వంటలక్క ఖల్లాస్.. పైలోకానికి దీప.. అక్కడే చస్తుందంటూ అంటూ.. మోనిత పైశాచికి ఆనందం
కార్తీకదీపం సీరియల్‌లోని 1030వ ఎపిసోడ్‌లో ఎప్పటిలానే ప్రతీ ఒక్కరిలోను ఎమోషన్స్ ఉప్పొంగాయి. తన కూతురు దీప పరిస్థితిపై తండ్రి మదన పడిపోతూ కనిపించాడు. అలాగే దీపతో వంట ఎలా మానిపించాలనే ఆలోచనలో డాక్టర్ కార్తీక్, అత్త సౌందర్య పడిపోయారు. వేడికి, ఎండకు దూరంగా ఉంటేనే దీప బతుకుతుందని కార్తీక్ చెప్పిన విషయాలు కొందరిలో ఆవేదనకు గురిచేస్తే.. మోనితకు ఎనలేని సంతోషాన్ని కలిగించాయి. ఆ వివరాల్లోకి వెళితే...

వంట చేస్తేనే మందులు వేసుకొంటా
నా చేత వంట చేయిస్తేనే నేను మందులు వేసుకొంటాను అని దీప బెట్టు చేయడంతో కార్తీక్, సౌందర్యకు ఏం చేయాలో అర్థం కాలేదు. వంట పనులన్నీ తానే చేయడానికి కావాల్సిన వస్తువులను వంట మనిషికి తప్పించుకొనే ప్రయత్నం చేయడంతో అసహనంతో కార్తీక్, సౌందర్య ఊగిపోయారు.

కార్తీక్ ఫోన్ చేసి దీప గురించి
మోనితకు కార్తీక్ ఫోన్ చేసి.. వంట చేస్తానని దీప బెట్టు చేస్తుందని మోనితకు కార్తీక్ చెప్పడంతో ఆమె షాక్ గురైనట్టు యాక్టింగ్ చేసింది. అయ్యోయ్యె అలా అయితే ఎలా? జాగ్రత్తగా చూసుకో.. నీవు జాగ్రత్తగా ఉండు అంటూ ఫోన్‌లో మాట్లాడుతూ షాక్ తిన్నట్టు నటించింది. ఫోన్ పెట్టగానే దీప పట్టింపులు ఆమె ఎనలేని సంతోషాన్ని కలిగించాయి.

దీపకు వంటలక్క బుద్ది పోదు..
కార్తీక్ చెప్పిన విషయాలు ఆనందం కలిగించడంతో తనకు తానే మాట్లాడుకొంటూ సంతోషపడింది. ఆ దీప కోటీశ్వరుల ఇంటిలో ఉన్నా వంటలక్క బుద్ది పోదు. పొద్దున లేనప్పటి నుంచి రాత్రి పడుకొనే దాక వంటగదిలోనే చస్తుంది. అలా వారం వంటగదిలో ఉంటే పైకి వెళ్లడం ఖాయం. ఖల్లాస్.. దీప ఖల్లాస్ అంటూ విపరీతంగా మోనిత నవ్వుల్లో మునిగిపోయింది.

పైలోకంలో వెకెన్సీ.. దీప ఇక అక్కడికి
మోనిత తనలోనే తాను పిచ్చిగా నవ్వకుంటుంటే పనిమనిషి చూసి ఏమిటమ్మా ఇలా నవ్వుతున్నావు అని అడిగితే.. పైలోకంలో ఒక వేకెన్సీ ఉందంటా.. కింది నుంచి పైకి ఒకరిని పంపించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటూ మళ్లీ నవ్వుల్లో మునిగిపోయింది. ఆమె వ్యవహారాన్ని చూసి త్వరలోనే పిచ్చాసుపత్రికి వెళ్లడం ఖాయం అంటూ పనిమనిషి ప్రియమణి అక్కడి నుంచి వెళ్లిపోయింది.
Recommended Video

దీప మొండితనంపై సౌందర్య ఆలోచనలు
ఇదిలా ఉండగా, దీప మొండి పట్టుదల ఎలా వదులుతుంది. నిజం చెప్పకుండా దానిని మాయ చేసి మభ్యపుచ్చి ఎంత కాలం మేనేజ్ చేస్తుంది. ఆమెతో వంట ఎలా మానిపించాలి. రెస్టు తీసుకునేలా ఎలా చేయాలి అని అత్త సౌందర్య ఆలోచనలో పడింది.


Click it and Unblock the Notifications











