Karthika Deepam: విషకన్యగా మారిన మోనిత.. వంటలక్క అంతానికి దుష్టపన్నాగం.. అపస్మారక స్థితిలో దీప
తెలుగు బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటున్న కార్తీక దీపం సీరియల్ మరిన్ని మలుపులతో ముందుకు సాగుతున్నది. దీప పుట్టింటిలో జరుగుతున్న శ్రీ సీతారామ కల్యాణం పూజ కోసం కార్తీక్‌తోపాటు కుటుంబ సభ్యులంతా వెళ్లారు. కార్తీక్ కోరిక మేరకు డాక్టర్ మోనిత, డాక్టర్ భారతీ గెస్టులుగా దీప ఇంట్లో జరిగే పూజ కోసం వెళ్లారు. ఈ క్రమంలో దీప, మోనిత మధ్య చోటు చేసుకొన్న గొడవ గురించి...
సాంప్రదాయ దుస్తుల్లో కూడా గ్లామర్ డోస్ పెంచిన మాధురి బ్రాగంజా

దీప అంటే డాక్టర్ కార్తీక్‌కు
దీప ఇంట్లో జరిగే పూజా కార్యక్రమం కోసం వెళ్తుండగా కారులో డాక్టర్ భారతీ, డాక్టర్ మోనిత మధ్య ఆసక్తికరమైన సంభాషణ జరిగింది. దీప అంటే కార్తీక్ చెప్పలేనంత ప్రేమ ఉంది. ఆమెను చాలా జాగ్రత్తగా చూసుకొంటారని డాక్టర్ భారతీ అంటే.. అవును వారిద్దరిది ప్రేమ వివాహం విన్నాను. నేను అమెరికాలో ఉన్నప్పుడు వారిద్దరి పెళ్లి జరిగింది. నేను అమెరికా నుంచి వచ్చిన తర్వాత నాకు ఆ విషయం తెలిసింది అంటూ మోనిత చెప్పింది.

దీపను ఐసీయూలో చేర్పిస్తా
ఆ తర్వాత డాక్టర్ భారతీ తమ సంభాషణను పొడిగిస్తూ.. వంటలక్క ఆరోగ్య పరిస్థితి మరింత విషమిస్తున్నది. వంట వద్ద ఉండే పొగ వల్ల ఊపిరితిత్తులు బాగా పాడైపోయాయి. ఆమె ఆరోగ్యం చేజారుతున్నది అని అన్నారు. అవును.. అందుకే దీప చేత మింగించడానికి ట్యాబ్లెట్లు తెస్తున్నాను. అవి ఆమెతో మింగించి ఐసీయూలో చేర్పిస్తాను. ఇక దీప అంతు చూడటమే నా పని అంటూ మనసులోనే మోనిత గుసగుసలాడింది.

వంట చేస్తుండగా విపరీతమై దగ్గుతో దీప
దీప తన పుట్టింటిలో జరుగుతున్న పూజ కోసం నైవేద్యం చేస్తుండగా విపరీతమైన దగ్గు వచ్చింది. దాంతో దీపపై కార్తీక్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్ను నైవేద్యం చేయమని ఎవరు చెప్పారు. ఇప్పుడు నీవు వంట చేయడం అవసరమా? అమ్మా నీ కోడలు వంటలక్కగా మారింది అని కార్తీక్ అంటే.. నేను చేయమని తల్లి సౌందర్య సమాధానం ఇచ్చింది.

గెస్గుగా వచ్చావు.. అలానే ఉండు అంటూ..
దాంతో ఆ పక్కనే మోనితను డాక్టర్ బాబు చూసి.. దీప నా మాట వినడం లేదు అని అంటే.. దీప నీ భర్త మాటలు విను అంటూ మోనిత ఏదో చెప్పబోయింది.. అంతలో నీవు గెస్టుగా వచ్చావు.. గెస్గుగానే ఉండు. అంతేగానీ మా కుటుంబ వ్యవహారంలో జోక్యం చేసుకోకు అనే విధంగా మాట్లాడింది.
Recommended Video

కార్తీక్‌పై పడిన దీప.. అపస్మారక స్థితిలోకి...
ఇలా దీప, మోనిత మధ్య గొడవ కొనసాగింది. ఈ ఎపిసోడ్ ముగిసిన తర్వాత సీతారాముల కల్యాణం పూజ జరుగడానికి ముందు దీపకు మోనిత ట్యాబ్లెట్స్ ఇచ్చింది. ఆ ట్యాబ్లెట్స్ వేసుకొన్న తర్వాత పూజపై కూర్చొన్న దీప... పక్కనే ఉన్న భర్త కార్తీక్‌పై తూలిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. దాంతో ఇంటి సభ్యులు ఆందోళనలకు లోనయ్యారు.


Click it and Unblock the Notifications











