Karthika Deepam నేను చచ్చిపోతే.. నా పిల్లలు అనాథలుగా బతకాలా? దీప ఆవేదన
కార్తీకదీపం సీరియల్‌లో మోనిత పండంటి బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కార్తీక్ ఇంటిలో గందరగోళం నెలకొన్నది. బిడ్డ మెడకు పేగు చుట్టుకొని పుట్టడంతో అరిష్టం, కార్తీక్ ప్రాణగండం అంటూ మోనిత నాటకంలో భాగంగా వంట మనిషి ప్రియమణి చెప్పడంతో కార్తీక్ తల్లి సౌందర్యలో మరింత కంగారు మొదలైంది. అయితే పూజారి వద్దకు వెళ్లి పూజకు కావాల్సిన ఏర్పాట్లు చేయడానికి రాసిచ్చిన చీటి దీప కంటపడింది. దాంతో దీప మనసులో ఎన్నో అనుమానాలు, సందేహాలు పోటెత్తాయి. ఇంకా తాజా ఎపిసోడ్ 1187లో ఏం జరిగిందంటే..

నేను కనిపిస్తే కొందరికి టెన్షన్
దీప, సౌందర్య కారులో ప్రయాణిస్తున్న సమయంలో కార్తీక్ తన తల్లికి కాల్ చేశాడు. అయితే దీప ముందు మాట్లాడానికి కంగారు పడిన సౌందర్య తప్పని సరి పరిస్థితుల్లో కార్తీక్ ఫోన్ రిసీవ్ చేసుకొన్నది. మోనిత బిడ్డకు శాంతి పూజ నిర్వహించాలి. నీవు తప్పనిసరిగా రావాలి. దీప వ్యవహారం చూసుకొంటానని కారు దిగి ఫోన్‌లో మాట్లాడుతూ కార్తీక్‌కు సౌందర్య చెప్పింది. కార్తీక్‌తో మాట్లాడిన తర్వాత కారులో కూర్చొని.. కార్తీక్ ఫోన్ చేశాడు. దీప ఎక్కడికి వెళ్లిందని అడుగుతున్నాడు అని సౌందర్య అంటే.. నేను అడగలేదు కదా అత్తయ్య అని దీప సమాధానం ఇచ్చింది. దాంతో నీవు ఎదురుగా ఉన్నావని చెప్పాను అని సౌందర్య జవాబిచ్చింది. నీవు కనిపించకపోతే కార్తీక్ ఎంత టెన్షన్ పడ్డారో తెలుసా? అని సౌందర్య అంటే.. నేను కనిపించినా కొందరు టెన్షన్ పడుతున్నారంటూ దీప కౌంటర్ ఇచ్చింది.

దీపకు ఎలా చెప్పాలి అంటూ కార్తీక్
మోనిత పుట్టిన బిడ్డ గురించి దీపకు చెప్పు కార్తీక్ అంటూ తండ్రి ఆనందరావు సూచించాడు. అయితే ఏ ముఖం పెట్టుకొని చెప్పాలి డాడీ.. మోనిత బిడ్డకు నేను తండ్రిని అని ఎలా చెప్పాలి. ఏదో విధంగా నేను మేనేజ్ చేసుకొంటాను అంటూ కార్తీక్ అన్నాడు. కాపురాలు మేనేజ్ మీద నిలబడవు. కేవలం నిజాల మీదే నిలబడుతాయి అంటూ ఆనందరావు తన కుమారుడికి చెప్పే ప్రయత్నం చేశాడు. అయితే ఆ రోజు నేను మోనిత ఇంటికి వెళ్లి తాగడం, ఆ తర్వాత ఏం జరిగిందనే విషయంపై నాకు స్పష్టత లేదు. ఆ రోజు అక్కడికి ఎందుకు వెళ్లావని నిలదీస్తే... నీ మీద అనుమానంతో వెళ్లి అక్కడ తాగాలని చెప్పాలా? నా పిల్లలు అడిగితే నేను ఏం చెప్పాలి? అంటూ కార్తీక్ ఆవేదన చెందాడు.

ఒకవేళ నేను చస్తే అంటూ దీప
తన తండ్రితో మాట్లాడుతున్న సమయంలో మోనిత నుంచి ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ కట్ చేస్తే.. ఎవరు అని ఆనందరావు అడిగాడు. ఇంకెవ్వరు మోనిత అంటూ కార్తీక్ సమాధానం చెప్పారు. దాంతో నిజానికి , అబద్దానికి తేడా ఇదే.. దీపకు నిజం చెబితే.. నీకు టెన్షన్ ఉండదు అంటూ ఆనందరావు చెప్పారు. ఆ తర్వాత దీప, సౌందర్య ఇంటికి వచ్చారు. తల్లి కనిపించడంతో అమ్మా ఎక్కడికి పోయావు? అంటే నాకే చాలా ప్రశ్నలు ఉన్నాయి? మీరు మళ్లీ ప్రశ్నలు నన్ను అడగకండి అంటూ దీప గట్టిగా సమాధానం ఇచ్చింది. దాంతో పిల్లల్ని భోజనం చేశారా? అంటే లేదు అని జవాబు చెబితే.. నేను లేకపోతే నా పిల్లలకు భోజనం పెట్టరా? వాళ్లని అనాథలుగా వదిలేస్తారా? రేపు చేస్తే వాళ్ల పరిస్థితి ఏంటి అని శ్రావ్యను గట్టిగా నిలదీసింది.

మోనిత కమింగ్.. దీప గోయింగ్ అంటూ ప్రియమణి
శ్రావ్యను గట్టిగా మందలిస్తూ.. శౌర్య, హిమను తీసుకెళ్లి అన్నం తినిపించింది. దీపలో కోపం చూసి ఆమెకు ఏమైంది? మోనిత విషయం తెలిసిందా? అని కార్తీక్ అంటే.. ఆమెకు మోనిత విషయం తెలిసే అవకాశం లేదని సౌందర్య చెప్పింది. దాంతో ఇంటి సభ్యుల ముఖాల్లో గందరగోళం నెలకొన్నది. ఇంటి సభ్యులు మధ్య పరిస్థితి చూసిన ప్రియమణి.. దీప ఇలాగే మాట్లాడితే గోలగోలగా ఉంటుంది. అప్పుడు మోనిత అమ్మ కమింగ్.. దీపమ్మ గోయింగ్ అంటూ ప్రియమణి మనసులో అనుకొన్నది.

అసలు దీపకు ఏమైంది అంటూ కార్తీక్
నేను చస్తాను అంటూ దీప నోట మాట రావడంపై కార్తీక్ టెన్షన్‌కు గురయ్యాడు. ఎప్పుడూలేనిది దీప ఎందుకు ఇలా మాట్లాడింది. మోనిత విషయం ఆమెకు తెలిసిందా? ఎక్కడికి వెళ్లావని నేను దీపను ధైర్యం చేసి అడుగలేను. అసలు దీపకు ఏమైంది? దీపకు ఈ విషయం తెలిస్తే.. గుండె పగిలిపోతుంది. గట్టిగా నిలదీస్తుంది. దీప మనసులో ఏమున్నది? ఆమె నన్ను చూసే చూపును తట్టుకోలేకపోతున్నాను అంటూ కార్తీక్ మదనపడిపోయాడు.

కార్తీక్ నాకు మోసం చేస్తున్నాడా?
ఇక కార్తీక్, సౌందర్య ప్రవర్తన చూసి దీప ఆందోళనలో పడింది. మోనిత ప్రసవం కోసం కార్తీక్ సంతకం పెట్టారట.. అత్తయ్య కూడా అబద్దాలు చెబుతున్నది. కారులో దోష నివారణకు సంబంధించిన చీటి లభించింది. కార్తీక్, అత్తయ్య నాకు మోసం చేస్తున్నారా? నాపై అత్తయ్య చూపించిన ప్రేమ అంతా ఉత్తదేనా; నేను ఈ ఇంటిలో ఉండేందుకు అర్హత లేదా? నాకు చదువు రాదని నన్ను పక్కన పెడుతున్నారా. మోనిత వద్దకు వెళ్తూ చెప్పడం లేదు. నన్ను చీపురు పుల్ల మాదిరిగా చూస్తున్నారా? చీపిరికట్టలా ఓ మూలకు ఉండాలా? ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉండటం అవసరమా? ఇలా బతకడం అవసరమా అని దీప మనసులో అనుకొన్నది.


Click it and Unblock the Notifications











