twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Karthika Deepam జైల్లో మోనితకు దీప స్ట్రాంగ్ వార్నింగ్.. సౌందర్యకు మరో కొత్త తలనొప్పి!

    |

    డాక్టర్ మోనిత జైలుకు వెళ్లినా కార్తీక్ కుటుంబంలో మనశాంతి కరువైంది. నా బిడ్డకు తండ్రి అతనే.. ఓ డాక్టర్ వింత ప్రేమ కథ అంటూ పేపర్లతో కథనం రాయించిన మోనిత మరోసారి సౌందర్య కుటుంబంలో కలవరం రేపింది. అయితే పేపర్లో ప్రచురించిన కథనం తన పిల్లలకు కనిపించకుండా బెడ్ కింద పెట్టిన పేపర్ కనిపించకపోవడం, అలాగే మోనిత వ్యవహారం కార్తీక్‌ను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఇంకా అక్టోబర్ 1వ తేదీన ప్రసారమైన 1159 ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే..

    మోనిత కారణంగా కార్తీక్‌లో టెన్షన్

    మోనిత కారణంగా కార్తీక్‌లో టెన్షన్

    ఇంటిలో పూజా కార్యక్రమం నిర్వహించినా కార్తీక్‌కు ప్రశాంతత దక్కలేదు. మోనిత చేస్తున్న కుట్రలకు ఎలా ముగింపు పలకాలనే ఆలోచనలో పడిపోయాడు. తన కూతుళ్లకు మోనిత వ్యవహారం తెలిసి వారి దృష్టిలో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందో ఆందోళనకు గురయ్యాడు. ఇలాంటి పరిస్థితుల్లో బెడ్ కింద ఉన్న పేపర్ మాయం కావడం దీపను మరింత కలవరపెట్టింది. పేపర్ మాయమైందనే విషయాన్ని ఎలా చెప్పాలో అర్ధం కావడం అంటూ దీప టెన్షన్ పడిపోయింది.

    తల్లి సౌందర్యపై స్వప్ప ఫైర్

    తల్లి సౌందర్యపై స్వప్ప ఫైర్

    ఇక గతంలో తన కుటుంబాన్ని కించపరిచే విధంగా మాట్లాడిన సౌందర్యపై కూతురు స్వప్న మండిపడింది. అమెరికా నుంచి వచ్చిన స్వప్న తల్లిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నా పిల్లలు నల్లగా పుట్టారని దూరం పెట్టిన నీవు.. నీ కొడుకుకు కూడా కూతురు నల్లగా పుడితే ఏం చేశావు అని స్వప్న అంటే.. నేను మారిపోయాను అని సౌందర్య చెప్పింది. అయితే నేను మారలేదు. మారను అంటూ ఘాటుగా స్పందించింది. తీవ్రస్థాయిలో వాగ్వాదం తర్వాత ఇక వస్తాను.. నీవు ఇంటికి ఎప్పుడొస్తున్నావు అంటూ సౌందర్య అంటే.. నా ఇంటికి రాకపోతేనే మంచిది. నీ ఇంటి గడప తొక్కను అంటూ కూతురు స్వప్న ముఖం మీద కొట్టినట్టు చెప్పింది.

    డాక్టర్ భారతీకి ఫోన్ చేసి మోనిత కొత్త కుట్ర

    డాక్టర్ భారతీకి ఫోన్ చేసి మోనిత కొత్త కుట్ర

    ఇక జైలులో మోనిత కుట్రలు చేస్తూనే ఉంది. జైలులో కానిస్టేబుల్‌ను మచ్చిక చేసుకొని ఫోన్లు మాట్లాడుతూ కుట్రలు పదునుపెట్టింది. డాక్టర్ భారతీకి ఫోన్ చేసిన తన ప్లాన్ చెప్పింది. కార్తీక్‌ను కలువడానికి భారతీ ప్లాను చేస్తుంది. కానీ కార్తీక్‌ను కలిసే సమయంలో గట్టిగా కొట్టేలా ప్లాన్ చేయాలి అని మనసులో అనుకొంటుండగా.. మీ కోసం ఎవరో వచ్చారు అంటూ కానిస్టేబుల్ వచ్చి చెప్పడంతో నా కోసం ఎవరు వస్తారు. రత్నసీతనో, ప్రియమణి వచ్చి ఉంటారని అనుకొంటూ మోనిత జైలుగది నుంచి బయటకు వచ్చింది.

    టెన్షన్‌లో పడిపోయిన కార్తీక్‌

    టెన్షన్‌లో పడిపోయిన కార్తీక్‌

    మోనిత నిర్వాకంతో దిగులుపడిపోయిన కార్తీక్‌ తనను తాను అద్దంలో చూసుకొంటూ ఆత్మ పరిశీలన చేసుకొన్నాడు. ఎంతో మందికి బాగు చేసిన వాడివి. నీ జీవితాన్ని బాగు చేసుకోలేకపోతున్నావా అంటూ తనలో తాను అనుకొన్నాడు. అంతలోనే సౌందర్య వచ్చి కార్తీక్‌ను ఎందుకు అలా ఉన్నావు అంటూ అడిగింది. ఇక స్వప్న అక్క ఏమన్నది అంటే.. తనతో జరిగిన విషయాన్ని పూసగుచ్చినట్టు చెప్పింది.

    జైలులో మోనితను కలిసి దీప..

    జైలులో మోనితను కలిసి దీప..

    మోనిత ఉంటున్న జైల్లోకి దీప వెళ్లింది. దీపను చూసిన మోనిత షాక్ అయింది. ఎవరో ఎవరో వస్తారనుకొంటే నువ్వు వచ్చావా అంటూ మోనిత అంటే.. నీ కోసం ఎవరు రారు అని దీప అంటే.. నాకు కార్తీక్ ఉన్నాడు.. నా కడుపులో బిడ్డ ఉన్నాడు. ఇంకా నాకు ఏమి అవసరం లేదు దీపక్క అంటే.. అలా పిలవకు నాకు కంపరం పుడుతుంది అని దీప కోపం కోపంతో ఊగిపోతూనే చేతిలో ఉండే సంచిని చేతికి ఇచ్చింది. అందులో ఉన్న యాపిల్స్ చూసి.. నా కోసం యాపిల్స్ తెచ్చావా? అరే అంటూ తినబోయి అనుమానపడింది. అయితే అయితే నీలాంటి కుట్రలు చేయను అంటూ గట్టిగా సమాధానం ఇచ్చింది.

    ఏం ఘనకార్యం చేశావు మోనిత..

    ఏం ఘనకార్యం చేశావు మోనిత..

    అయితే మోనితను దీప గట్టిగా నిలదీస్తూ.. ఏం ఘనకార్యం చేశావని నీవు పేపర్లో జీవితగాథలు రాయిస్తున్నావు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే దీప మాటలు పట్టించుకోకుండా నా కార్తీక్ ఎలా ఉన్నాడు.. సమయానికి భోజనం చేస్తున్నారా అంటూ అడిగితే అదే వద్దు అంటూ దీప వార్నింగ్ ఇచ్చింది. పేపర్లో ఆ రాతలు మానేయ్.. వాటిని నమ్మరు. అలాంటి రాతలను చూసి ఉమ్మెస్తారు అని దీప అంటే.. నా ఇంటర్వ్యూకు మంచి రెస్పాన్స్ వచ్చిందని జైల్లో నా ఫ్యాన్స్ చెప్పారు అని మోనిత అంటే.. కల్లబొల్లి మాటలు ఎక్కువ కాలం పనిచేయవు అని దీప హెచ్చరించింది.

    నీకు అది అసాధ్యమే అంటూ మోనితకు దీప వార్నింగ్

    నీకు అది అసాధ్యమే అంటూ మోనితకు దీప వార్నింగ్

    దీప మాటలకు కౌంటర్ ఇస్తూ.. కాకిలా కలకాలం బతుకాలని లేదు. కార్తీక్‌తో కొన్నాళ్లైనా కాపురం చేస్తే చాలు అని మోనిత అంటే.. అయితే నీవు నన్ను చూడటానికి వచ్చావు... ఎందుకు ఈ సౌండ్ పొల్యూషన్. తొడబుట్టిన వాళ్లకాకున్నా.. కార్తీక్ అక్కాచెల్లెలు చేశాడు అని మోనిత అంటే.. నీ యోగ క్షేమాలు తెలుసుకోవడానికి రాలేదు. ఇకనైనా చెత్త రాతలు రాయించకు. ఎదుటి వాళ్లను హింసించి ఆనందం పొందడం నీకు అలవాటు. కానీ నేను ఉండగా, కార్తీక్‌ను భర్తగా పొందడం అసాధ్యం అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చింది అని గట్టిగా బదులిచ్చింది.

    English summary
    Karthika Deepam October 1st Episode preview. Deepa meet Monita in the Jail.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X