నా భార్య ఎంతోకాలం బతకదు.. బాంబు పేల్చిన డాక్టర్ బాబు.. భోరున విలపించిన సౌందర్య!
కార్తీకదీపం సీరియల్ 1028 ఎపిసోడ్‌లో డాక్టర్ కార్తీక్, ఆయన తల్లి సౌందర్య మధ్య భావోద్వేగాలు ఓ రేంజ్‌లో వ్యక్తమయ్యాయి. భార్య దీప అనారోగ్యం గురించి తల్లి నిలదీయడంతో అసలు విషయం బయటపెట్టాల్సి వచ్చింది. భార్య అనారోగ్యం గురించి వెల్లడిస్తూ కార్తీక్ కంటతడి పెట్టుకొన్నారు. ఈ క్రమంలో దీప జబ్బు గురించి తెలుసుకొన్న అత్త సౌందర్య రియాక్షన్ ఎలా ఉందంటే..

దీప వెనుక ఏం కుట్ర జరుగుతున్నది అంటూ సౌందర్య
దీప ఆరోగ్యం విషమంగా మారుతున్న క్రమంలో కార్తీక్ ఒంటరిగా మేడపై దిగులుగా ఉంటే తల్లి సౌందర్య వచ్చి అసలు విషయం చెప్పమని అడిగింది. ఇంట్లో ఏం జరుగుతున్నది? దీప వెనుక ఏం కుట్ర జరుగుతున్నది. దీపను ఇంటికి తీసుకొచ్చిన తర్వాత నీ వ్యవహారం మారిపోయింది. అంతకు ముందు నీవు ఒక్క విషయంలో దీపను తప్పుపట్టేవాడివి అంటూ సౌందర్య నిలదీసింది.

ఎందుకు అలా పీడిస్తున్నావో చెప్పు
విజయనగరం నుంచి దీపను తీసుకొచ్చిన తర్వాత ప్రతీ విషయంలోను తప్పుపడుతున్నావు. ఆ పని చేయవద్దు. ఈ పని చేయవద్దు? వంట చేయవద్దు? ఆ పని చేయవద్దు అంటూ ఆంక్షల మీద ఆంక్షలు పెడుతున్నావు. ఈ కారణం నిన్ను ఇలా రకరకాలుగా వేధిస్తున్నది. ఏ సమస్య నిన్ను ఇంతగా విచిత్రంగా పట్టి పీడిస్తున్నది అంటూ కార్తీక్‌ను సౌందర్య గద్దించి నిలదీసింది. అయినా కార్తీక్ మౌనంగా ఉండిపోయాడు.

నా మీద నీకు పంతమా?
అయితే నా మీద పంతం కోసమే ఇలా చేస్తున్నావా? దీపను నేను తీసుకురమ్మని చెప్పినందుకే ఇలా చేస్తున్నావా? ఇలా నీ కసి తీర్చుకొంటున్నావా? దీప ఇంట్లో జరిగే పూజకు మోనితను, డాక్టర్ భారతీని ఎందుకు తీసుకొచ్చావు. ఇలా ఒకదానికి మరొకటి పొంతన లేకుండా ఎందుకు ఇలా చేస్తున్నావు? ఇంతకాలం తల్లి లేదని ఓ బిడ్డ.. తండ్రి ఓ బిడ్డ బాధపడుతూ బతికారు. అందరూ కలిసిన తర్వాత ఇద్దరికి తల్లి లేకుండా పోతుంది అంటూ తల్లి సౌందర్య ఆవేదన వ్యక్తం చేశారు.

దీప ఎంతోకాలం బతకదు అంటూ
తల్లి సౌందర్య ప్రశ్నలకు మౌనంగా ఉన్న కార్తీక్‌ను రెట్టించి ప్రశ్నించింది. ఇలా చేయడానికి కారణం ఏమిటో చెప్పాల్సిందే. నీ భార్య కాకుండా నా కోడలిగా తీసుకొచ్చిన దీపను నీవు ఎందుకు హింసిస్తున్నావు అంటూ కార్తీక్ కాలర్ పట్టుకొని నిలదీసింది. దాంతో ఆవేదనను తట్టుకోలేని కార్తీక్ అసలు విషయం బయటపెట్టారు. దీప ఎక్కువ కాలం బతకదని డాక్టర్లు చెప్పారు. నేను నిజంగా వదిలేస్తే చచ్చిపోతుంది అంటూ బాంబు పేల్చడంతో తల్లి సౌందర్య తీవ్ర దిగ్బ్రాంతికి గురైంది.

ఒరేయ్ స్టుపిడ్.. నా కోడలు బతకదా?
దీప ఇలాంటి తీవ్ర పరిస్థితుల్లో ఉందని తెలిస్తే నీవు తట్టుకోలేవని నిజాన్ని నాలోనే దాచుకొన్నాను అంటూ కార్తీక కంటతడి పెట్టాడు. దాంతో ఒరేయ్ స్టుపిడ్ అంటూ గట్టిగా సౌందర్య అరిచింది. నీవు చెప్పేదంతా అబద్దమని చెప్పు. అది చచ్చిపోవడం ఏంటిరా? ఏ డాక్టర్ చెప్పింది అంటూ నిలదీసింది. దాంతో నేను కూడా డాక్టర్‌నే.. నేనే నిజం చెబుతున్నాను అంటూ సమాధానం ఇచ్చాడు. నీకు నచ్చకపోతే ఇంటి నుంచి బయటకు పంపించు. కానీ నా కోడలు దీప చచ్చిపోతుందని ఎలా చెబుతావురా స్టుపిడ్ అంటూ సౌందర్య భోరున విలపించింది.

మొత్తం ట్రీట్‌మెంట్‌పైనే ఉండాలి
దీప ఆరోగ్యం విషయం ఎప్పటికైనా నీకు తెలియాల్సిందే. ఈ విషయాన్ని దాచలేక, నిజం చెప్పలేక నాలో నేను కుమిలిపోయాను. దాంతో ఇంతకు దీపకు ఏమైంది అంటూ అడిగితే.. ఈ పేషెంట్ బతకదు.. మొత్తం ట్రీట్‌మెంట్ పైనే ఉండాలి. ఈ మందులు వాడకపోతే అసలే బతకదు. వంట అసలే చేయకూడదు అంటూ కార్తీక్ చెప్పారు.
Recommended Video

నా కోడలికి ఇలాంటి శిక్షనా?
ఇప్పుడైనా దీపను ఎందుకు కట్టడి చేస్తున్నానో తెలుసా? నీ ఇద్దరు పిల్లలు చిన్నవాళ్లు. వాళ్లక తల్లి కావాలి. జీవితంలో ఎన్నడూ సు:ఖం పొందలేని నా కోడలికి ఇలాంటి శిక్ష. ఏం చేస్తే బతుకుతుందో చెప్పు అని సౌందర్య అంటే.. ఆరోగ్యం ఆమె చేయిదాటినా.. డాక్టర్ల చేతి నుంచి జారిపోలేదు. సరైన జాగ్రత్తలు తీసుకొంటే బతుకుతుంది అంటూ కార్తీక్ చెప్పగా.. బతికే అవకాశం ఉందంటే ఎలాగైనా బతికించుకొందాం అంటూ ఇద్దరు భావోద్వేగానిక గురయ్యారు.


Click it and Unblock the Notifications











