Karthika Deepam మోనిత ఇంట్లో బారసాల.. అదిరిపోయే క్లైమాక్స్ దీప ప్లాన్ రెడీ

కార్తీకదీపం సీరియల్‌లో మరో భారీ ట్విస్ట్‌కు తెరలేసింది. మోనిత ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్న దీప.. ఇంటి నుంచి అదృశ్యమైపోయింది. తన కుమారుడి బారసాల ఏర్పాట్లలో మోనిత మునిగిపోయిన సమయంలో దీప అదృశ్య కావడం కుటుంబ సభ్యులకు అంతుపట్టలేదు. దీప అంచనాలను అందుకోలేకపోతున్నాం అంటూ కార్తీక్ షాక్‌లో మునిగిపోయాడు. తాజా ఎపిసోడ్ 1202లో ఏం జరిగిందంటే..

కార్తీక్‌ను పంపిస్తారా? మీరు వస్తారా అంటూ

కార్తీక్‌ను పంపిస్తారా? మీరు వస్తారా అంటూ

కార్తీక్ కుటుంబం దీపావళీ వేడుకల్లో ఉన్న సమయంలో సౌందర్యకు మోనిత కాల్ చేసింది. పండుగ ఘనంగా జరుపుకొంటున్నారా? అంటూ కుశల ప్రశ్నల వేయడానికి ప్రయత్నిస్తే.. ఎందుకు ఫోన్ చేశావు అంటూ సౌందర్య అడిగింది. పండుగ సమయంలో ఎలా ఉన్నారని ఫోన్ చేశాను. అలాగే బాబుకు బాగాలేదు. ఇంట్లో ఒంటరిగా ఉన్నాను. వీలైతే కార్తీక్‌ను పంపిస్తారా.. మీరు వచ్చినా పర్వాలేదు అని మోనిత అడిగింది. అయితే మోనిత ప్రశ్నకు సౌందర్య చిరాకుపడుతుండగానే.. పక్కనే దీపతో పటాకులు కాలుస్తున్న కార్తీక్.. దీప జాగ్రత్త.. చీర కాలుతుంది అంటూ గట్టిగా అరిచాడు. దాంతో మోనిత ఉడికి పోయి ఫోన్‌ను గట్టిగా విసిరికొట్టింది.

దీప ధైర్యం ఏమిటి అంటూ

దీప ధైర్యం ఏమిటి అంటూ


ఇక దీపతో కలిసి దీపావళీ సంబురాలు జరుకొంటున్న కార్తీక్‌ అరుపు విన్న మోనిత మనసు అతలాకుతలం అయింది. కొద్ది రోజుల క్రితం సినిమా ఇప్పుడే మొదలైందంటూ దీప ఇచ్చిన షాక్‌ను గుర్తు చేసుకొన్నది. దీప ధైర్యం ఏమిటి? అంటూ ఆలోచనల్లో పడింది. అంతలోనే ప్రియమణి వేసిన ప్రశ్నలకు చిరాకు పడింది. ఒక ప్రశ్నకు సమాధానం చెప్పలేదంటే.. మౌనంగా ఉండాలి అంటూ మోనిత కసురుకొన్నది.

ఏదో కీడు శంకిస్తున్నదంటూ

ఏదో కీడు శంకిస్తున్నదంటూ


మోనిత బిడ్డకు పూజ చేయించిన విషయం తెలిసి కూడా నవ్వుతూ ఉందంటే.. ఏదో ప్లాన్ ఉండి ఉంటుంది అని కార్తీక్ తన తల్లిదండ్రులతో చర్చించాడు. అయితే దీప ఆనందం వెనుక ఏదో కీడు శంకిస్తున్నది. దీప ఆలోచనలు ఏమై ఉంటాయి. దీపను కళ్లలోకి చూడలేకపోతున్నాను. ఏమీ మాట్లాడలేకపోతున్నాను అంటూ కార్తీక్ అన్నాడు. బర్త్ డే విషెస్ కూడా చెప్పలేకపోతున్నాను అంటూ కార్తీక్ తండ్రి ఆనందరావు కూడా అన్నారు.

దీపకు మోనిత హ్యాపీ బర్త్ డే

దీపకు మోనిత హ్యాపీ బర్త్ డే


దీప బర్త్ డే కావడంతో గుడికి వెళ్లి వస్తాం అంటూ చెప్పింది. అత్తయ్య గుడికి వెళ్తున్నాం. మీరు వస్తారా? అంటూ సౌందర్యను దీప అడిగింది. దాంతో అందరూ ముఖాలు చూసుకొన్నారు. అంతలోనే హిమ మాట్లాడుతూ.. అమ్మకు బర్త్ డే విషెస్ చెప్పరా అంటూ తండ్రిని, నాన్నమ్మను అడిగింది. అయితే నాకు ఎప్పుడో మంచి బర్త్ డే గిఫ్ట్ ఇచ్చారు అంటూ దీప సెటైర్ వేసింది. అత్తమ్మ, మామయ్య నన్ను దీవించండి అంటూ కాళ్లు మొక్కింది. నూరేళ్లు చల్లగా దీవించాలని వారు ఆశీర్వదించారు. అయితే డాక్టర్ బాబు నన్ను కూడా దీవించండి ... లేచి నిలుచొండి.. అని కాళ్లు మొక్కింది. అంతలోనే మోనిత హ్యాపీ బర్త్ డే దీపక్క అంటూ ఎంట్రీ ఇవ్వడంతో అందరూ షాక్‌కు గురయ్యారు.

మోనిత నీ సెలక్షన్ బాగుంది..

మోనిత నీ సెలక్షన్ బాగుంది..

అందరూ చూస్తుండగానే దీప వద్దకు వచ్చి.. హ్యపీ బర్త్ డే దీప.. అంటూ విషెస్ అందజేసి.. బొకేను ఇచ్చింది. బొకేను తీసుకొంటూ.. నీ సెలక్షన్ బాగుంది అంటూ ప్రశంసించింది. అయితే నీవు ఇంటికి వస్తే అతిథి మర్యాదలు చేయలేకపోతున్నాను. సరే నాతో నీవు గుడికి రా.. అలాగే బర్త్ డే పార్టీ కూడా ఇస్తాను అంటూ హుషారుగా మట్లాడటంతో మోనిత కంగారు పడింది. కంగారు నుంచి తేరుకొని.. నేను గుడికి రాలేను. కానీ మీరంతా మా ఇంటికి రావాలి. అబ్బాయి బారసాల చేస్తున్నాను అని మోనిత అంటే.. కార్తీక్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

మోనిత.. నీ బారసాల ఏర్పాట్లు చేసుకో..

మోనిత.. నీ బారసాల ఏర్పాట్లు చేసుకో..

అయితే కార్తీక్‌ను ఉద్దేశించి.. ఏంటి నా బాబు మాత్రమే కాదు.. నీ బాబు కూడా. మీ ఇంటి వంశాకురం అంటూ ఏదో చెప్బబోతుంటే... కార్తీక్ కొట్టబోయాడు. అయితే సౌందర్య తన కుమారుడిని ఆపింది. అయితే కార్తీక్, మోనిత మధ్య గొడవలో దీప జోక్యం చేసుకొంది. మోనితతో దీప మాట్లాడుతూ.. నీ బారసాల ఏర్పాట్లు చేసుకో.. నీ సినిమాకు అదిరిపోయే క్లైమాక్స్ ఇస్తానని చెప్పా కదా.. బొకే తెచ్చినందుకు థ్యాంక్స్. అందర్నీ తీసుకొచ్చే బాధ్యత నాదే అంటూ గుడికి వెళ్లిపోయింది. దాంతో మోనిత కూడా అక్కడి నుంచి వెళ్లిపోయింది.

దీప అదృశ్యమవ్వడంతో కంగారు..

దీప అదృశ్యమవ్వడంతో కంగారు..

తన పిల్లలు హిమ, శౌర్యతో గుడికి వెళ్లిన దీప ఇంటికి తిరిగి రాలేదు. దీప ఏదని అడిగితే.. మమ్మీ ఎటో వెళ్లిపోయింది. మిమ్మల్ని రేపు ఉదయం ఎక్కడికి రమ్మని చెప్పిందంట కదా.. అక్కడికే వస్తానని చెప్పింది అని హిమ, శౌర్య చెప్పడంతో ఇంట్లోని వారంతా షాక్ తిన్నారు. తాజా ప్రోమో తదుపరి ఎపిసోడ్‌పై ఆసక్తిని పెంచింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X