కార్తీకదీపం కోసం అభిమానికి టీవీ కొనిచ్చిన వంటలక్క.. ఐపీఎల్ గోల తట్టుకోలేక..

కరోనా కష్ట కాలంలో చాలా ఎంటర్టైన్మెంట్ ని మిస్సయిన ఆడియెన్స్ కి ఇప్పుడే అసలైన వినోదం దక్కుతోంది. ఇక కార్తీక దీపంకు ఆ మధ్య కొంత గ్యాప్ వచ్చిన విషయం తెలిసిందే. ఆ గ్యాప్ కూడా సీరియల్ కి బాగానే ఉపయోగపడింది. ఎంతగా అంటే సీరియల్ ఎప్పుడు చూడని వారు కూడా పాత ఎపిసోడ్స్ ని మళ్ళీ చూశారు. హాట్ స్టార్ లో ఎక్కువగా చూసే సీరియల్ గా కార్తీక దీపం మరో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక రీసెంట్ గా వంటలక్క ఐపీఎల్ గోల తట్టుకోలేక ఒక అభిమాని కోసం ఏకంగా టీవీ కొనిచ్చింది.

ఐపీఎల్ vs కార్తీకదీపం

ఐపీఎల్ vs కార్తీకదీపం

తెలుగు ప్రస్తుతం అత్యదిక టీఆర్పీ అందుకుంటున్న సిరియల్స్ లలో కార్తీక దీపం నెంబర్ వన్ స్థానంలో ఉందనే చెప్పాలి. స్టార్ హీరోల సినిమాలకంటే కూడా హై రేంజ్ లో క్రేజ్ అందుకున్న ఆ సీరియల్ కి ఇప్పుడు ఐపీఎల్ గండం ఏర్పడింది. రోజు రాత్రి 7.30గంటలకు ప్రసారమయ్యే ఈ సీరియల్ కోసం ఇప్పుడు చాలా ఇళ్లల్లో అలకలు, గొడవలు కూడా మొదలవుతున్నాయి.

సిరియల్ కోసం సౌరవ్ గంగూలీకి లేఖ

సిరియల్ కోసం సౌరవ్ గంగూలీకి లేఖ

రిమోట్ పట్టుకున్నోడిదే రాజ్యం అనేలా ప్రతీ రోజు ఒక టీవీ ఉన్న ఇంట్లో కార్తీక దీపం, ఐపీఎల్ క్రికెట్ కోసం పోటీలు జరుగుతునే ఉన్నాయి. అయితే ఒక ఇంట్లో ఇదే తరహా సన్నివేశం చోటు చేసుకోవడంతో ఏకంగా బిసిసిఐ చైర్మన్ సౌరవ్ గంగూలీకి లేఖ పంపారు. సూర్యాపేటకు చెందిన శివ చరణ్ అనే వ్యక్తి ఐపీఎల్ టైమింగ్ ని ఒక అరగంట మార్చాలని కార్తీక దీపం వచ్చే సమయంలో ఇబ్బందిగా మారిందని ట్విట్టర్ ద్వారా లేఖ రాశారు.

స్పందించిన వంటలక్క

స్పందించిన వంటలక్క

ఆ ట్వీట్ పై స్టార్ మా కూడా పాజిటివ్ గా స్పందిస్తూ.. 8గంటలకు ఐపీఎల్ మ్యాచ్ లను ప్రసారం అయ్యేలా కోరుతున్న విధానంలో ఏ మాత్రం తప్పు లేదని వివరణ ఇచ్చారు. ఇక ఈ విషయంలో కార్తీక దీపం ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఆ ఉద్యమంపై చివరకు కార్తీక దీపం సీరియల్ నటి వంటలక్క ప్రేమి విశ్వనాథ్ స్పందించారు.

అభిమాని కోసం ఖరీదైన టీవీ

అభిమాని కోసం ఖరీదైన టీవీ

తన అభిమాని చూపించిన ప్రేమకు ఎట్రాక్ట్ అయిన ప్రేమి విశ్వనాథ్ చివరకు ఐపీఎల్ టైమింగ్ ని ఎలాగూ మార్చలేమని వారి ఇంటికి మరో టీవీని పంపింది. వారి ఇంట్లో ఒకేసారి ఐపీఎల్, కార్తీక దీపం వలన కొనసాగుతున్న అసౌకర్యం ఏ మాత్రం నచ్చలేదని వంటలక్క 32 అంగుళాల టీవీని బహుమతిగా ఇచ్చారు. దీంతో ఒక్కసారిగా ఆ అభిమాని ఎంతగానో ఆనందించాడు. ఈ ఒక్క న్యూస్ తో కార్తీక దీపం సీరియల్ పవర్ ఏమిటో మరోసారి ఋజువయ్యింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X