కుటుంబం టెన్షన్‌లో పడిపోయింది. అయితే మోనిత ఎత్తులకు పైఎత్తులు వేస్తూ దీప షాకులు ఇస్తున్నది. అయితే ఇంటి సభ్యులు తనతో ప్రవర్తిస్తున్న తీరును చూసి దీప తనదైన శైలిలో వారిని కంగారు పెడుతున్నది. ఈ క్రమంలో మోనితకు దీప ఇచ్చిన ట్విస్టు ఆసక్తిగా మారింది. తాజా ఎపిసోడ్‌కు సంబంధించిన 1201 ఎపిసోడ్ వివరాల్లోకి వెళితే..

నాన్నమ్మతో శౌర్య, హిమ

నాన్నమ్మతో శౌర్య, హిమ

దీపావళీ రోజు దీప పుట్టిన రోజు కావడంతో హిమ, శౌర్య సంతోషంలో మునిగిపోయారు. అయితే తమ నాన్నమ్మ సౌందర్యను ప్రశ్నలతో వేధించారు. గతంలో ఫ్యామిలీ అంతా సంతోషంగా ఉండేవాళ్లం. గతంలో అందరం కలిసి హోటల్‌కు వెళ్లి తినేవాళ్లం. ఇప్పుడా పరిస్థితి ఎందుకు లేదంటూ ప్రశ్నల వర్షం కురిపించింది. ఈ రోజు అమ్మ పుట్టిన రోజు ఎక్కడికైనా వెళ్దాం అని నాన్నమ్మను హిమ, శౌర్య అడిగారు.

రోజు చచ్చిపుట్టే వాళ్లకు బర్త్ డే అవసరమా?

రోజు చచ్చిపుట్టే వాళ్లకు బర్త్ డే అవసరమా?


హిమ, శౌర్య తమ తల్లి బర్త్ డే అని చెప్పడంతో పుట్టిన రోజా? చెప్పలేదేమిటి అని దీపను సౌందర్య అడిగింది. అయితే రోజు చచ్చి, పుట్టే వాళ్లకు పుట్టిన రోజు జరుపుకోవడం అవసరమా? అని దీప తనదైన శైలిలో జవాబిచ్చింది. దాంతో సౌందర్య ముఖం వాడిపోయింది. పిల్లలు గోల్కోండ కోటకు వెళ్దామని అంటున్నారు.. వెళ్దామా అని దీపను అడిగితే.. లేదు సమాధుల వద్దకు వెళ్దాం అంటూ దీప తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది.

దీపకు అసలు చెప్పడానికి కార్తీక్ ప్రయత్నం

దీపకు అసలు చెప్పడానికి కార్తీక్ ప్రయత్నం

ఇక మోనితను కలువడానికి వెళ్లి కార్తీక్ రావడంతో దీప అతడిని చూసి నవ్వింది. పిల్లలతో కలిసి బయటకు వెళ్దామని అనుకొన్నాం కదా.. కాస్త లేటు అయింది అని దీపకు కార్తీక్ ఏదో సర్ది చెప్పబోయాడు. అయితే దీప అదో రకంగా నవ్వి.. ఓ రకంగా చూడటంతో వాస్తవాన్ని చెప్పేందుకు ప్రయత్నించాడు. దీప నీతో ఓ విషయం మాట్లాడాలనుకొంటున్నాను అంటే.. ఇప్పుడే ఎందుకు తర్వాత మాట్లాడుకొందాం. ముందు దీపావళీని జరుపుకొందాం పదపద అంటూ తీసుకెళ్లింది.

ఇంటిలో దీపావళీ వేడుకలు

ఇంటిలో దీపావళీ వేడుకలు

దీపావళీ పండుగను ఇంటి సభ్యులతో జరుపుకొనేందుకు ఇంటి ముందుకు వచ్చారు. కానీ ఆదిత్య, కార్తీక్, ఆనందరావు, సౌందర్య ముఖాల్లో ఆనందం కనిపించడం లేదు. కానీ దీప వారిని రెచ్చగొడుతూ వాళ్లకంటే హుషారుగా పటాసులను పేల్చుతూ హడావిడి చేసింది. ఏంటీ మీరందరూ అలా డల్‌గా ఎందుకు ఉన్నారని అడుగుతూ వారిని కంగారు పెట్టింది. అలా ఇంటిలో దీపావళీ వేడుకలు జరిగాయి.

కార్తీక్ ఇంట్లో మోనిత హంగామా

కార్తీక్ ఇంట్లో మోనిత హంగామా


ఇక కార్తీకదీపం సీరియల్‌కు సంబంధించిన ప్రోమో ఆసక్తికరంగా కనిపించింది. ఏకంగా కార్తీక్ ఇంటికి వచ్చిన మోనిత అందర్నీ షాక్ గురిచేసింది. మోనిత వచ్చి ఇంటిలో అందరికి గుండె దడను పెంచింది. మీరంతా నా ఇంటికి రావాలి. ఇంట్లో తన కుమారుడికి బారసాల జరపాలని నిర్ణయించుకొన్నాను. కాబట్టి మీరంతా తప్పకుండా రావాలి అని మోనిత అంటే.. షటప్ అంటూ కార్తీక్ గట్టిగా అరిచాడు.

నీ కథకు అక్కడే ముగింపు

నీ కథకు అక్కడే ముగింపు

అయితే మోనిత బారసాల విషయం ఎత్తగానే.. దీప తనదైన శైలిలో స్పందించింది. మోనిత నీ కొడుకు బారసాల జరుపుకో. కార్తీక్‌తోపాటు అందర్నీ మీ ఇంటికి తీసుకొస్తాను. నీ సినిమాకు అక్కడే భారీ క్లైమాక్స్ ఇస్తాను. నీ కథకు అక్కడే ముగింపు చెబుతాను అంటూ దీప షాకిచ్చింది. దాంతో మోనితకు చెమటలు పట్టాయి. ఏం జరుగుతుందో అర్ధం కాని పరిస్థితి కనిపించింది.

Recommended Video

Bigg Boss Telugu 5 : Sarayu ఎలిమినేషన్.. జంటల రొమాన్స్ అదుర్స్ !! || Filmibeat Telugu
45వ వారంలో టాప్ టీఆర్పీతో కార్తీకదీపం

45వ వారంలో టాప్ టీఆర్పీతో కార్తీకదీపం

ఇదిలా ఉండగా, కార్తీకదీపం కొన్ని నెలల నుంచి టాప్ రేటింగ్‌తో దూసుకెళ్తున్నది. ఈ సీరియల్‌కు సంబంధించి.. ఈ ఏడాదికి అర్బన్ ప్రాంతంలో 45 వారంలో 14.13 రేటింగ్‌ను నమోదు చేసుకొన్నది. ఇక రూరల్ ప్రాంతంలో 45 వారంలో 15.71 రేటింగ్‌ను సాధించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X