Karthika Deepam కార్తీక్ కుటుంబంలో మోనిత చిచ్చు.. దీపకు ఆ గుట్టు తెలిసిపోవడంతో..
కార్తీకదీపం సీరియల్‌లో మరోసారి కార్తీక్ కుటుంబం సమస్యల్లో పడిపోయింది. మోనిత ప్రసవం తర్వాత సౌందర్య మానసికంగా ఓ రకమైన క్షోభకు గురైంది. మోనిత కుమారుడు పేగు మెడలో వేసుకొని పుట్టిన కారణంగా శాంతి పూజ నిర్వహించాలనే విషయం సౌందర్యను అతలాకుతలం చేసింది. ఇక మోనిత కృత్రిమ గర్భం వెనుక గుట్టును బయటపెట్టేందుకు దీప ప్రయత్నిస్తున్నది. ఇలాంటి భావోద్వేగాల మధ్య కార్తీకదీపం 1186 ఎపిసోడ్ ఎలా సాగిందంటే..

మోనిత బిడ్డ పేగు మెడలో వేసుకొని
మోనిత కొడుకు పేగు మెడలో వేసుకొని పుట్టడం కుటుంబానికి అరిష్టం. మేనమామ లేదా తండ్రికి ప్రాణగండం. కాబట్టి మోనిత బిడ్డకు శాంతిపూజ చేయించాలి. లేకపోతే డాక్టర్ బాబు ప్రాణాలకు ముప్పు ఉంటుంది. ఇంటికి కూడా కీడు అంటూ పనిమనిషి ప్రియమణి చెప్పిన మాటలతో సౌందర్య ఆలోచనలో పడింది. బిడ్డకు శాంతి పూజ చేయిస్తే.. దీపకు తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుంది. ఒకవేళ పూజ చేయిస్తే దీపకు అన్యాయం చేస్తునట్టు అవుతుందా? అనుకొంటూ పలు రకాల ఆలోచనలు, అనేక విషయాలపై సౌందర్య మల్లగుల్లాలు పడింది

మోనిత బిడ్డకు సౌందర్య శాంతి పూజ
తన కొడుకుకు ప్రాణగండం ఉందనే భయంతో మోనిత బిడ్డకు శాంతిపూజ చేయించడానికి సౌందర్య పూజారి వద్దకు వెళ్లింది. పూజారితో మోనిత బిడ్డ గురించి చెప్పి తప్పనిసరిగా పూజ చేయించాలా? చేయించకపోతే ఏం జరుగుతుంది అంటే.. మీకు నమ్మకం ఉంటే తప్ప.. పూజ చేయించండి. లేకపోతే వదిలేయండి అని పూజారి సలహా ఇచ్చాడు. అయితే పూజా సామాగ్రి కోసం బిడ్డ తండ్రి పేరు చెప్పమని పూజారి అడిగితే అన్యమనస్కంగా కే కార్తీక్ అంటూ చెప్పింది. అయితే పూజకు తల్లి, తండ్రి, బిడ్డ హాజరు కావాలని పూజారి చెప్పడంతో మళ్లీ సందిగ్దంలో పడింది.

భార్య, భర్తలు హాజరుకావాల్సిందే అంటూ
భార్యభర్తలు, బిడ్డ ఇద్దరు పూజకు హాజరుకావాల్సి ఉంటుంది. భర్త రావడానికి ఏదైనా సమస్య ఉందా? లేక అత్త కోడళ్ల మధ్య ఏదైన ఇబ్బంది ఉందా? లేక కుటుంబ కలహాలు ఏమైనా ఉన్నాయా అంటూ ప్రశ్నిస్తే.. అలాంటిదేమీ లేదు అంటూ సౌందర్య ముభావంగా సమాధానం చెప్పింది. ఇక ఇంటి నుంచి ఎవరికి చెప్పకుండా దీప ఎటు వెలళ్లింది అనే కంగారు సౌందర్యలో మొదలైంది.

రోడ్డుపై దీపను చూసి సౌందర్య
మాతృశ్రీ సంతాన సాఫల్య కేంద్రం నుంచి బయటకు వచ్చిన దీప.. రోడ్డుపై నడుచుకుంటూ వస్తూ సౌందర్యకు కనిపించింది. దాంతో కారు ఆపి.. దీప ఎక్కడికి వెళ్లావు.. సెల్‌ఫోన్ కూడా వదిలేశావు. రాత్రి కూడా నిద్ర పోకుండా గడిపావని పిల్లలు చెప్పారు అని సౌందర్య అంటే.. వదిలేసింది సెల్‌ఫోన్ మాత్రమే కద.. గత 11 సంవత్సరాలు నిద్రలేకుండానే ఎన్నో రాత్రులు గడిపాను అంటూ దీప తనదైన శైలిలో జవాబు చెప్పడంతో సౌందర్య కంగారుపడిపోయింది. మోనిత విషయం దీపకు తెలిసిందా అనుకొంటూ కంగారు పడిపోయింది. దీప మరోసారి నీవు చెప్పకుండా వెళ్లకు అంటే.. 11 ఏళ్లు బయటకు వెళ్లిపోయాను. ఇంకా ఎక్కడికి వెళ్తాను అత్తమ్మ.. నేను ఎక్కడికి వెళ్లిపోనని మీకు నమ్మకం కదా.. అని దీప అంటే.. సౌందర్య కంగారు పడిపోయింది.

కార్తీక్‌కు మోనిత ఫోన్ చేస్తూ..
ఇక కార్తీక్‌కు ఫోన్ చేస్తే కట్ చేయడంతో మోనిత కోపం తెచ్చుకొన్నది. అంతలో భారతీ వచ్చి.. నీ ఇంటిని కిరాయికి ఇస్తున్నావా? అంటే అవును అని మోనిత సమాధానం చెప్పింది. అయితే నీ ఇంటికి మాత్ర రాను అని మోనిత షాక్ ఇచ్చింది. కార్తీక్ మరోసారి ఫోన్ చేయడంతో మళ్లీ అదే అనుభవం ఎదురైంది. దాంతో మోనిత కార్తీక్‌పై మరింత చిరాకుపడింది.
Recommended Video

దీప కంటికి మోనిత బిడ్డ పూజ చిట్టి
ఒకే కారులో మోనిత, సౌందర్య ప్రయాణిస్తుండగా కార్తీక్ ఫోన్ చేశాడు. దాంతో సౌందర్య కంగారు పడిపోయింది. అయితే ఫోన్ ఎత్తి మాట్లాడకపోవడంపై కార్తీక్ ఆందోళన పడ్డాడు. సౌందర్య నాతో ఉన్నారనే విషయాన్ని చెప్పింది. అయితే దీప ఎక్కడికి వెళ్లిపోయిందని అడిగితే.. నేను కాసేపట్లో ఫోన్ చేస్తానని చెప్పింది. అయితే అత్తయ్య నేను కారు దిగుతాను అంటే.. దీప అనిచెప్పింది. ఆ తర్వాత సౌందర్య కారు దిగిపోయి కార్తీక్‌తో మాట్లాడటంపై అనుమానాలు వ్యక్తం చేసింది. అయితే మోనిత బిడ్డకు సంబంధించిన శాంతిపూజకు సంబంధించి పూజారి రాసి ఇచ్చిన చీటి లభించడంతో దీప షాక్‌కు గురైంది.


Click it and Unblock the Notifications











