Karthika Deepam weekly roundup దీపపై మర్డర్ ప్లాన్.. కార్తీక్‌కు గతం గుర్తుకు రావడంతో.. సీరియల్‌లో ట్విస్టుపై
కార్తీకదీపం సీరియల్‌లో గతవారం అక్టోబర్ 10 నుంచి 15వ వరకు జరిగిన ఎపిసోడ్స్ రకరకాల ట్విస్టులతో ముందుకు సాగింది. గతం మరిచిపోయిన కార్తీక్ మళ్లీ మామూలు మనిషి కావడం ఈ వారం సిరీయల్‌లో చోటు చేసుకొన్న మలుపు. గతం గుర్తుకు వచ్చిన కార్తీక్ ఇక తనదైన శైలిలో డ్రామాకు తెరలేపారు. మోనిత కుట్రలకు చెక్ పెట్టేలా తన గేమ్ ప్రారంభించాడు. గత వారం రోజులుగా టాప్ రేటింగ్ సీరియల్‌లో ఏం జరిగిందంటే..

దుర్గ చేతిలో మోనిత విలవిల
సంగారెడ్డి ఊరులో కార్తీక్ తన భర్త అని గ్రామస్టుల చేత చెప్పించి దీపను మోనిత అవమాన పరిచింది. అయితే అదే ఊరులో మోనితకు బుద్ది చెప్పడానికి దుర్గ దిమ్మతిరిగే ప్లాన్ వేశాడు. అదే ఊరిలో మోనిత, దుర్గ జంటగా తిరుగుతుంటారని కార్తీక్ ముందు గ్రామస్తుల చేత చెప్పించేందుకు దుర్గ కొందరిని పెట్టాడు. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి వచ్చి.. మోనిత ఒక్కతే వచ్చింది.. నీవు రాలేదని అనుకొన్నా.. నీవు వచ్చేశావు. .మీరు ఇద్దరు కలిసి తిరుగుతుంటే.. మాకు చూడటం అలవాటు అయిపోంది. మీరు ఒక్కరే తిరిగితే ఎదోలా ఉంది అని అన్నాడు. దాంతో కార్తీక్ చేయి విదిలించుకొని మోనితను అక్కడే వదిలిపోయాడు. ఇక సంగారెడ్డి పెద్ద రాజేశ్వరి కూడా మోనితకు షాకిచ్చింది. మోనిత, దీపది ఈ ఊరు కాదు అని స్పష్టం చేసింది.

దీపను హత్య చేయించేందుకు
కార్తీక్ తన చేతిలో నుంచి చేజారి పోతున్నాడనే అభద్రతా భావానికి గురైన మోనిత దారుణానికి ఒడిగట్టింది. దీపను చంపించేందుకు కొంత మంది గుండాలకు సుపారీ ఇచ్చింది. కార్తీక్‌కు నాకు మధ్య అడ్డువస్తే ఎంతకైనా తెగిస్తా. నిన్ను ఆడ్డం తొలగించుకోవడానికి నీ ప్రాణాలు తీయడానికైనా సిద్దం అని మోనిత చెప్పింది. అయితే కార్తీక్ నా భర్తే.. అంతా దేవుడే చూసుకొంటాడు అని దీప చెప్పింది. అయితే దూరంగా మోనిత మాటలు విన్న కార్తీక్.. ఇప్పటి వరకు ఎన్ని ప్రాణాలు తీశావు అంటూ నిలదీశాడు.

డాక్టర్ బాబు మీరు బతికే ఉన్నారా?
దీప ప్రాణాలు తీసేందుకు బతుకమ్మ వేడుకలను మోనిత వేదికగా చేసుకొన్నది. గుండాలను ఊరిలోకి రప్పించిన మోనిత.. దీపను ఊరి అవతలికి పంపించే ప్లాన్ చేసింది. దీపపై ఎటాక్ జరిగే సమయానికి ఎవరికి అనుమానం రాకుండా కార్తీక్ పక్కన ఉండేలా ప్లాన్ చేసుకొన్నది. ఈ లోగా.. కార్తీక్‌కు వారణాసి ఎదురుపడి డాక్టర్ బాబు మీరు బతికే ఉన్నారా అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. దీపను రౌడీలు ఉండే చోటికి పంపించి.. ఈ రోజే నీకు చివరి రోజు అంటూ సంబరపడిపోయింది.

రౌడీలను చితకబాదిన కార్తీక్
కార్తీక్‌ను కలిసిన వారణాసి.. దీపనే మీ భార్య అని చెప్పడంతో డాక్టర్ బాబు ఆందోళనకు లోనయ్యాడు. తన అంతు చూస్తానని చెప్పిన మోనితను రాయితో కొట్టేందుకు ప్రయత్నించగా.. అది నేరుగా వెళ్లి కార్తీక్ తలకు తగిలింది. దాంతో వెంటనే డాక్టర్ బాబుకు గతం గుర్తుకు వచ్చింది. వారణాసిపై దాడి చేయడానికి వచ్చిన రౌడీలను కార్తీక్ చితకబాదాడు. వారణాసిని కాపాడే సమయంలో తన తలకు గాయం కావడంతో హాస్పిటల్‌కు వెళ్లి ట్రీట్‌మెంట్ చేయించుకొన్నాడు.

ఫ్యామిలీని రక్షించుకొనే ప్లాన్
గతం గుర్తుకు వచ్చిన కార్తీక్ తన లెవెల్‌లో డ్రామా మొదలు పెట్టాడు. తనకు గతం గుర్తుకు రాలేదనే విధంగా ప్రవర్తిస్తూ మోనిత కుట్రలకు చెక్ పెట్టేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టి.. దీపను తన ఫ్యామిలీని రక్షించుకొనే ప్లాన్ వేశాడు. మోనితకు కౌంటర్ ఇస్తూ నన్ను చంపేందుకు దుర్గతో కలిసి ప్లాన్ వేశావా. అయితే నన్ను కొట్టిందెవరు? వాళ్ల పేరు చెప్పంటూ అంటూ కార్తీక్ షాకిచ్చాడు.

కార్తీకదీపం రేటింగ్ ఇలా..
ఇక కార్తీకదీపం సీరియల్ రేటింగ్ విషయానికి వస్తే.. గత కొద్దివారాల క్రితం టాప్ నుంచి భారీగా పడిపోయిన ఈ సీరియల్ మళ్లీ పుంజుకొన్నది. అర్బన్ ప్రాంతంలో 39 వారంలో 10.95 రేటింగ్ నమోదు చేసుకొంటే.. ప్రస్తుతం వారం 10.12 రేటింగ్ నమోదైంది. ఇక రూరల్ ప్రాంతంలో 39వ వారం 12.47 రేటింగ్ నమోదు కాగా, 40వ వారం 11.89 రేటింగ్ నమోదైంది.


Click it and Unblock the Notifications











