Karthika Deepam.. వంటలక్క బతకడం కష్టం.. మోనిత కుతంత్రాలకు దీప బలికానున్నదా?
తెలుగు టెలివిజన్ రంగంలో సంవత్సరాలుగా టాప్ రేటింగ్‌తో కొనసాగుతున్న కార్తీక దీపం సీరియల్‌లో ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకొంటున్నాయి. ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా కార్తీక్‌ను దీపకు దూరం చేసి తనను దక్కించుకోవాలనే కుతంత్రాలను డాక్టర్ మోనిత జోరుగా చేస్తున్నారు. ఆమె దుష్టబుద్ధికి దీప ఇంటిలో జరుగుతున్న శ్రీ సీతారాముల కల్యాణం పూజ వేదికగా మారింది. మోనిత కుట్రలు ఎలా కొనసాగుతున్నాయంటే..

వంటలక్కను వెంటాడుతున్న అనారోగ్యం
వంట చేయడం వల్ల వచ్చే పొగతో దీపకు ప్రమాదం ఉంది. కాబట్టి వంట పనులకు దీపను దూరంగా ఉంచాలి. నెల రోజులపాటు కరెక్ట్‌గా మందులు వాడితే గానీ ఆమె బతకడానికి అవకాశాలు ఉంటాయి. ఒకవేళ సరైన జాగ్రత్తలు తీసుకోకుండా మందులు వాడకపోతే ఆమె బతకడం కష్టం అంటూ కార్తీక్, ఆయన తండ్రికి డాక్టర్ భారతీ వెల్లడించింది. దాంతో దీప ఆరోగ్యంపై ఎన్నో అనుమానాలు ఉన్న కార్తీక్ తండ్రికి కాస్త ఉపశమనం దక్కింది.

కుట్రలకు మోనిత పదును
డాక్టర కార్తీక్ బాబు ఆహ్వానం మేరకు దీప ఇంటిలో జరిగే పూజకు హాజరైన మోనిత తన కుట్రలకు పదునుపెట్టింది. విషపు మాత్రలను దీపతో మింగించాలనుకొని.. ఆ సమయం కోసం ఎదురు చూస్తున్నది. అంతలోనే వంట వ్యవహారం దీప, కార్తీక మధ్య గొడవకు కారణం కావడంతో దానిని అదునుగా చేసుకొన్నది.

విషపు ట్యాబ్లెట్లను మింగించేందుకు
తనను దీప టార్గెట్ చేయడాన్ని మోనిత జీర్ణించుకోలేకపోయింది. ఒక్క నిమిషం సమయం చిక్కితే నీ అంతు చూస్తాననే విధంగా వ్యవహరిస్తుంది. తన వెంట తెచ్చుకొన్న విషపు ట్యాబెట్లను దీపతో మింగించడానికి సమయం కోసం ఎదురు చూస్తున్నది. భర్తతో కలిసి పూజ ఎలా చేస్తావో అంటూ మోనిత లోలోపల కుమిలిపోయినట్టు కనిపించింది.

మోనితపై దీప ఆగ్రహం
తన కుటుంబంలో చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్న మోనితపై దీప ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేసింది. మోనిత చెబితే తాను చేయడానికి ససేమిరా అంటూ కార్తీక్‌పై మండిపడింది. నైవేద్యం, దోసకాయ కూరకు తేడా తెలియదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. మోనిత ఇస్తే మందులు వేసుకోవాల్సిన ఖర్మ తనకు పట్టలేదని దీప తెగేసి చెప్పింది.
Recommended Video

విషపు ట్యాబ్లెట్ మింగిన దీప
ఇంతలో పూజ కోసం రెడీ కావాలని కుటుంబ సభ్యులు హడావిడి చేయడంతో పట్టు వస్త్రాలు ధరించి డాక్టర్ బాబు, దీప పూజలో కూర్చున్నారు. అంతలోనే ఓ చేయి ఆమెకు ట్యాబ్లెట్ అందించింది. విషపు ట్యాబ్లెట్ మింగిన దీప.. కార్తీక్ భుజంపై పడింది. దాంతో మోనిత వికట్టాహసం చేసింది.


Click it and Unblock the Notifications











