twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Karthika Deepam అతడితో అఫైర్ లేదా? వాడిని నరికేస్తా.. మోనితపై కార్తీక్ సీరియస్

    |

    డాక్టర్ బాబు, వంటలక్క బిడ్డనే జ్వాలా అలియాస్ శౌర్య అని తెలుసుకొన్న ఇంద్రుడు భావోద్వేగానికి లోనయ్యాడు. తమకు జ్వాలా దూరమవుతుందా అనే బాధతో బాధలో మునిగిపోయాడు. పుట్టిన బిడ్డ చనిపోయిన బాధలో ఉంటే.. జ్వాలా మాకు లభించింది. ఇప్పుడు పెంచిన బిడ్డను దూరం చేసుకొంటే.. ఇక ఆ బాధను భరించలేం. చంద్రమ్మ ఇక బతకదు. అందుకే జ్వాలాకు అబద్దం చెబుతాను. ఇక్కడి నుంచి దూరంగా వెళ్లిపోతాం. పాపం మూటగట్టుకొన్నా సరే.. మీకు బిడ్డను ఇవ్వనంటే ఇవ్వను అని ఇంద్రుడు బాధపడ్డాడు. కార్తీకదీపం సీరియల్ తాజా ఎపిసోడ్‌ 1495 లో ఇంకా ఏం జరిగిందంటే?

    శౌర్యను చూస్తే నీకు గతం గుర్తుకొస్తుందంటూ

    శౌర్యను చూస్తే నీకు గతం గుర్తుకొస్తుందంటూ

    జ్వాలానే శౌర్య అయితే మన బిడ్డ మనకు లభిస్తుందనే విషయం ఆనందంగా ఉంది అని దీప అంటే.. అవును మన బిడ్డే అవుతుందేమో అని కార్తీక్ అన్నాడు. అతడు చెప్పగానే... అతడి ఆటో వెనుక వెళ్లాలని అనిపించింది అని అంటే.. అవును నాకు కూడా వెళ్లాలనిపించింది. కానీ ఇళ్లంతా చిందరవందరగా ఉందని చెప్పాడుగా.. రేపు ఫంక్షన్‌కు పిలుస్తాడని చెప్పాడుగా.. అని కార్తీక్ అన్నాడు. నీవు శౌర్యను చూస్తే నీకు గతం గుర్తుకు వస్తుందని అనుకొంటున్నాను. ఇప్పటికే నేను ఒక బంధాన్ని నిలబెట్టుకోవడానికి కష్టపడుతున్నాను అని దీప ఎమోషనల్ అయ్యింది. అయితే ఇంద్రుడు తన బిడ్డను చూపించడానికి ఎందుకో సందేహపడుతున్నాడు అని దీప అంటే.. తమ అమ్మాయి సొంత కూతురైనా ఉండాలి.. లేదంటే.. సొంత కూతురిలా చూసుకొంటున్నారేమో అని కార్తీక్ సమాధానం ఇచ్చాడు.

    అయితే ఆ అమ్మాయి శౌర్య అయితే తాము పెంచిన బిడ్డను ఇవ్వకుండా నిరాకరిస్తారేమో అంటే.. లేదు.. మనల్ని చూడగానే... శౌర్య వచ్చేస్తుంది. నీవు గుర్తు పట్టకున్నా.. మన అమ్మాయి మనతోనే ఉంటుంది అని దీప చెప్పింది.

    వాణిపై మోనిత సీరియస్

    వాణిపై మోనిత సీరియస్

    దీప, దుర్గను చంపించాలని ప్రయత్నిస్తే.. వాల్తేరు వాణి ఏమీ చేయలేకపోయింది. దీని మీద ఆశలు పెట్టుకోవాలా? వద్దా తెలియడం లేదు అని మనసులో అనుకొన్నది. అయితే తన ఫ్రెండ్ కావేరి ఫోన్ చేస్తే.. వాణిని పంపించావు.. కానీ పని కావడం లేదు అని మోనిత అంటే.. వాల్తేరు వాణి అంటే మజాక్ కాదు.

    ఆ పని అంత సులభమైంది కాదు.. వాణి తప్పకుండా చేసేస్తుంది అని కావేరి అంటే.. లేదు నాకు టెన్షన్ పెరిగిపోతుందని మోనిత అంటుంటే.. కార్తీక్ వచ్చి షాకిస్తూ.. ఎందుకు టెన్షన్ మోనిత అని అన్నాడు. నేను నా ఫ్రెండ్ కావెరీతో మాట్లాడుతూ.. అలా కాజువల్‌గా అన్నాను అని మోనిత సమాధానం చెప్పింది.

    కార్తీక్.. నన్ను అనుమానిస్తావా?

    కార్తీక్.. నన్ను అనుమానిస్తావా?

    అయితే కావేరి అంటే.. ఊర్లో ఉంటే ఫ్రెండేనా? అని కార్తీక్ అంటే.. ఆమెతో మాట్లాడినా అనుమానమేనా? నీవు దీపతో తిరిగి వచ్చావని నేను ప్రశ్నించకుండా నన్ను అనుమానిస్తున్నావా? మోనిత అని అంటే.. నీవు దుర్గతో తిరగడం లేదా? నీవు దుర్గతో తిరుగుతున్న విషయం తప్పని నిరూపిస్తే.. నేను అతడిని నరికేస్తా అని కార్తీక్ అన్నాడు. దాంతో వెంటనే చేతి పట్టుకొని కార్తీక్‌కు తాము పూజ చేస్తున్నా ఫోటోను చూయించి.. మనం భార్య, భర్తలమని నమ్ము అని మోనిత చెప్పింది. మరీ ఇదేంటి అని దీపతో ఉన్న ఫోటోను కార్తీక్ చూపిస్తూ.. అప్పుడు నేను, దీప భార్యభర్తలమే కాదా? అని అంటుంటే... హల్లో మోనిత అంటూ దుర్గా వచ్చాడు.

    అయితే తాము సీరియస్ డిస్కషన్‌లో ఉన్నాం. మీరు వెళ్లిపోతారా అని కార్తీక్ వార్నింగ్ ఇచ్చాడు. దాంతో కార్తీక్ మంచి వేడిలో ఉన్నాడు అని మనసులో అనుకొంటూ.. దుర్గ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దాంతో ఈ ఫోటోలో మేమిద్దరం ఉన్నాం. అప్పుడు మేము భార్యభర్తలనుకోవచ్చు కదా.. ఇంకోసారి దీపను ఒక్క మాట అనకు.. జాగ్రత్త అంటూ కార్తీక్ వార్నింగ్ ఇచ్చాడు.

    జ్వాలాకు అమ్మ కావాలంటా?

    జ్వాలాకు అమ్మ కావాలంటా?

    ఇంద్రుడు కోసం వేచి చూస్తున్న.. చంద్రమ్మ.. ఇంకా రాలేదని కంగారుపడిపోయింది. అంతలోనే ఆటోలో రావడంతో.. ఇంత లేట్ అయింది? జ్వాలా అమ్మను చూడాలని అనుకొంటున్నది. ఇప్పటికిప్పుడు అమ్మను ఎక్కడి నుంచి తీసుకొస్తాం. ఇంతకు బట్టలు, నగలు తెచ్చావా? అంటే.. తెచ్చానని ఇంద్రుడు చెప్పాడు.

    ఇంత డబ్బు ఎక్కడిదంటే.. ఆటోను తాకట్టు పెట్టాను అని చెప్పాడు. ఆటో తాకట్టు పెడితే.. ఆటో వాళ్ల వద్ద ఉండాలి కదా.. అని అంటే.. నేను చెప్పే మాటలు అర్ధం కావడం లేదా? నేను దొంగతనం చేయలేదు అని ఇంద్రుడు కసురుకొన్నాడు. అయితే ఇంద్రుడు మాటలను బట్టి.. ఏదో దాస్తున్నాడు అని చంద్రమ్మ అనుకొన్నది.

    జ్వాలానే నా బిడ్డ అంటూ

    జ్వాలానే నా బిడ్డ అంటూ


    ఇక ఇంట్లో పిండి వంటలు చేస్తూ.. నా బిడ్డ పుష్పవతి అయితే నేను లేకపోతిని. అత్తమ్మ పెద్దది అయిపోయిందా? అంటూ బాధపడింది. అంతలోనే వాల్తేరు వాణి వచ్చి.. ఏంటి? పిండి వంటలు చేస్తున్నావు అంటే.. శౌర్య పెద్ద మనిషి అయింది.. జ్వాలా నా బిడ్డే అని నా కన్న పేగు చెబుతున్నది అని దీప అంది. అంతలోనే దుర్గ వచ్చి స్వీట్లు పంచుతూ.. మోనితను కార్తీక్ కడిగేశాడు. అంతకు ముందు కార్తీక్ ఏమన్నా అంటే.. పడకపోయేది.. ఇప్పుడు మౌనంగా ఉంది. ఇక కార్తీక్ గతం గుర్తుకు వస్తే.. ఇక అసలు విషయం ఎలా ఉంటుందో అని దుర్గ అన్నాడు. అయితే దీప, దుర్గ చెప్పిన విషయాలను మోనితకు చెప్పాలని వాణి బయలు దేరింది.

    నా జీవితం ముగిసినట్టే అంటూ మోనిత

    నా జీవితం ముగిసినట్టే అంటూ మోనిత


    మోనిత వద్దకు వెళ్లి.. ఆటో డ్రైవర్ ఇంట్లో ఉన్న జ్వాలానే వారి బిడ్డ అంటా? ఆ అమ్మాయి కోసం దీప స్వీట్లు చేస్తుందని చెప్పింది. కార్తీక్, దీప ఇద్దరు కలిసి వెళ్తున్నారు అని వాణి చెబితే.. దాంతో మోనిత సీరియస్‌గా రియాక్ట్ అయింది. వారిద్దరూ ఆ అమ్మాయిని కలువకూడదు. వారిద్దరి కలిస్తే.. ఆగిపోయిన వారి జీవితం మళ్లీ మొదలవుతుంది. ఇక మొదలైందన్న నా జీవితం.. ఇక్కడే ముగిసిపోతుంది. కార్తీక్ కోసం ఇంత కాలం పడిన కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరవుతుంది.

    English summary
    highlights of October 28th Episode number 1494 in Karthika Deepam serial: Karthik serious over Mounitha affair with Durga
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X