మోనిత ఇచ్చిన టాబ్లెట్ వల్లే నా ప్రాణాలకు హానీ.. డాక్టర్‌ బాబుకు షాకిచ్చిన వంటలక్క

అత్యంత ప్రేక్షకాదరణ పొందిన కార్తీకదీపం టెలివిజన్ సిరియల్‌కు సంబంధించిన తాజా ఎపిసోడ్‌లో ఎమోషనల్ అంశాలు కనిపించాయి. డాక్టర్ కార్తీక్, భార్య దీపకు మధ్య జరిగిన సంభాషణ మరింత భావోద్వేగంగా సాగింది. అయితే కార్తీక్, దీప మధ్య జరిగిన వాదన హై రేంజ్ ఎమోషన్స్ పలికించాయి. వారిద్దరి మధ్య జరిగిన వాదన ఏమిటంటే..

 దీప, కార్తీక మధ్య సంభాషణ

దీప, కార్తీక మధ్య సంభాషణ

తన ఇంటిలో జరిగిన శ్రీ సీతారాములు కల్యాణం పూజ సందర్భంగా డాక్టర్ మోనిత ఇచ్చిన ట్యాబ్లెట్‌ కారణంగా దీప సృహతప్పి పడిపోవడం, ఆ తర్వాత డాక్టర్ బాబు ఆమెను తీసుకెళ్లి చికిత్స చేయించడం లాంటి అంశాలు ఎమోషనల్‌గా సాగాయి. ఆ విషయంపై దీప, కార్తీక మధ్య సంభాషణగా సాధారణంగా మొదలై అసాధారణంగా మారింది.

 దీప నీకు అర్ధమవుతుందా?

దీప నీకు అర్ధమవుతుందా?

పూజ సమయంలో జరిగిన సంఘటన గురించి నీకు ఏమైనా అర్ధమైందా? అంటూ కార్తీక్ తన సంభాషణ ప్రారంభించగా.. అవును తెలుసు. మోనిత ఇచ్చిన ట్యాబ్లెట్ వల్లే నా ప్రాణానికి హానికరంగా మారింది. ఆ విషయం నాకు పూర్తిగా అర్ధమైంది అంటూ దీప ఘాటుగా స్పందించింది.

జాలిపడి సహాయం చేస్తే..

జాలిపడి సహాయం చేస్తే..

నీ ఆరోగ్యం సరిగా లేదని జాలిపడి ఎవరైనా సహాయం చేస్తే నీకు వారిని అనుమానించడం అలవాటుగా మారింది. సహయం అందించిన వారిని అనుమానించడం సరికాదు. మోనిత ఓ డాక్టర్. ఆమె ఇచ్చిన ట్యాబ్లెట్‌పై ఇలా అనుమానాలు వ్యక్తం చేయడం సరికాదు అంటూ డాక్టర్ బాబు గట్టిగా మందలించారు.

నన్ను చెంప దెబ్బ కొట్టి

నన్ను చెంప దెబ్బ కొట్టి

డాక్టర్ బాబు మందలింపుకు గట్టిగా సమాధానం చెబుతూ.. నా ఆరోగ్యంపై ఎవరూ జాలి పడాల్సిన అవసరం లేదు. జాలి పడి నాకు చికిత్స చేయించాలని నీవు ప్రయత్నిసే నేను ఒప్పుకోలేదు. కానీ నీవు నీ భర్తను అంటూ నన్ను చెంపపై కొట్టి టెస్టులు చేయించావు. నీవు కూడా డాక్టర్‌వే కాదా.. ఆ టాబ్లెట్ నీవే ఇవ్వొచ్చుగా అని దీప అన్నారు.

Recommended Video

Ormax 2020 : Premi Viswanath Bags A New Award For Karthika Deepam | Filmibeat Telugu
నిన్ను అనుమానించానా? అంటూ కార్తీక్

నిన్ను అనుమానించానా? అంటూ కార్తీక్

ఇలా కార్తీక్, దీప మధ్య సంభాషణ మరింత ఎమోషనల్‌గా మారింది. నాతో గొడవతో ఇంటి నుంచి బయటకు వెళ్లి 10 సంవత్సరాలు అయింది. మూడు ఊళ్లు తిరిగావు. కానీ ఒక్క రోజు కూడా నిన్ను అనుమానించలేదు. కానీ నన్ను అనుమానించడం నాకు నచ్చలేదు అని కార్తీక్ అంటే.. గత పదేళ్లలో నీవు నాకు దూరంగా ఉన్నా నేను ఏనాడు నిన్ను అనుమానించ లేదు అని దీప ఘాటుగా సమాధానం ఇచ్చింది. దాంతో అసలు విషయం మాని.. అనవసర విషయాలపై గొడవ పడుతున్నాం అని కార్తీక్ ఆ సంభాషణకు చెక్ పెట్టారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X