Karthika Deepam ప్రాణ గండం నుంచి బయటపడ్డ కార్తీక్.. తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకొన్న డాక్టర్ బాబు

కార్తీకదీపం సీరియల్‌ భావోద్వేగాలతో సుదీర్ఘంగా కొనసాగుతున్నది. మోనిత పండంటి బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కార్తీక్ ఇంటిలో గందరగోళం నెలకొన్నది. బిడ్డ పేగు మెడకు వేసుకొని జన్మించడంతో ప్రాణ గండం ఉందని పూజరులు చెప్పడంతో కార్తీక్‌ను పూజ చేయించమని తల్లి సౌందర్య ఒత్తిడి చేస్తున్నది. పూజా చేయిస్తే దీప ఎలా రియాక్ట్ అవుతుందనే సందేహం సౌందర్యను వెంటాడుతున్నది. ఈ క్రమంలో ఎపిసోడ్ 1188లో ఏం జరిగిందంటే..

Photo Courtesy: Star మా and Disney+Hotstar

 మోనిత బిడ్డకు శాంతి పూజలు జరిపించాలని

మోనిత బిడ్డకు శాంతి పూజలు జరిపించాలని

మోనిత బిడ్డకు శాంతి పూజ జరిపించేందుకు తల్లి ఏర్పాట్లు చేయడంపై కార్తీక్ అసహనం వ్యక్తం చేశారు. ఇలా శాంతి పూజలు చేయిస్తే మోనిత వాదనకు బలం చేకూర్చినట్టు అవుతున్నది. నేను తప్పు చేశానా? లేదా? అనే విషయంపైనే స్పష్టత లేనప్పుడు.. మోనిత పక్కన కూర్చొని పూజలు చేయించడం తప్పు అవుతుంది. అయినా నాకు ఈ పూజలపై నాకు నమ్మకం లేదు. అని కార్తీక్ ఘాటుగా స్పందించారు. అయితే నమ్మినా నమ్మకపోయినా కొన్నింటిని ఆచరించాల్సిందే అంటూ సౌందర్య ఒప్పించే ప్రయత్నం చేసింది. అంతేకాకుండా నీవు పూజ చేస్తున్నది మోనిత కోసం కాదు.. దీప కోసం, నీ పిల్లల కోసం, నీ కుటుంబ సభ్యులు కోసం అంటూ సౌందర్య మరింత ఎమోషనల్‌గా వ్యాఖ్యలు చేసింది.

కరెంట్ షాక్ ఘటన నుంచి

కరెంట్ షాక్ ఘటన నుంచి


అయితే షాపింగ్ చేసి కారు వద్దకు వస్తున్న కార్తీక్, సౌందర్య పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకొన్నారు. ఓ చెట్టుకింద కరెంట్ తీగ తెగి కార్తీక్‌ కారుపై పడింది. అయితే దానికి దగ్గరగా ఎలక్ట్రిక్ విభాగం సిబ్బంది కార్తీక్‌ను హెచ్చరిస్తున్నా.. ట్రాఫిక్ సౌండ్ కారణంగా వినిపించుకోలేదు. కారుపై కరెంట్ వైర్ తెగి విద్యుత్ సరఫరా కొనసాగుతున్న సమయంలో కారు డోర్ తీయడానికి కార్తీక్ ప్రయత్నించారు. రెప్పపాటులో కారు డోర్ తీయబోతున్న సమయంలో సిబ్బంది వచ్చి కార్తీక్ చేయిపట్టి లాగాడు. దాంతో కార్తీక్‌కు ప్రాణగండం తప్పింది.

 సౌందర్యలో మరింత అనుమానాలు

సౌందర్యలో మరింత అనుమానాలు

కరెంట్ షాక్ ఘటన తృటిలో సురక్షితంగా కార్తీక్ బయటపడటంతో సౌందర్యలో మరింతగా అనుమానాలు పెరిగిపోయాయి. దోష నివారణ పూజ చేయించాల్సిందే అంటూ కార్తీక్‌ను బలవంత పెట్టింది. అయితే తాను ఎట్టి పరిస్థితుల్లోను మోనిత పక్కన కూర్చొని పూజ చేయనని కార్తీక్ మొండికేశాడు. ఇప్పటికే దీప ముఖంలోకి చూసి మాట్లాడలేకపోతున్నాను. ఇక మోనితతో పూజలో కూర్చుంటే దీపకు ఏమని సమాధానం చెప్పుకొవాలి అంటూ తల్లిని కార్తీక్ నిలదీశాడు.

మోనితను పూజకు ఆహ్వానించడం ఎలా

మోనితను పూజకు ఆహ్వానించడం ఎలా

మోనితను పూజకు ఎలా పిలవడం అనే అంశంపై సౌందర్య మల్లగుల్లాలు పడింది. ఇప్పటికే నీ అంతు చూస్తానని జైలులో మోనితను సవాల్ చేసిన విషయం గుర్తుకు వచ్చింది. ఇప్పుడు నేను పూజకు ఆహ్వానిస్తే.. మోనిత చెలరేగిపోతుంది. తాను పిలువడం సరికాదు అంటూ సౌందర్య నచ్చచెప్పుకొన్నది. అయితే ప్రియమణితో కబురు పెడుదామా అని కాసేపు ఆలోచించి.. ఆ తర్వాత సరికాదు అంటూ సౌందర్య మనసులో అనుకొన్నది. చివరకు భారతీతో పూజ విషయం కబురు పెట్టాలని ఆమెకు ఫోన్ చేసి పిలిపించుకొన్నది.

శాంతి, దోష నివారణ పూజల కోసం

శాంతి, దోష నివారణ పూజల కోసం

మోనిత బిడ్డకు శాంతి పూజ చేయించాలని అనుకొంటున్నాం. ఈ విషయం చెప్పి మోనితను పూజకు రప్పించే బాధ్యత నీదే అంటూ సౌందర్య చెబితే.. డాక్టర్ భారతీ కొంత సందిగ్దంలో పడింది. మోనిత మనస్తత్వం చాలా చంచలం. ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. కాబట్టి మోనితను తాను చెప్పలేనని అంటూ భారతీ చెప్పింది. అయితే శాంతి పూజ, దోష నివారణ పూజకు సహకరించాలని భారతీని సౌందర్య వేడుకొన్నది. అయితే సరే అని భారతీ ఒప్పుకోవడం దీప చెవిలో పడింది.

Recommended Video

Bigg Boss Telugu 5 : Sarayu ఎలిమినేషన్.. జంటల రొమాన్స్ అదుర్స్ !! || Filmibeat Telugu
 మోనిత సరికొత్త కుట్రలు

మోనిత సరికొత్త కుట్రలు


ఇక పనిమనిషి ప్రియమణితో కలిసి మోనిత తన కుట్రలకు సరికొత్తగా పదునుపెట్టింది. కార్తీక్ కుటుంబం మన చేతిలోనే ఉంటుంది. రిమోట్ మన చేతిలో ఉంది. ఆ కుటుంబాన్ని ఎలా ఆడించాలో నాకు తెలుసు. ఇక నుంచి మన జీవితానికి మంచి రోజులు వచ్చాయి. మున్ముందు మనం చెప్పిందే జరుగుతుంది అని మోనిత అంటే అవును అమ్మ అంటూ ప్రియమణి చెప్పింది. నీ ప్లాన్స్‌కు ఎదురులేదమ్మ అంటూ ప్రియమణి మోనితను ప్రోత్సహిస్తూ కనిపించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X