మోనిత మెడకు చుట్టుకొంటున్న కుట్ర.. డాక్టరమ్మకు షాకిచ్చిన వంటమనిషి!

కార్తీకదీపం సీరియల్‌లో దీపను ఎలాగోలా ఆనారోగ్యంతో చంపేసి.. కార్తీక్‌ను దక్కించుకోవాలనుకొంటున్న డాక్టర్ మోనిత ఆశలకు రెక్కలొచ్చేలా కనిపిస్తున్నాయి. ఊహాల్లో తేలిపోతూ.. ఏదో ఏదో కోరుకొంటున్నది. అయితే తన ఊహలన్నింటిని వంటమనిషి ప్రియమణికి చెప్పగా ఆమె గట్టిగా సెటైర్లు వేస్తూ ఆశలపై నీళ్లు చల్లింది. వారిద్దరి మధ్య ఆసక్తికరమైన సంభాషణ ఎలా సాగిందంటే..

అందానికి మరో అర్దాన్ని చెబుతున్న హీనా పంచల్

 పుట్టబోయే బిడ్డకు పేరు అంటూ

పుట్టబోయే బిడ్డకు పేరు అంటూ

డాక్టర్ మోనిత నోట్ బుక్‌లో ఏదో రాసుకొంటూ కనిపించగా.. పనిమనిషి ప్రియమణి పలకరించింది. ఏ రాసుకొంటున్నావు అని అడిగితే... పుట్టబోయే బిడ్డ పేరు రాసుకొంటున్నాను. నేను రేపు కార్తీక్‌ను పెళ్లి చేసుకొంటే పుట్టబోయే బిడ్డకు ఏం పేరు పడితే బాగుంటుందని రాసుకొంటున్నాను అని డాక్టర్ మోనిత అంటే.. ఆలు లేదు చూలు లేదు.. పుట్టబోయే బిడ్డకు పేర్లు రాస్తున్నావా అంటూ వంట మనిషి ఎద్దేవా చేసింది.

మోనిత మనుసులో అలాంటి అనుమానం

మోనిత మనుసులో అలాంటి అనుమానం

అంతలోనే కార్తీక్‌కు జీవితంలో పిల్లలు పుట్టరని నేను చెప్పాను కదా.. మరి ఇప్పుడు పిల్లలు పుడుతారని ఎలా నమ్ముతాడు అనే అనుమానం కలిగింది. నేను ఆడిన అబద్దం నా మెడకే చుట్టుకుంటుందా అంటూ షాక్‌కు గురైంది. అంతలోనే మరో అబద్దం చెప్పి నమ్మించాలి అంటూ తనను తాను సర్ది చెప్పుకొన్నది.

పెళ్లి చేసుకొని ఎవరు సుఖ: పడ్డారని..

పెళ్లి చేసుకొని ఎవరు సుఖ: పడ్డారని..

అంతలోనే ప్రియమణితో మోనిత మాట్లాడుతూ.. నీకు పెళ్లి జరిగితే .. పుట్టబోయే బిడ్డల గురించి ఇలానే రాసుకొంటావా అని మోనిత అడిగింది.. అయితే పెళ్లి చేసుకొని ఎవరు సుఖ పడ్డారో చెప్పండి అని ప్రియమణి జవాబిస్తే.. నీవు, కార్తీక్, దీపను చూసి అలా అభిప్రాయాన్ని ఏర్పరుచుకొని ఉంటావని అనుకొంటా అని మోనిత చెప్పింది.

 కార్తీక్‌ను సంతోషంలో ఉంచుతా

కార్తీక్‌ను సంతోషంలో ఉంచుతా

తాగుబోతులు, శాడిస్టులను పెళ్లి చేసుకొంటే సమస్యలు ఉంటాయేమో కానీ, సాధారణంగా సర్దుకుపోయే వ్యక్తులను పెళ్లి చేసుకొంటే జీవితం చాలా హ్యాపీగా ఉంటుంది. నేను కార్తీక్‌ను పెళ్లి చేసుకొంటే నేను ఎంత సంతోషంగా ఉంటానో.. అంతకంటే ఎక్కువగా కార్తీక్‌ను సంతోషంగా ఉంచుతాను. ఇతరులు చూసి జెలసీగా ఫీలయ్యేలా, మమల్ని చూసి స్పూర్తి పొందే దంపతులుగా ఉంటాం అని మోనిత ఊహల్లో తేలిపోయింది.

Recommended Video

Drishyam 2 Remake Runs Into Trouble || Filmibeat Telugu
మోనితకు ప్రియమణి పంచ్

మోనితకు ప్రియమణి పంచ్

అయితే మోనిత చెప్పిన మాటలు విన్న ప్రియమణి గట్టి సెటైర్ వేసింది. నిన్ను చూస్తే పెళ్లి చేసుకొన్న వాళ్లు ఉన్నవాళ్లను వదిలేసి.. మరొకరిని చేసుకొందామని అనుకొంటారు అని ప్రియమణి అన్నారు. నీకు ఏం తెలుసే.. నా ప్రేమకు పదహారు ఏళ్లు వచ్చాయి అని మోనిత అంటే.. ప్రియమణి మరోసారి పంచ్ వేసింది. నీ ప్రేమకు పైట వేసుకొనే వయస్సు వచ్చింది కానీ నీకు మాత్రం పెళ్లి చేసుకొనే రాత మాత్రం రాలేదంటూ గట్టిగా సమాధానం ఇచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X