పాపి చిరాయువు.. కాపురాలు కూల్చే నీవు ఆడదానివేనా? డాక్టర్ మోనితకు దిమ్మతిరిగే షాక్
అత్యంత ప్రేక్షకాదరణ పొందుతున్న కార్తీక దీపం డైలీ సీరియల్‌లో డాక్టర్ కార్తీక్, దీప తండ్రి మధ్య భారీ వాగ్వాదం జరిగింది. తన కూతురిని అవమానించేలా చేస్తే ఇంటి నుంచి వెళ్లదా అంటూ డాక్టర్ బాబును నిలదీశారు. దీప ఇంటి నుంచి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోవడానికి నీ వ్యవహార తీరే కారణమని గట్టిగా మందలించారు. కార్తీక దీపం సీరియల్‌లో 1037 ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే..

భార్యకు గౌరవం ఇవ్వవా?
విజయనగరంలో ఉన్న దీపను తీసుకొచ్చి ఇంట్లో వస్తువుగా మార్చేశాడు. భార్యకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకపోగా ఆమెను తీవ్రంగా అవమానించడమే కాకుండా మనోవేదనకు గురిచేశావు. అందుకే ఎవరికీ చెప్పకుండా.. నా ఇంటికి రాకుండా తనదారి తాను చూసుకొన్నది. ఆత్మాభిమానం ఉన్న దీప చేసింది సరైనదే అంటూ దీప తండ్రి ఘాటుగా సమాధానం ఇచ్చారు.

దీపను తీసుకురావడం తప్పా?
అయితే విజయనగరంలో ఇడ్లీ బండి పెట్టి ఆరోగ్యం పాడు చేసుకొంటున్న దీపను తీసుకురావడం తప్పా? అని డాక్టర్ బాబు అంటే.. నీవు భార్యగా తీసుకువెళ్తున్నావని చెప్పావా? అంటూ దీప ప్రశ్నించాడు. కనీసం నీ తల్లికి కోడలిగా కూడా తీసుకువెళ్తున్నాని చెప్పావా? అంటూ వాగ్వాదానికి దిగాడు.

నాపై దాడి చేసే వాళ్లు మీరంతా
దీప తండ్రి ఇచ్చిన కౌంటర్‌కు డాక్టర్ బాబు సమాధానం ఇస్తూ.. ఒకవేళ దీపను అక్కడే ఉంచి పిల్లల్ని తీసుకెళ్తే అందరూ నాపై దాడి చేసే వాళ్లు. తల్లిని, పిల్లలను దూరం చేశాడని నాపై నిందలు వేసేవారు. నీ కూతురు ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని, ఎండలో పనిచేస్తే ఆరోగ్యం ఏమైపోతుందనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని నేను దీపను తీసుకొచ్చాను అని ఘాటుగా సమాధానం ఇచ్చారు.

నా కూతురిని అవమానించావు
కార్తీక్ బాబు కౌంటర్‌కు సమాధానంగా మా ఇంట్లో జరిగిన పూజకు నీవు కుటుంబ సమేతంగా వచ్చావా? నీకు నీవుగా వచ్చావా? దీపకు ఏవరైతే నచ్చరో వారిని నీవెంట తెచ్చుకొని నా కూతురిని అవమానించావు. నా కూతుర్ని ఇష్టాఇష్టాలను కనీసం పట్టించుకోలేదు అంటూ మండిపడ్డారు. ఇంతలోనే డాక్టర్ మోనిత అక్కడకు రావడంతో పాపి చిరాయువు అంటూ దీప తండ్రి సెటైర్ వేశారు.
Recommended Video

కాపురాలను కూల్చే నీవు ఆడదానివేనా?
డాక్టర్ మోనితపై దీప తండ్రి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. స్నేహితుడికి కష్టం వస్తే సహాయం చేస్తే పర్వాలేదు. కానీ సంసారాన్ని విచ్చిన్నం చేసే నీవు ఆడదానివేనా? అంటూ గట్టిగా మందలించారు. అయితే కాస్త గౌరవం ఇచ్చి మాట్లాడమంటే.. ఇలాంటి కోన్ కిస్కా.. అంటూ మధ్యలోనే దీప తండ్రి ఆగిపోయాడు. ఇలాంటి ఆడవాళ్లకు గౌరవం ఇవ్వకపోతే ప్రపంచం హర్షిస్తుంది అంటూ కామెంట్ విసిరాడు.


Click it and Unblock the Notifications











