For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Karthika Deepam డాక్టర్ కార్తీక్ చేతిలో పేషెంట్ హతం.. పండుగ చేసుకొన్న మోనిత.. మృతుడి ఫ్యామిలీ కోసం..

  |

  తెలుగు బుల్లితెరపై అత్యధిక రేటింగ్‌ను సొంతం చేసుకొంటున్న కార్తీకదీపం సీరియల్‌లో మరో భారీ ట్విస్టు తెరపైకి వచ్చింది. బెస్ట్ డాక్టర్ అంటూ ప్రశంసలు, అవార్డులు అందుకొంటున్న కార్తీక్ చేసిన సర్జరీ వికటించడంతో పేషెంట్ చనిపోవడం అందర్నీ షాక్ గురిచేసింది. మెడికల్ అసోసియేషన్ ముందు దోషిగా నిలబడాల్సిన అవసరం ఏర్పడింది. మోనిత చేసిన కుట్రకు కార్తీక్ ఇలా బలవ్వడంతో కుటుంబ సభ్యులు కూడా ఆందోళనకు గురయ్యాడు. తన చేతుల్లో పేషెంట్ చనిపోవడానికి కారణం కావడంతో కార్తీక్ సంచలన నిర్ణయం తీసుకొన్నాడు. ఆ నిర్ణయం ఏమిటి? తాజా ఎపిసోడ్ 1215‌లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..

  వెక్కి వెక్కి ఏడ్చిన కార్తీక్

  వెక్కి వెక్కి ఏడ్చిన కార్తీక్

  సర్జరీ చేసిన తర్వాత పేషెంట్ చనిపోవడంతో తీవ్ర దిగ్బ్రాంతి, బాధలో మునిగిపోయిన కార్తీక్.. భావోద్వేగంతో ఇంటిలో అడుగుపెట్టాడు. కార్తీక్ అదోలా ఉండటంతో కుటుంబ సభ్యులు ఏం జరిగిందంటూ అడిగారు. అయితే ఏం లేదంటూ ముభావంగా తన గదిలోకి వెళ్తుండగా.. మళ్లీ మోనిత వచ్చి ఏదైనా గొడవ చేసిందా అంటూ తల్లి ప్రశ్నించింది. అదేం లేదంటూ తన గదిలోకి వెళ్లి తలుపులు వేసుకొని వెక్కి వెక్కి ఏడవడం చేశాడు. పేషెంట్ భార్య.. నీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారి బతుకు కూడా మా మాదిరిగానే అవుతుంది అంటూ రోడ్డుపై దుమ్మెత్తి పోయడాన్ని తలుచుకొంటూ నిరాశ, నిస్పృహలో మునిగిపోయాడు.

  నా పిల్లలు ఏం తప్పు చేశారంటూ..

  నా పిల్లలు ఏం తప్పు చేశారంటూ..

  తన గదిలోకి వెళ్లి గోడకు పిల్లలు అంటించిన పోస్టర్లు తీసుకొని కంటతడి పెట్టుకొన్నాడు. నీకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కదా.. వాళ్లకు నా పిల్లల ఉసురు తగులుంది. మా ఉసురు తగులుతుంది. నాశనం అయిపోతారు అంటూ పేషెంట్ భార్య పెట్టిన శాపనార్థాలను తలచుకొని కార్తీక్ బాధపడ్డాడు. నా పిల్లలు ఏం తప్పు చేశారు. తప్పు చేసింది నేను అంటూ కార్తీక్ కుమిలిపోయాడు. అలా ఏడుస్తుంటే కార్తీక్ గదిలోకి వచ్చి తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు.

  కార్తీక్ కుటుంబ సంచలన నిర్ణయం

  కార్తీక్ కుటుంబ సంచలన నిర్ణయం

  కార్తీక్ నేలపై కూర్చోని ఏడవడం చూసి తల్లి సౌందర్య, తండ్రి ఆనందరావు కంగారు పడిపోయారు. ఏం జరిగిందంటూ అడిగితే.. సర్జరీ తర్వాత పేషెంట్ చనిపోయిన విషయాలు చెప్పి తల్లిడిల్లాడు. దాంతో తల్లిదండ్రులు కూడా కంగారు పడిపోయారు. అయితే తన బాధ నుంచి తేరుకొని.. దీప ఇంటికి రాకముందే.. నేను చెప్పిన పని చేయాలని సూచించాడు. నా మాటను కాదనకూడదని ఓ విషయాన్ని చెప్పాడు. దాంతో తల్లిదండ్రుల కాస్త కంగారు పడినా.. తేరుకొని కార్తీక్‌కు ఇచ్చిన మాటను నెరవేర్చేందుకు సిద్దమయ్యారు.

  సంతోషంలో మోనిత సంబరాలు

  సంతోషంలో మోనిత సంబరాలు

  సర్జరీకి ముందు తన పథకంలో భాగంగా కార్తీక్ తాగే కాఫీలో నిద్రమాత్రలు వేయించడం, సర్జరీ సమయంలో మత్తులో ఏదో చేయడంతో పేషెంట్ మరణించడం డాక్టర్ బాబు కెరీర్‌పై దారుణమైన మచ్చపడింది. మెడికల్ అసోసియేషన్ కార్తీక్ డాక్టర్ లైసెన్స్‌ను రద్దు చేసే ప్రమాదం వరకు రావడం తెలుసుకొన్న మోనిత ఆనందంలో మునిగిపోయింది. పనిమనిషి ప్రియమణిని పిలిచి సంతోషంలో గంతులేసింది. డాక్టర్ కార్తీక్‌కు మెడికల్ అసోసియేషన్ సస్పెన్షన్ వేటు వేయడానికి సిద్దంగా ఉందంటూ ప్రియమణికి చెప్పుకొని సంబరపడింది.

   కార్తీక్ లైసెన్స్ రద్దు అంటూ

  కార్తీక్ లైసెన్స్ రద్దు అంటూ

  ప్రియమణితో గంతులేస్తూ.. అంతా అయిపోయింది. కార్తీక్ పని అంతా అయిపోయింది. నీ కార్తీక్ అయ్య డాక్టర్ లైసెన్స్ రద్దు అయింది. నీ కార్తీకయ్య ఇక డాక్టర్ కాదు. ఇప్పుడు డాక్టర్ కార్తీక్ ఉత్త కార్తీక్ అయ్యాడు. డాక్టర్ పదవి ఊడిపోయేలా నేనే చేశాను. ఇక దీపమ్మ పరిస్థితి ఏమిటో.. నా డాక్టర్ బాబు.. నా డాక్టర్ బాబు అంటూ రెచ్చ కొట్టేది కదా.. ఇప్పుడు దీప చేస్తుందో అంటూ సంబరాల్లో మునిగిపోయింది. అయితే మోనితను చూస్తూ షాక్‌లో ఉండిపోయింది.

  Athadu Ame Priyudu Movie Launch| Nagababu | Yandamuri Veerendranath | Kaushal | Filmibeat Telugu
  తల్లి సౌందర్యతో కలిసి కార్తీక్ అలా

  తల్లి సౌందర్యతో కలిసి కార్తీక్ అలా

  ఇక చనిపోయిన పేషెంట్ ఇంటికి కార్తీక్ తన తల్లి సౌందర్యతో కలిసి వెళ్లాడు. కార్తీక్‌ను చూడగానే పేషెంట్ భార్య మళ్లీ ఆగ్రహం వ్యక్తం చేసింది. నా భర్త చనిపోయాడా లేదా అని చూడటానికి వచ్చావా? అంటూ నిలదీశాడు. దాంతో పేషెంట్ భార్యను ఓదార్చుతూ.. నీ భర్త ప్రాణాలను నేను తీసుకురాలేను. మీకు జరిగిన నష్టాన్ని నేను పూడ్చలేను. నేను కావాలని ఇలాంటి పనిచేయలేదు. నీ భర్త ప్రాణాలకు వెలకట్టలేం. కానీ అంటూ తన తల్లి చేతిలో ఉన్న ఫైల్స్‌ను బాధితురాలి చేతిలో పెట్టాడు. దాంతో కార్తీక్ ఎలాంటి నిర్ణయం తీసుకొన్నాడనే విషయాన్ని తాజా ఎపిసోడ్‌లో సస్పెన్స్‌గా పెట్టారు. చనిపోయిన పేషెంట్ కుటుంబానికి కార్తీక్ ఏం న్యాయం చేశాడనే విషయం తదుపరి ఎపిసోడ్‌లో ట్విస్టుగా తెలియనున్నది.

  English summary
  Karthika Deepam's December 6rd Episode number 1215: Doctor Karthik intiated the financial help to patient family.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X