twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ ప్రియమణి.. అడ్డదారిలో ఇంట్లోకి దూరుతూ..

    |

    తెలుగు టెలివిజన్ రంగంలో అత్యంత టాప్ రేటింగ్‌తో కొనసాగుతున్న కార్తీకదీపం సీరియల్‌లో రకరకాల ట్విస్టులు చోటుచేసుకొంటున్నాయి. కార్తీక్ ఇంటిలో తన కుటుంబ సభ్యుల్లో ఎమోషనల్ సంఘటనలు కనిపించాయి. ఇక చిన్నారికి జన్మనిచ్చిన డాక్టర్ మోనిత.. దానిని అస్త్రంగా చేసుకొని కార్తీక్‌ ఫ్యామిలీని టార్గెట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నది. ఇలాంటి ఎమోషనల్ సంఘటనల మధ్య 1189 ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే...

    అందంగా కనిపించాలని మోనిత..

    అందంగా కనిపించాలని మోనిత..

    తన పనిమనిషి ప్రియమణితో మాట్లాడుతూ.. మన లైఫ్ స్టైల్‌లో మార్పులు చేసుకోవాలి. ఇన్నాళ్లు కార్తీక్ కోసం తిట్టు తిన్నా.. పస్తులున్నా.. జైలుపాలయ్యా.. నిద్రలేని రాత్రులు గడిపాను. ఇప్పుడు ఉన్న పరిస్థితులు మన చేతిలో ఉన్నాయి. రిమోట్ మన చేతిలో ఉంది. మనం ఏది చెబితే కార్తీక్ ఫ్యామిలీ అది చేస్తారు. అతి త్వరలో కుడికాలు ఇంట్లో పెట్టి రమ్మని మా అత్తగారు సౌందర్య ఆహ్వానిస్తారు అని మోనిత అంటే.. ఇది అయ్యే పనేనా అంటూ ప్రియమణి అనుమానం వ్యక్తం చేస్తే.. అవుతుంది.. అయ్యి తీరుతుంది.

    నేను ఎందుకు పిలిచానంటే... నేను అత్తగారింట్లో అడుగుపెట్టే సరికి మరింత అందంగా కనిపించాలి. మోనిత ఏంది ఇంత అందంగా కనిపిస్తున్నదని అనుకోవాలి. అందుకోసం పోషకాహారం తీసుకొంటాను. ఏ క్షణంలోనైనా మా అత్తగారి నుంచి పిలుపు అందవచ్చు అని మోనిత అంటుండగానే.. కాలింగ్ బెల్ మోగింది.

    మోనిత ఇంట్లో డాక్టర్ భారతీ ఎంట్రీతో

    మోనిత ఇంట్లో డాక్టర్ భారతీ ఎంట్రీతో

    శాంతిపూజకు రమ్మని కబురు అందించాలని డాక్టర్ భారతికి చెప్పడంతో ఆమె మోనిత ఇంటికి వచ్చింది. భారతీని చూసి... హలో భారతీ అంటూ మోనిత విష్ చేసింది. ఏమిటి విశేషాలు అంటూ మోనిత అడిగితే.. దోష నివారణ పూజకు బాబును తీసుకొని రమ్మనమని సౌందర్య చెప్పింది అని భారతి చెబితే మోనిత పట్టించుకోకుండా కనిపించింది. భారతీ చెప్పిన విషయానికి మరోలా స్పందిస్తూ..నేను వేళ్లకు నెయిల్ పాలిష్ మార్చాలని అనుకొంటున్నాను. ఏ కలర్ బాగుంటుందో చెప్పు అంటూ సెటైరికల్‌గా మాట్లాడింది. దాంతో మోనిత ఏం మాట్లాడుతున్నావు.. సౌందర్య ఓ మెట్టు దిగితే.. నీవు బెట్టు చేస్తున్నావా? అంటూ ప్రశ్నించింది.

    మోనితను నిలదీసిన భారతీ

    మోనితను నిలదీసిన భారతీ

    డాక్టర్ భారతీ మాటలకు మోనిత స్పందిస్తూ.. ఒకవేళ బెట్టు దిగితే.. నా ఇంటికి వచ్చి నన్ను పిలువాలి అంటే.. ఒకరి దురదృష్టంలో అదృష్టాన్ని వెతుకుంటున్నావా? అంటూ భారతీ ఘాటుగా స్పందించింది. ఇది కరెక్ట్ కాదు.. వాళ్ల బాధల్లో నీవు ఆనందాన్ని వెతుకుంటున్నావా? అని భారతీ ప్రశ్నించింది. నన్ను వాళ్లు ఎంత బాధపెట్టారో నీకు తెలుసా? పనివాళ్లతో తింటించారు? అని మోనిత అంటే.. అయితే నీవు పూజకు వెళ్లనంటావా అని భారతీ మరోసారి నిలదీసింది. దాంతో రాత్రి అయింది..నీవు త్వరగా వెళ్లు అంటూ భారతీపై మరో సెటైర్ విసిరింది.

    దోష నివారణ పూజకు కార్తీక్ విముఖత

    దోష నివారణ పూజకు కార్తీక్ విముఖత

    ఇక ఇంటిలో కార్తీక్‌తో సౌందర్య మధ్య ఎమోషనల్‌గా స్పందించింది. ప్రాణగండం పొంచి ఉంది.. నా కోసం, దీప, పిల్లల కోసం పూజకు రా అంటే.. పూజకు వస్తాను కానీ.. మోనిత పక్కన కోర్చవడం కుదరదు. నేను అలా ఆమె పక్కన కూర్చుంటే.. నేను మోనితను అంగీకరించినట్టే. నేను తప్పు చేశానో లేదో నాకే తెలియదు. అలాంటి మోనితను భార్యగా, ఆమెకు పుట్టిన బిడ్డకు తండ్రిగా పూజ చేయించమంటావా అనే విధంగా కార్తీక్ తల్లిని నిలదీశాడు. దేవుడి పటాల ముందు తీసుకెళ్లి.. ప్రమాణం చేసి చెప్పమన్నా చెబుతాను. స్పృహలో ఉండి నేను ఏ తప్పు చేయడం లేదు. మోనిత చెప్పిందంతా అబద్ధం అని కార్తీక్ అన్నాడు.

     దీపకు చిక్కిన సౌందర్య, కార్తీక్

    దీపకు చిక్కిన సౌందర్య, కార్తీక్

    అయితే కార్తీక్ మాటలపై స్పందిస్తూ.. తప్పు జరిగిందో లేదో. కానీ దోష నివారణకు శాంతి పూజ చేయిస్తే నాకు ప్రశాంతంగా ఉంటుంది అని సౌందర్య అంటుండగా.. వెనుక నుంచి పూజ, శాంతి అని ఏదో అంటున్నారు అని దీప అంటే.. వారిద్దరూ కంగారు పడిపోయారు. ఏం లేదు.. పూజ గది శుభ్రం చేస్తే బాగుంటుంది. ప్రశాంతంగా ఉంటుందని అనుకొంటున్నాం అని సౌందర్య తడబడుతూ సమాధానం చెప్పింది.

    సౌందర్య మాటలు విన్న దీప... అర్ధరాత్రి పూజ గది శుభ్రం చేయాలని మాట్లాడుకోవడం చాలా బాగుంది. అది కూడా ఇద్దరు ఇక్కడికి వచ్చి మాట్లాడుకోవడం గొప్ప విషయం అంటూ దీప కౌంటర్ ఇచ్చింది. రేపు మంచి రోజు అంటూ ఏదో చెప్పబోతే.. టైం బాగుంటే.. అన్నీ మంచి రోజులే.. టైం బాగాలేకుంటే.. అన్ని చెడ్డ రోజులే.. ఇంతకు పూజ గది మీ ఇద్దరే చేస్తారా? లేక నాకు అవకాశం ఇస్తారా? ఎందుకు అడుగుతున్నానంటే.. పూజకు నన్ను తీసుకెళ్లలేదు కదా అంటూ దీప మరో కౌంటర్ ఇచ్చింది.

    ప్రియమణి రెడ్ హ్యాండెడ్‌గా

    ప్రియమణి రెడ్ హ్యాండెడ్‌గా

    ఇదిలా ఉండగా, మోనిత ఇంటి నుంచి వచ్చిన ప్రియమణి అర్ధరాత్రి పెరటి దారిన ఇంట్లోకి దొంగల ప్రవేశిస్తుండగా దీప రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొన్నది. దీప తనను చూడటంతో ప్రియమణి కంగారు పడింది. ఇంత అర్ధరాత్రి ఎక్కడి నుంచి వస్తున్నావు? ఇలా దొంగదారిన ఇంట్లోకి ఎందుకు వస్తున్నావు? అని ప్రశ్నిస్తే... బయటకు వెళ్లాను.. తెలిసిన వాళ్లను కలిసి వస్తున్నా. అందుకే ఆలస్యమైందంటూ ఏదో బొంకింది. అయితే నీకు ఎవరు తెలిసిన వాళ్లు లేరని చెప్పావు. ఆకలితో పస్తులు ఉంటున్నానని చెబితే నిన్న పనిలో పెట్టుకొన్నాను. ఇప్పుడు చెప్పు ఎక్కడి నుంచి వస్తున్నావని వరుసగా ప్రశ్నలు కురిపించింది.

    Recommended Video

    Bigg Boss Telugu 5 : Sarayu ఎలిమినేషన్.. జంటల రొమాన్స్ అదుర్స్ !! || Filmibeat Telugu
    ప్రియమణిని ఇంటి నుంచి గెంటేసిన దీప

    ప్రియమణిని ఇంటి నుంచి గెంటేసిన దీప

    దీప ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మోనిత ఇంటి నుంచి వస్తున్నానని ప్రియమణి ఒప్పుకొన్నది. దాంతో దీప కోపంతో రగిలిపోయింది. ఇన్నాళ్లు మోనితకు ఏజెంట్‌లా పనిచేస్తున్నావా? ఇక్కడి విషయాలు అక్కడి చేరవేస్తున్నావా? అత్తమ్మకు చెప్పక ముందే ఇక్కడి నుంచి వెళ్లిపో అంటూ ప్రియమణికి వార్నింగ్ ఇచ్చింది. దాంతో మోనితను రెగ్యురల్‌గా కలుస్తున్నాను. మోనిత నన్ను వదులుకోలేదు. జైల్లో ఉన్నప్పుడు కూడా కలిశాను అంటూ.. ఇంట్లో నుంచి వెళ్లిపో అంటూ ప్రియమణిని వెళ్లగొట్టింది.

    English summary
    Karthika Deepam November 5th Episode number 1189: Deepa finds Priyamani's spy things with Doctor Monita.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X