For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Karthika Deepam దీపకు ఆ ధైర్యం ఎక్కడిది? ఊహకందని వంటలక్క ప్లాన్.. టెన్షన్‌లో మోనిత, కార్తీక్!

  |

  తెలుగు టెలివిజన్ చరిత్రలో అత్యధిక టీఆర్పీ‌తో కార్తీకదీపం సీరియల్ కొద్ది నెలలుగా అనేక మలుపులతో కొనసాగుతున్నది. తాజాగా దీప, మోనిత మధ్య కనిపిస్తున్న ఎత్తులు పైఎత్తులు ఆసక్తికరంగా మారాయి. తన కుమారుడు ఆనందరావు బారసాల వేడుక కోసం కార్తీక్ కుటుంబాన్ని ఆహ్వానించడానికి వచ్చిన మోనితకు దీప షాకిచ్చింది. బారసాల వేడుకకు అందరూ వస్తారు.

  అక్కడే నీ సినిమాకు క్లైమాక్స్ ఇవ్వడానికి ముహుర్తం పెట్టాను అంటూ దీప చెప్పడంతో మోనిత ఆందోళనలో పడితే, కార్తీక్ కుటుంబ సభ్యులు ఏం చేయబోతున్నదనే ఆలోచనల్లో పడ్డారు. ఈ క్రమంలో పిల్లలను తీసుకొని దీప గుడికి, అక్కడి నుంచి రెస్టారెంట్‌కు వెల్లడానికి ప్రయత్నం చేసింది. తాజా ఎపిసోడ్ 1203 ఏమి జరిగిందంటే..

  నీ సినిమాకు క్లైమాక్స్ రేపే అంటూ దీప

  నీ సినిమాకు క్లైమాక్స్ రేపే అంటూ దీప

  నీ సినిమాకు క్లైమాక్స్ ఇస్తాను అంటూ దీప చెప్పిన మాటలను పదే పదే మోనిత గుర్తు చేసుకొన్నది. తన ఇంటిలో ఈ మాటలు చెప్పినప్పడు.. ఏదో మానసిక ధైర్యాన్ని కూడగట్టుకొనేందుకు చెప్పిందని అనుకొన్నాను. కానీ ఇప్పుడు కూడా అదే ధైర్యం ఆమెలో కనిపిస్తున్నది. ఆ ధైర్యానికి కారణం ఏమై ఉంటుంది? దీప ప్లేస్‌లో ఎవరు ఉన్నా లబోదిబో అనాల్సింది. కానీ నా ఇంటికే వచ్చి వార్నింగ్ ఇచ్చింది. ఆ కళ్లలో ఏదో తెలియని కాన్ఫిడెన్స్ ఇచ్చింది. పోనీలే ఆ రోజు ఏదో తెలియని ధైర్యం తెచ్చుకొన్నది వదిలేస్తే.. అదే ధైర్యం ఈ రోజు దీపలో కనిపించింది అంటూ మోనిత కంగారు పడిపోయింది.

  దీప ఏం చేస్తున్నది? దీప ఏం చేయబోతున్నది

  దీప ఏం చేస్తున్నది? దీప ఏం చేయబోతున్నది

  బారసాల వేడుక అనగానే కార్తీక్ కుటుంబ సభ్యులందరిని తీసుకొస్తానని చెప్పింది. ఇంతకు దీప ప్లాన్ ఏమిటి? ఎటు నుంచి నరుక్కొంటూ వస్తున్నది. ఏం చేయబోతున్నది? నా కొడుకు ఆనందరావును అడ్డం పెట్టుకొని ఆటాడించవచ్చు. వారిని ఏమైనా చేయవచ్చని నేను అనుకొంటే.. దీప ఏంటి? ఏం చేస్తున్నది? దీప ఏం చేయబోతున్నది? ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా కళ్లనీళ్లు చెప్పుకొని.. అస్తమిస్తున్న సూర్యుడి వైపు నడిచే సీన్ ఉంటుందని అనుకొంటే.. నీ సినిమాకు క్లైమాక్స్ రేపే ఇవ్వబోతున్నాను అంటూ దీప షాకిచ్చింది. నేను పూర్తిగా సక్సెస్ ముగింట ఉంటే.. దీప ఏమిటి ఇలా ట్విస్టు ఇచ్చింది. ఏది ఏమైనా దీప అస్తమిస్తున్న సూర్యుడి వైపు నడవాలి. నేను ఉదయిస్తున్న సూర్యడి వైపు నడవాలి అనుకొంటూ మోనిత ధైర్యాన్ని కూడగట్టుకొనే ప్రయత్నం చేసింది.

   సారీ దీపక్క అంటూ..

  సారీ దీపక్క అంటూ..

  దీపకు జరుగబోయే షాక్ గురించి తనలో తాను ఊహించుకొంటూ.. నేను, మా ఆనందరావుతో కార్తీక్, అత్తమామలు, ఆదిత్య ఫ్యామిలీతో కలిసి ఆనందంగా గడుపుతాను. సారీ దీపక్క.. ఊహించుకొంటేనే ఎంత ఆనందంగా ఉంది. రేపు మా ఇంట్లో అందరూ అడుగుపెడితే ఎంత హ్యాపీగా ఉంటుంది. నీవు ఉత్తగనే నన్ను బెదిరిస్తున్నట్టు అర్ధమై పోయింది అని మోనిత అనుకొంటూ సంతోషంలో మునిగిపోయింది.

  కంగారులో సౌందర్య, కార్తీక్

  కంగారులో సౌందర్య, కార్తీక్

  ఇక ఇంటి నుంచి మోనిత, దీప బయటకు వెళ్లిపోవడంతో కార్తీక్, తల్లి సౌందర్య, తండ్రి ఆనందరావు ఆలోచనల్లోపడిపోయారు. దీప ఏం చేస్తుందో నీకు ఏమైనా అర్ధం అవుతుందా? బారసాలకు అందర్నీ తీసుకువస్తానని చెప్పింది అని కార్తీక్ అంటే.. ఆనందరావు కూడా నాకు అర్ధం కావడం లేదు అని చెప్పారు. అయితే దీప మంచి చేయాలనే పూజ నిర్వహించాను. కానీ ఇప్పుడు దీప కళ్లలోకి చూడటానికి భయమేస్తున్నది.

  కనీసం దీప తనను ఏమైందని అడిగి ఉండవచ్చు కదా అంటూ సౌందర్య ఆవేశంగా పంచుకొన్నది. అయితే ఆలయంలో మోనిత, కార్తీక్ పూజను చూసిన తర్వాత కూడా దీప చాలా ధైర్యంగా ఉంది. మీ ఇద్దరు దీప కళ్లకు గంతలు కట్టారు. ఆ గంతల్లో నుంచి కూడా దీప చూస్తున్నది. అలా చూడటానికి గొప్ప మనసు ఉంటేనే సాధ్య పడుతుంది. దీపకు అలాంటి గొప్ప మనసు ఉంది అని ఆనందరావు అన్నారు.

  దీప కాళ్లమీద పడి క్షమించమని అడుగుతా? అంటూ కార్తీక్

  దీప కాళ్లమీద పడి క్షమించమని అడుగుతా? అంటూ కార్తీక్

  దీప ఏం చేస్తుందో..ఏం చేయబోతున్నదో ఊహకే అందకుండా ఉంది. ఏం చేద్దాం. నాకు టెన్షన్‌గా ఉంది. దీప రాగానే కాళ్లమీద పడి క్షమించమని అడుగుతాను. దీపకు అంతా చెప్పేస్తే ఇంత భారం ఉండేది కాదేమో అని కార్తీక్ అన్నాడు. అయితే దీప ఎంతకు రాకపోవడంతో టెన్షన్‌గా ఉందంటే.. పిల్లలతో కలిసి రెస్టారెంట్‌లో భోజనం చేస్తున్నది కదా.. వచ్చేస్తుంది అంటూ సౌందర్య సమాధానం ఇచ్చింది. అయితే దీప ఏదో పెద్ద నిర్ణయం తీసుకొన్నది.

  మనకు ఏదో భారీ షాక్ ఇవ్వబోతున్నది అని చర్చించుకొంటుండగానే.. హిమ, శౌర్య ఇంటిలోకి అడుగుపెట్టారు. దీప ఎక్కడ అని కార్తీక్ అడిగితే. అమ్మమ్మ, తాత దగ్గరకు వెళ్లింది. రేపు మిమ్మల్ని ఎక్కడికో రమ్మని చెప్పిందటగా.. అక్కడకి మిమ్మల్ని రమ్మని చెప్పింది అని తెలియజేయగానే.. కార్తీక్ షాక్ గురయ్యాడు.

  మోనిత ఇంట్లో దీప వంటలు చేస్తూ

  మోనిత ఇంట్లో దీప వంటలు చేస్తూ

  ఇక మోనిత ఇంట్లో బారసాల వేడుకలు ఘనంగానే జరిగినట్టు తాజా ప్రోమోలో స్పష్టమైంది. అయితే మోనిత ఇంటిలో వంటలక్కగా దీప వంటలు చేస్తూ హుషారుగా కనిపించింది. అయితే మోనితలో ఏదో తెలియని గుబులు కనిపించింది. అంతేకాకుండా మోనిత ఇంట్లో దీప వంటలు చేయడంపై కార్తీక్ సీరియస్ అయ్యాడు. ఏంటీ నీవు ఇక్కడ ఉండేది..అంటూ కార్తీక్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తదుపరి ఎపిసోడ్‌లో ఏం జరుగబోతుందనే విషయం ఇంట్రెస్టింగ్‌గా మారింది. మోనితకు ఎలాంటి షాక్ ఇవ్వబోతుందనే విషయం ప్రేక్షకుల్లో క్యూరియాసిటిని నింపింది.

  Bigg Boss Telugu 5 : Sarayu ఎలిమినేషన్.. జంటల రొమాన్స్ అదుర్స్ !! || Filmibeat Telugu
   45వ వారంలో కార్తీకదీపం హయ్యెస్ట్ టీఆర్పీ

  45వ వారంలో కార్తీకదీపం హయ్యెస్ట్ టీఆర్పీ

  ఏడాది కాలానికిపైగా కార్తీకదీపం తెలుగు టెలివిజన్‌ రంగంలో అత్యధిక టీఆర్పీ సాధించిన సీరియల్‌గా కార్తీకదీపం ఓ ఘనతను సొంతం చేసుకొన్నది. ప్రస్తుత ఏడాదిలో 45వ వారంలో అర్బన్ ప్రాంతంలో ఈ సీరియల్ 14.13 రేటింగ్ సొంతం చేసుకోగా, రూరల్ ప్రాంతంలో 15.71 రేటింగ్‌ను నమోదు చేసింది. కొత్త ట్విస్టు చోటుచేసుకొన్నందున్న రానున్న వారాల్లో మరింత రేటింగ్ పెరిగే అవకాశం లేకపోలేదు. మిగితా సీరియల్స్‌తో పోల్చుకొంటే కార్తీకదీపం ఈ వారం అత్యధిక టీఆర్పీని సొంతం చేసుకొన్నది.

  English summary
  Highest rated Telugu serial Karthika Deepam's November 22th Episode number 1203
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X