For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పేషెంట్‌ను చంపేసిన డాక్టర్ కార్తీక్.. కార్తీకదీపం సీరియల్ మరో భారీ ట్విస్టు

  |

  మోస్ట్ టీఆర్పీ సొంతం చేసుకొన్న కార్తీకదీపం సీరియల్‌ అనేక మలుపులతో కొనసాగుతున్నది. తాజాగా డాక్టర్ అసోసియేషన్స్ ఎన్నికల్లో కార్తీక్ అధ్యక్షుడిగా ఎన్నికైనా సందర్భంలో మోనిత చేసిన రచ్చకు దీప చెప్పిన సమాధానంపై కుటుంబ సభ్యులు ఎమోషనల్ అయ్యారు. అయితే దీప వ్యవహరించిన తీరుపై అత్తగారు సౌందర్య భావోద్వేగానికి లోనయ్యారు. తనలో బాధను దీపకు వ్యక్తం చేసుకొంటూ గతంలో జరిగిన విషయాలను పంచుకొన్నారు. తాజా ఎపిసోడ్ 1213లో ఏం జరిగిందంటే..

  దీప నన్ను క్షమించు అంటూ

  దీప నన్ను క్షమించు అంటూ

  నీకు జీవితంలో సుఖం లేదు. పెళ్లి తర్వాత 11 ఏళ్లు కార్తీక్‌కు దూరం అయ్యావు. మళ్లీ కలిశావని అనుకొంటే.. మోనిత రూపంలో ఇలాంటి సమస్యలు. అయితే వాడు తన బాధను చెప్పుకొలేడు. మోనితను ఎదురించలేడు అంటూ సౌందర్య ఆవేదన వ్యక్తం చేసింది. నీకు చెప్పకుండా కొన్ని పనులు చేయాల్సి వచ్చింది. మోనిత డెలీవరీ సమయంలోను, అలాగే పూజ సమయంలో చెప్పకుండా కొన్ని విషయాలు దాచిపెట్టాం. అందుకు కారణాలు కొన్ని ఉన్నాయి. వీలైతే నన్ను క్షమించు దీప అంటే.. మిమ్మల్ని క్షమించడం ఏమిటి అత్తయ్య అంటూ సౌందర్య కంటతడిని దీప తుడిచింది.

  నీకు చీము, నెత్తురు ఉందా అంటూ

  నీకు చీము, నెత్తురు ఉందా అంటూ

  ఇంట్లో వస్తువులు చిందరవందరగా పడి ఉండటంతో ప్రియమణిపై మోనిత అరిచింది. ఏంటి ప్రియమణి.. ఇలా వస్తువులు ఎవరు విసిరికొట్టారు అని మోనిత అడిగితే.. నేనే అంటూ ప్రియమణి సమాధానం చెప్పింది. నాకే కోపం వచ్చింది. అందుకే వస్తువులు విసిరికొట్టాను. మీరు ఎన్ని మాటలు తిట్టినా పడుతూ ఉన్నాను. మీ ఇంటి సొమ్ము తింటూ బతుకుతున్నాను. మెడికల్ క్యాంప్ వద్ద చీపిరికట్ట పట్టుకొని కొట్టడానికి వచ్చారు. మీకు చీము, నెత్తురు ఉందా అంటూ ప్రియమణి ప్రశ్నించింది. దాంతో ఎక్కువ మాట్లాడితే చెంప పగలకొడుతాను. కానీ అక్కడి నుంచి వచ్చిన తర్వాత మీరు ప్రతీకారం తీర్చుకొన్నారా? బిడ్డను చూసి మురిచపోవడం, కార్తీక్ నా వాడు అనుకొంటూ ఉంటున్నావు. కానీ కార్తీక్ ఎవరి సొంతమయయ్యాడో తెలుసా అంటూ ప్రియమణి ఘాటుగా స్పందించింది.

  కార్తీక్, దీపను వదిలిపెట్టను అంటూ

  కార్తీక్, దీపను వదిలిపెట్టను అంటూ

  దాంతో దీపే నా సర్వస్వం అని చెప్పిన కార్తీక్‌ను నా వద్దకు నడిచి వచ్చేలా చేస్తాను. దీపను కూడా వదలను అని మోనిత అంటే.. నన్ను నమ్మమంటావా అమ్మా అంటూ ప్రియమణి ప్రశ్నించింది. అయితే కార్తీక్, దీపను వదిలిపెట్టేది లేదు. నిజం నన్ను నమ్ము. నా ఇంట్లో పనిమనిషిగా ఉంటూ.. నా బాధలను నీ బాధలుగా భరిస్తున్నావంటే నీవే నాకు నిజమైన బంధువు అంటూ ప్రియమణిని మోనిత మెచ్చుకొన్నది.

  హార్ట్ పేషెంట్‌కు కార్తీక్ సర్జరీ

  హార్ట్ పేషెంట్‌కు కార్తీక్ సర్జరీ

  ఇక డాక్టర్ కార్తీక్ ఓ ఆపరేషన్‌కు సిద్దమయ్యాడు. రోగి రిపోర్టులను చూస్తూ ఇప్పటికే చాలా లేట్ చేశారు అంటే.. ఎదురుగా ఉన్న పేషెంట్ పిల్లల్ని, భార్యను నర్స్ పరిచయం చేసింది. దాంతో నా భర్తను నీవే కాపాడలయ్యా.. అంటూ ప్రాధేయపడింది. దాంతో మీరేమి బాధపడకండి.. కాసేపట్లో ఆపరేషన్ చేస్తాను. ధైర్యంగా ఉండండి అంటూ కార్తీక్ అంటే.. డాక్టర్ గారిని వెళ్లనివ్వండి అంటూ నర్స్ చెప్పింది. నా భర్త సర్జరీకి అప్పు చేశాం. నా పిల్లల పెళ్లి వరకైనా ఉండేలా చూడండి.. అంటే.. ఆయన కలకాలం బతుకుతారు అని కార్తీక్ భరోసా ఇచ్చారు. నాకు కూడా ఇదే వయసులో ఇద్దరు పిల్లలు ఉన్నారు. బాగా చదువుకోవాలని అని చెప్పి గుండె సర్జరీ కోసం వెళ్లాడు.

   నీ బాడీ.. నీ మనసు ఫిట్‌గా లేదు అంటూ

  నీ బాడీ.. నీ మనసు ఫిట్‌గా లేదు అంటూ

  గుండె జబ్బు పేషెంట్‌కు సర్జరీ చేస్తుండగా కార్తీక్ అసౌకర్యానికి గురయ్యాడు. అయితే పక్కనే ఉన్న డాక్టర్ రవి కంగారుపడిపోయాడు. నీవ్వు ఒకేనా.. అంటే నాకు ఏదోలా ఉంది.. కాస్త మత్తుగా ఉంది అని కార్తీక్ సమధానం చెప్పారు. అయితే ఆపరేషన్ వాయిదా వేద్దాం. నీ బాడీ నీ మనసు ఫిట్‌గా లేదు. నాకు అర్దమవుతుంది అని డాక్టర్ రవి చెప్పాడు. కానీ పేషంట్ పల్స్ పడిపోతుండటంతో.. డాక్టర రవి కంగారు పడ్డాడు. మరోసారి ఆలోచించండి.. పల్స్ రేట్ పడిపోతుందని రవి చెప్పాడు.

  Bigg Boss Telugu 5 : Sarayu ఎలిమినేషన్.. జంటల రొమాన్స్ అదుర్స్ !! || Filmibeat Telugu
  పేషెంట్‌ను చంపేశావు అంటూ

  పేషెంట్‌ను చంపేశావు అంటూ


  అయితే మత్తులోనే కార్తీక్ సర్జరీని కొనసాగించాడు. అయితే ఏదో తప్పుగా సర్జరీ చేస్తుండగా డాక్టర్ రవి ఏం చేస్తున్నావు.. స్పృహలో ఉన్నావా? కార్తీక్ పేషంట్ కండిషన్ దారుణంగా ఉంది. అలా కట్ చేయకూడదు.. అంటే నా ప్రయత్నం చేయని అంటే.. డాక్టర్ కార్తీక్ చేతులు దాటిపోయాయి. పేషెంట్‌ను చంపేశావు .. పేషంట్‌ను చంపేశావు అంటూ డాక్టర్ రవి ఆందోళన చెందడం సీరియల్‌లో ట్విస్టుగా మారింది. అయితే తదుపరి ఎపిసోడ్‌లో ఏం జరుగిందనే విషయంపై మరింత ఆసక్తిని రేపేలా సీరియల్ ఎపిసోడ్‌ను ముగించారు.

  English summary
  Karthika Deepam's December 3rd Episode number 1213: Karthik made surgery in different conditions
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X