పిచ్చి దాన్ని చేయాలని చేస్తున్నారా? మోనిత, కార్తీక్‌పై దీపకు అలాంటి అనుమానం
అత్యంత ప్రేక్షకాదరణ పొందిన కార్తీకదీపం సీరియల్‌లో 1029 ఏపిసోడ్‌లో రకరకాల ఎమోషన్స్, గొడవలు కనిపించాయి. సీతారామ కళ్యాణం పూజ తర్వాత దీప మనసులో ఎన్నో ఆలోచనలు మొదలయ్యాయి. మరోవైపు దీప ఆరోగ్యంపై కార్తీక్ ఆందోళన మరింత ఎక్కువైపోతుంది. దీప ఆరోగ్యం పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందనే విషయం తెలిసిన తర్వాత అత్త సౌందర్య ఎమోషనల్ గురయ్యారు. ఈ క్రమంలో ఇంట్లో, తన వెనుక జరుగుతున్న వ్యవహారాలపై దీప ఆలోచనల పడింది. దీప ఆలోచనలు ఎలా ఉన్నాయంటే..
Recommended Video

దీప మనసులో ఎన్నో ఆలోచనలు
కార్తీక్‌తో హాట్ హాట్ డిస్కషన్ జరిగిన తర్వాత తన బెడ్‌రూంలో ఒంటరిగా ఆలోచించడం మొదలుపెట్టింది. గత రెండు రోజులుగా జరిగిన విషయాలను మననం చేసుకొన్నది. పూజకు రానని చెప్పిన కార్తీక్ సడెన్‌గా ఎందుకు రావాలని అనుకొన్నాడు. తాను రావడమే కాకుండా డాక్టర్ మోనిత, డాక్టర్ భారతీని పూజకు ఎందుకు తీసుకొచ్చారు అని ఆలోచించడం మొదలుపెట్టింది.

కుట్రలు చేస్తున్నారా? అంటూ
తనకు ట్యాబ్లెట్ ఇచ్చే పనినిని మోనితకు ఎందుకు అప్పగించారు. ఒకవేళ తనకేమైనా అయితే మోనితను పెళ్లి చేసుకొని డైరెక్టుగా ఇంటికి తీసుకురావాలని అనుకొంటున్నాడా? మోనిత తన వెనుక కుట్రలు చేస్తున్నారా అంటూ అనేక అనుమానాలు దీప వ్యక్తం చేసింది.

ట్యాబ్లెట్ వేసుకోగానే పడిపోవడమేంటి?
నన్ను రోగిష్టి చేయాలనా? ప్రయత్నిస్తున్నారా? లేక నన్ను పిచ్చి దాన్ని చేయాలని చేస్తున్నారా? ట్యాబ్లెట్ వేసుకొంటే కళ్లు తిరిగిపోవడం పడిపోవడం ఏమిటి? నన్ను ఏమైనా చేయాలని కుట్రలు చేస్తున్నారా? అంటూ దీప ఆలోచనల్లో దీప పడింది. రకరకాల ఆలోచనలు ఆమెను అసహనానికి గురిచేశాయి.

గందరగోళ పరిస్థితులపై దీప
మోనిత, కార్తీక వ్యవహారంపై అనేక అనుమానాలు వ్యక్తం చేసిన దీప గట్టి నిర్ణయం తీసుకొన్నది. ఇక నుంచి నేనేంటో చూపిస్తాను. నేను ఎంత మొండిగా ఉంటాననే విషయాన్ని చూపిస్తా. వంట నేనే చేస్తాను అంటూ మనసులో బలంగా అనుకొన్నది. తన కళ్ల ముందు గందరగోళంగా మారిన పరిస్థితులను చూసి దీప తట్టుకోలేక ఇలాంటి నిర్ణయం తీసుకొన్నది.

కార్తీక్‌కు షాకిచ్చిన దీప
ఇక మనసులో అనుకొన్న తడువుగా.. దీప వంటలక్కగా మారింది. కిచెన్‌లోకి దూరి ఉదయమే టిఫిన్ చేసేందుకు సిద్దమైంది. వంటగదిలో ఉన్న దీపను చూసి కార్తీక్ అసహనం పెరిగిపోయింది. వంట చేయకూడదనే నేను మిమల్ని విజయనగరం నుంచి తీసుకొచ్చాను. వేడి వద్ద ఉండకూడదనే విజయనగరంలో దోశెలు నేనే వేశాను. ఇక కూడా ఆమె వంట చేస్తే ఇంట్లో ఉండనక్కర్లేదు అని తన పిల్లలతో కార్తీక్ అంటే.. అమ్మతోపాటు మమల్ని కూడా ఇంటి నుంచి పంపిస్తావా అని పిల్లలు ప్రాధేయపడ్డారు.


Click it and Unblock the Notifications











