For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Karthika Deepam కార్తీక్‌కు పొంచి ఉన్న ప్రాణ గండం.. మోనిత కుట్రతో.. !

  |

  కార్తీకదీపం సీరియల్‌ సరికొత్త మలుపులతో ఆసక్తికరంగానే కాకుండా ప్రేక్షకులను ఆకట్టుకొనే విధంగా కొనసాగుతున్నది. మోనిత పండంటి బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత డాక్టర్ కార్తీక్ కుటుంబం మరోసారి సమస్యల్లో పడింది. తల్లి సౌందర్యతో కలిసి కార్తీక్ హాస్పిటల్‌కు వెళ్లి సంతకం చేయడంతో మోనితకు ఆపరేషన్ చేసి బిడ్డకు జన్మను ఇచ్చేలా డాక్టర్ భారతీ చేసిన విషయం దీపకు తెలిసింది. అయితే కృత్రిమ గర్భం ద్వారా మోనిత ఎలా బిడ్డకు జన్మనిచ్చిందనే విషయంపై మాతృశ్రీ సంతాన కేంద్రం నుంచి దీప సమాచారాన్ని సేకరిస్తున్నది. ఈ క్రమంలో ఫోన్ తీసుకోకుండా దీప ఇంటి నుంచి ఎవరికి చెప్పకుండా బయటకు వెళ్లడంతో ఇంటిలోని కుటుంబ సభ్యులు కంగారు పడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో కార్తీకదీపం సీరియల్‌లో 1185 ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే..

  దీప కనిపించకుండా పోవడంతో కార్తీక్

  దీప కనిపించకుండా పోవడంతో కార్తీక్

  దీప కనిపించకుండా పోయారనే విషయాన్ని శౌర్య, హిమ చెప్పడంతో సౌందర్య, ఆనందరావు కంగారు పడ్డారు. దీప ఎక్కడికి పోయింది. కనీసం ఫోన్ కూడా తీసుకెళ్లలేదు. రాత్రంతా నిద్ర కూడా పోలేదని వారిద్దరు అనుకొంటూ కంగారు పడ్డారు. ఇంట్లో ఏమౌతున్నది సౌందర్య అంటూ ఆనందరావు ఆందోళన పడ్డారు. దాంతో నాకు అర్థం కావడం లేదండి అంటూ సౌందర్య సమాధానం చెప్పింది.

  ప్రియమణి మోనితకు గూఢచారిగా

  ప్రియమణి మోనితకు గూఢచారిగా

  కార్తీక్ తల్లిదండ్రులు ఆనందరావు, సౌందర్య ఓవైపు కంగారు పడుతుంటే.. ఇంట్లో వంటమనిషిగా దీప పెట్టిన ప్రియమణి గూఢచారిగా మోనితకు సమాచారాన్ని చేరవేస్తున్నది. బిడ్డ పుట్టిన విషయాన్ని నాకు మోనిత ఫోన్ చేసి చెప్పిందంటే.. నీకు మోనిత ఫోన్ చేసిందా? నీకు తెలిసిన విషయాన్ని నీవద్దే ఉంచుకో. దీపకు చెప్పకు అంటూ సౌందర్య సూచించింది. అయితే మెడకు పేగు వేసుకొని పుట్టడం వల్ల తండ్రి, మేనమామకు అరిష్టం. ప్రాణగంఢం అంటూ ప్రిమమణి చెప్పడంతో సౌందర్య మరింత కంగారు పడింది.

  కార్తీక్ ప్రాణాలకు గండం..

  కార్తీక్ ప్రాణాలకు గండం..

  ఇక మోనిత బిడ్డ పేగు మెడలో వేసుకోని పుట్టడం కారణంగా పూజలు చేయాలని, మేనమామ లేకపోవడం తండ్రికి ప్రాణగండం ఉంటుంది అని సౌందర్యకు ప్రియమణి చెప్పింది. దాంతో సౌందర్య ఆలోచనల్లో పడిపోయింది. నాకు కూడా ఎవరో చెప్పారు అంటూ ఆమె ఆలోచనల్లో పడిపోయింది. ఇంట్లో జరుగుతున్న విషయాలను పూసగుచ్చినట్టు పక్కాగా మోనితకు ప్రియమణి చేరవేసింది. అయితే నువ్వు నేను చెప్పినట్టు చేశావా? అని మోనిత అడిగితే.. అవునమ్మా.. కానీ నాకు ఇక్కడ ఉండటం చాలా భయంగా ఉంది అంటూ ప్రియమణి అంటే.. మోనిత ఉన్న తర్వాత నీకు భయమా అంటూ మోనిత ధైర్యం చెప్పింది. హాస్పిటల్‌‌లో ఉండి నేను కార్తీక్ కుటుంబంలో ఒక్కొక్కరిని ఆటాడిస్తాను. నేను కూర్చోమంటే కూర్చొంటారు. నిలబడమంటే నిలబడుతారు అని కార్తీక్ తన కుట్రలకు పదునుపెట్టింది.

  మోనిత కృత్రిమ గర్భంపై కూపీలాగుతున్న దీప

  మోనిత కృత్రిమ గర్భంపై కూపీలాగుతున్న దీప


  మోనిత కృత్రిమ గర్భానికి ఎవరు సహాయం చేశారనే విషయాన్ని తేల్చుకోవడానికి మాతృశ్రీ సంతాన కేంద్రానికి వెళ్లిన దీపకు డాక్టర్ అసలు విషయాన్ని చెప్పారు. మేము ఎవరికి వీర్యం శాంపిల్స్ ఇవ్వలేదు. రిపోర్టులు కూడా కార్తీక్ తీసుకెళ్లేలేదు. ఆ రిపోర్టులు కూడా సీల్ చేసి అలానే ఉన్నాయి. కావాలంటే మీరు తీసుకెళ్లండి అంటే.. మీ హాస్పిటల్ నుంచి ఎవరో ఇచ్చారు. అవసరమైతే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తానని డాక్టర్‌కు దీప వార్నింగ్ ఇచ్చింది. అయితే తమ సంస్థలో అలాంటిదేమీ లేదు అంటూ డాక్టర్ చెప్పగానే... ఏదో అనుమానంతో దీప బయటకు వచ్చింది.

  Recommended Video

  Bigg Boss Telugu 5 : Sarayu ఎలిమినేషన్.. జంటల రొమాన్స్ అదుర్స్ !! || Filmibeat Telugu
  మోనిత.. ఆపు నీ కుట్రలు అంటూ భారతీ

  మోనిత.. ఆపు నీ కుట్రలు అంటూ భారతీ


  అయితే తన కొడుకుకు శాంతి పూజలు చేయిస్తానని డాక్టర్ భారతికి మోనిత చెబితే.. అందుకు అభ్యంతరం చెప్పింది. ఇంతంటితో నీ ప్లాన్స్ ఆపేయి. నీవు అనవసరంగా తొందరపడి అసలికే ఎసరు తెచ్చుకోకు. నీవు చాలా తొందరపడుతున్నావు అంటూ భారతీ చెప్పింది. అయితే నా కొడుకును అనాథగా పెంచను. ది గ్రేట్ ఆనందరావు, సౌందర్య మనవడిగా పెంచుతాను. దీప చేసిన తప్పులను నేను చేయను. ఇక సౌందర్య గుడికి వెళ్లి శాంతి పూజలు చేయిస్తుంది చూడు అంటూ మోనిత తన భరోసాను వ్యక్తం చేసింది.

  English summary
  Karthika Deepam November 1st Episode number 1185: Monita sharps her conspiracy over Karthik family from hospital after giving birth to Baby Boy. Deepa is chasing Monita's conspiracy to her family.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X