నా బతుకును నాశనం చేస్తున్నావు.. శ్రీరాంనగర్ కాలనీలో హైడ్రామా.. డాక్టర్ బాబుపై వంటలక్క ఫైర్
తెలుగు టెలివిజన్ రంగంలో టాప్ రేటింగ్‌తో దూసుకెళ్తున్న కార్తీక దీపం సీరియల్‌లో రోజు రోజుకు పాత్రల మధ్య భావోద్వేగాలు ఉప్పొంగుతున్నాయి. భర్త కార్తీక్ ఆంక్షలు భరించలేని దీప ఇంటి నుంచి బయటకు వెళ్లడం అటు దీప అత్తారింటిలోను, తల్లివారి ఇంట్లోనూ గందరగోళం నెలకొన్నది. శ్రీరాంనగర్ బస్తీకి చేరిన దీపకు డాక్టర్ బాబు షాకిచ్చారు. కార్తీకదీపం సీరియల్‌లో 1038 జరిగిన కీలక మలుపులు ఏమిటంటే..

దీప అనారోగ్యాన్ని గోప్యంగా
దీపకు తీవ్ర అనారోగ్యం కలిగడం డాక్టర్ బాబు ఇంటిలో కంగారు మొదలైంది. పొగమంటకు గానీ, వంట వేడికి గానీ దగ్గరగా ఉంటే లేదా ఎండ వేడి తగిలితే ఆమెకు మరింత ప్రమాదం అని డాక్టర్ భారతీ చెప్పడంతో కార్తీక్ ఆమెను వంట పనులకు దూరంగా ఉంచాలని నిర్ణయించుకొన్నారు. అయితే అనారోగ్యం విషయం దీపకు చెప్పకుండా సీక్రెట్ ఉంచి వైద్యం చేయించాలని ప్లాన్ చేశారు. అయితే తనపై ఆంక్షలు పెట్టడంతో బాధకు గురైన దీప ఇంటి నుంచి ఎవరికి చెప్పకుండా బయటకు వెళ్లింది.

శ్రీరాంనగర్ కాలనీలో హైడ్రామా
శ్రీరాంనగర్ కాలనీలో ఉన్న దీప ఇంటికి వెళ్లిన కార్తీక్ ఆమెను ఇంటిలోకి తీసుకెళ్లి వంటలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. అయితే తన బతుకుతెరువును దెబ్బ తీస్తున్నావా అంటూ దీప ప్రశ్నించింది. అయితే నీవు వంట చేయడానికి వీలు లేదు. కావాలంటే నీకు నెలకు కొంత మొత్తం పంపిస్తాను అంటూ కార్తీక్ చెప్పాడు. అయితే నాకు భరణం అవసరం లేదంటూ ఖరాఖండీగా చెప్పారు.

నా బతుకుతెరువును నాశనం చేస్తున్నావా?
తన జీవనాధారం కోసం కుట్టు మిషన్‌ను ఆటో డ్రైవర్ వారణాసితో తెప్పించుకొన్నారు. అయితే కుట్టు మిషన్ కూడా ఉపయోగించవద్దు అంటూ కార్తీక్ వార్నింగ్ ఇచ్చారు. అలాగే వారణాసికి వార్నింగ్ ఇచ్చి కుట్టు మిషిన్‌ను కూడా పంపించి వేశారు. దాంతో నా బతుకు తెరువును ఇలా కూడా నాశనం చేస్తున్నావా అంటూ దీప ప్రశ్నించింది.

పిల్లల్ని, వంట మనిషిని రప్పించిన కార్తీక్
ఇక నుంచి ఇద్దరు పిల్లలు శౌర్య, హిమ కూడా దీప ఇంటిలోనే ఉంటారు అని కార్తీక్ చెప్పారు. వారికి సహాయంగా వంట మనిషిని కూడా రప్పించాడు. దీప ఇంటిలో చేయాల్సిన వంటలు, ఇతర పనులు, పిల్లలకు సహాయం అంతా పనిమనిషి చేస్తుందని చెప్పారు. ఇలా కార్తీక్ పెత్తనంను దీప సహించలేకపోయింది.
Recommended Video

తెరపైకి రాబోతున్న భారీ ట్విస్టు
ఇలా వాడివేడిగా కొనసాగుతున్న కార్తీక దీపం సీరియల్‌కు సంబంధించి రానున్న ఎపిసోడ్‌లో భారీ ట్విస్టు రాబోతున్నది. ఇప్పటికే దానికి సంబంధించిన టీజర్ సీరియల్‌లో ఆసక్తిని రేపుతున్నది. త్వరలోనే దీప బతుకదనే విషయాన్ని కార్తీక్ చెప్పడం ప్రేక్షకుల్లో మరింత ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేసింది.


Click it and Unblock the Notifications











