నా కోడల్ని బతికించు.. ఇద్దరు పిల్లల్ని తల్లికి దూరం చేయకు.. సౌందర్య కన్నీరుమున్నీరు

కార్తీక దీపం సీరియల్‌లో దీప అనారోగ్యం అందరిలోనూ ఓ రకమైన భయాన్ని కలుగజేస్తున్నది. చావు బతుకులతో పోరాటం చేసే దీప పరిస్థితిని తన తల్లికి సౌందర్యకు వెల్లడించిన తర్వాత వారిద్దరిలోనూ భావోద్వేగం కనిపిస్తున్నది. తల్లి, కోడుకుల మధ్య ఎమోషనల్ బంధం మరింత పెరిగి ప్రేక్షకులను ఆకట్టుకొంటున్నది. సోమవారం నాటి 1029 ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే..

Recommended Video

Karthika Deepam Vantalakka Live Video || కార్తీక దీపం సీరియల్‌ నుంచి తప్పుకోవడం పై దీప క్లారిటీ !

సానియా ఇయప్పన్.. బీచ్ అందాలతో బికినీ బ్యూటీ

 దేవుడిపై భారం వేసిన అత్త

దేవుడిపై భారం వేసిన అత్త

కోడలు దీప ఆరోగ్యం క్షీణించడంపై అత్త సౌందర్యలో ఆందోళన రోజు రోజుకు పెరిగిపోతున్నది. ఇక దేవుడిపై భారం వేసిన సౌందర్య.. భగవంతుడిని ముందు దీపం వెలిగించింది. తన కోడలు కాపాడే బాధ్యత నీదే అంటూ రెండు చేతులు ఎత్తి ప్రాధేయపడింది. నీ ముందు దీపాన్ని వెలిగించాను. మనిషిలోని దీపాన్ని వెలిగించే బాధ్యత నీదే అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

 అరచేతులు అడ్డుపెట్టినా...

అరచేతులు అడ్డుపెట్టినా...

నా ఇంటి దీపం నా కోడలు దీప. ఆ దీపం ఇప్పుడు రెపరెపలాడుతున్నది. అరచేతులు అడ్డుపెట్టినా లాభం లేదనే భయం వెంటాడుతున్నది. దీప కార్తీక దీపంలా వెలగాలి. దీప మాములు మనిషిలా మారాలి. ఇంట్లో డాక్టర్ ఉన్నాడు. చేతినిండా డబ్బు ఉంది. ఖరీదైన వైద్య చేయించడానికి స్థోమత ఉంది అంటూ దేవుడి పటాల ముందు సౌందర్య కన్నీరుమున్నీరయ్యారు.

 కంటతడి పెట్టిన అత్త సౌందర్య

కంటతడి పెట్టిన అత్త సౌందర్య

దీప ఆరోగ్యానికి కావాల్సింది నీ కృప. అన్నింటికంటే అతీతమైనది నీ ఆశీర్వాదం. నా కోడలు జీవితానికి అది కావాలి. నా కోడల్ని బతికించు. నా మనవరాళ్లకు తల్లిని దూరం చేయకు అంటూ సౌందర్య కంటతడి పెట్టింది. ఇలా దీప ఆరోగ్యం కుదటపడాలని కార్తీక్, సౌందర్య రకరకాలు ప్రయత్నిస్తూ ఆవేదన చెందుతున్నారు.

చెప్పినా వినని వంటలక్క

చెప్పినా వినని వంటలక్క

అయితే కార్తీక్, మోనిత వ్యవహారంపై అసహనంతో దీప తన పంతాన్ని నెగ్గించుకోవడానికి వంటగదిలోకి దూరింది. ఎందుకు వంటగదిలోకి వచ్చారని అడిగితే.. డాడీ వద్దని చెప్పితే ఊరుకొంటానా? అని దీప అంటే... నీవు వంట చేస్తే డాడీ ఎందుకు కోపగించుకొంటాడని కూతురు అడిగితే.. పడుతున్నాను కదా.. ఎవరైనా పడుతుంటే.. ఎవరైనా, ఎవరినైనా అంటూనే ఉంటారు అని దీప సమాధానం ఇచ్చింది.

భావోద్వేగంలో కార్తీక, సౌందర్య

భావోద్వేగంలో కార్తీక, సౌందర్య

వంట చేస్తే దీప ఆరోగ్యం క్షీణిస్తుందని డాక్టర్లు చెప్పడంతో కార్తీక్‌కు తన భార్య ఆరోగ్యంపై చింత పెరిగిపోతున్నది. అలాగే కోడలు అనారోగ్యం గురించి తెలిసినప్పటి నుంచి సౌందర్యలో కూడా అదే ఆందోళన పెరిగిపోతున్నది. కానీ దీప పంతం పెరిగిపోవడం వారిద్దరికి మరింత బాధ కలుగుతున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X