దీపను గట్టిగా కౌగిలించుకొని సారీ చెప్పిన కార్తీక్.. భోరున ఏడుస్తూ డాక్టర్ బాబు..

కార్తీకదీపం సీరియల్‌ భావోద్వేగాలతు, కష్టాలు కన్నీళ్లతో ముందుకు సాగుతున్నది. తన చేతిలో పేషెంట్ ప్రాణాలు పోవడంతో కార్తీక్ సంచలన నిర్ణయం తీసుకొన్నాడు. అయితే చేతిలో కొన్ని ఫైల్స్ తీసుకొని మృతుడి ఇంటికి వెళ్లారు. అయితే కార్తీక్ ఆ కుటుంబానికి ఎలాంటి న్యాయం చేయబోతున్నారనే విషయం ఆసక్తిని రేపింది. తాజా 1216 ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే..

Photos Courtesy: Star MAA and Disney+Hotstar

 నేను జీవితాంతం సంపాదించిన ఆస్తి

నేను జీవితాంతం సంపాదించిన ఆస్తి

తాను సర్జరీ చేసిన పేషెంట్ మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబ సభ్యులను కార్తీక్ ఓదార్చాడు. తన చేతిలో ఉన్న ఫైల్స్ ఆమెకు చేతిలో పెడుతూ.. నీ భర్తను తీసుకురాలేను. కానీ నేను జీవితాంతం సంపాదించిన ఆస్తిని మీ పేర రాసి తెచ్చాను. మీరు బతికి ఉన్నంత కాలం కోట్ల ఆస్తితో మీరు పిల్లల పెళ్లిల్లు చేయవచ్చు. మంచి చదువులు చదివించుకోవచ్చు అని కార్తీక్ చెప్పాడు. అయితే ప్రాణాలు తీసి ఆస్తులు రాసిస్తున్నావా? నా భర్త ప్రాణాలు తెచ్చి ఇవ్వు అంటూ మృతుడి భార్య ఆగ్రహం వ్యక్తం చేసింది.

 నా కాళ్లు పట్టుకొంటాను.. కాదనకండి

నా కాళ్లు పట్టుకొంటాను.. కాదనకండి

అయితే దయచేసి నా ఆస్తుల డాక్యుమెంట్లను తీసుకోండి. మీ కాళ్లు పట్టుకొంటాను. మీరు కాదనకండి అంటూ కార్తీక్ దీనంగా ప్రార్థించారు? నా పిల్లలను మాత్రం శపించకు అంటూ ప్రాధేయపడ్డారు. దాంతో పక్కనే ఉన్న సన్నిహితులు ఆవేశంలో నీవు కాదనకు. నీకు, నీ పిల్లలకు ఉపయోగపడుతుంది అంటూ సలహా ఇచ్చారు. ఆ తర్వాత బాధతో అక్కడి నుంచి ఇంటికి వెళ్లారు.

అమ్మా నన్ను గట్టిగా తిట్టండి

అమ్మా నన్ను గట్టిగా తిట్టండి

ఇంటికి వెళ్తూ కార్తీక్ తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. మనిషి ప్రాణాలు తీసిన నన్ను గట్టిగా తిట్టు అమ్మా.. నేను డాక్టర్ ఉద్యోగానికి తీరని ద్రోహం చేశాను అంటే.. నీ తప్పుకు ప్రాయశ్చిత్తం చేశావు కార్తీక్. ఎంతనై నా కొడుకువు నీవు. నీవు తప్పు చేయవని నాకు తెలుసు. కానీ ఏదో తప్పు జరిగిపోయింది అంటూ సౌందర్య చెప్పారు. అలా మనో వేధనతో ఇంటికి చేరుకొన్నారు.

కార్తీక్‌ను జన్మలో వదిలిపెట్టను అంటూ

కార్తీక్‌ను జన్మలో వదిలిపెట్టను అంటూ

ఇక కార్తీక్‌పై తన పిచ్చి ప్రేమను మోనిత మరోసారి బయటపెట్టింది. కార్తీక్ పట్టించుకోకున్నా.. నేను అతడినే ప్రేమిస్తూ ఉంటాను అంటూ ప్రియమణితో చెప్పింది. నీకు నీ కూర ఎంత ఇష్టమో.. నాకు కార్తీక్ అంత ఇష్టం. కార్తీక్‌ను ఈ జన్మలో వదిలే సమస్య లేదు అంటూ ప్రియమణితో చెప్పింది. అయితే నా కూరకు, నీ కార్తీక్‌కు ముడిపెట్టావా మోనిత అమ్మ అంటూ ప్రియమణి విస్తూ పోయింది.

ఆనందంలో ఇంటికి చేరిన దీప

ఆనందంలో ఇంటికి చేరిన దీప

ఇదిలా ఉండగా, బస్తీలో హాస్పిటల్, ఇళ్లు కట్టుకోవడానికి స్థలం చూసిన ఆనందంతో ఇంటికి తిరిగి వచ్చింది. ఇంటి స్థలం చూశాను. బస్తీవాసులు సంతోషంలో మునిగిపోయారు. మీరు నాకు ఇస్తున్న గొప్ప గిఫ్ట్ అదే. పది లక్షలు అడ్వాన్స్ అడిగారు. దాంతో మొత్తం ఇచ్చేస్తాం. మా డాక్టర్ బాబుకు ఓ లెక్కనా? వారం రోజుల్లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఇంటిపనులు ప్రారంభిద్దాం. వారం రోజులు అవసరం లేదు. మూడు రోజుల్లో కట్టేస్తాం అని చెప్పేశాను. అంటూ దీప తన ధోరణిలో తాను చెప్పుకొంటూ వెళ్తుంటే కార్తీక్, సౌందర్య, ఆనందరావు బాధలో మునిగిపోయారు.

 సారీ దీప అంటూ కార్తీక్ కంటతడి

సారీ దీప అంటూ కార్తీక్ కంటతడి

అయితే తాను సంతోషంగా ఉన్నా.. కార్తీక్, సౌందర్య, ఆనందరావు మాట్లాడకపోవడంతో దీప అనుమానంలో మునిగిపోయింది. ఎవరూ మాట్లాడటకపోవడంతో ఎందుకలా ఉన్నారు? అలా డల్‌గా ఉన్నారు. ఏం జరిగింది అంటూ దీప ప్రశ్నించింది. దాంతో దీప కళ్లలోకి కార్తీక్ చూస్తూ నిలుచుని ఉండిపోయాడు. దీపను గట్టిగా కౌగిలించుకొని నన్ను క్షమించు అంటూ కంటతడి పెట్టుకొన్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X