ఎక్కడికి వెళ్లను.. ఇక్కడే చస్తా.. పిల్లలు ఏడుస్తారనే కదా.. అత్త సౌందర్యకు వంటలక్క షాక్

కార్తీకదీపం సీరియల్‌లో గురువారం ప్రసారమైన 1032 ఎపిసోడ్‌లో దీప అలియాస్ వంటలక్క, అత్త సౌందర్య మధ్య భావోద్వేగమైన సన్నివేశాలు చోటుచేసుకొన్నాయి. దీప ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తూ వంటగదికి దూరంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తుంటూ.. అది తెలియని దీప అత్త, భర్త కార్తీక్‌ను అపార్థం చేసుకొంటున్నది. ఈ క్రమంలో వారిద్దరి మధ్య సంభాషణ ఎలా జరిగిందో మీరే చూడండి..

బికినీలో రాయ్ లక్ష్మీ.. బీచ్‌లో బర్త్ డే బేబీ హల్‌చల్.. రత్తాలు రేర్ ఫోటోలు

దీప అపార్థం చేసుకోకు..

దీప అపార్థం చేసుకోకు..

వంట చేయడంపై దీప, కార్తీక్ మధ్య జరిగిన గొడవ తర్వాత అత్త సౌందర్య వంటలక్కను సర్దిచెప్పే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో దీప మాట్లాడుతూ.. భార్యగా పనికిరాను. కనీసం వంట చేయడానికి వంటలక్కగా కూడా పనికి రానా అంటూ దీప ప్రశ్నించింది. పదేళ్లుగా నిన్ను వాడు అపార్థం చేసుకొన్నాడు. ఇప్పుడు వాడిని నీవు అపార్థం చేసుకొంటున్నావు. మధ్యలో నాకు ఎందుకు ఈ గొడవ. ఎందుకీ నరకం అంటూ దీప ప్రశ్నించింది. అతను రెస్ట్ తీసుకోమనడం తప్పా? అని సౌందర్య ప్రశ్నించింది.

రెస్ట్ పేరుతో గెస్ట్ రూమ్‌లో

రెస్ట్ పేరుతో గెస్ట్ రూమ్‌లో

సౌందర్య మాటలకు దీప సమాధానం చెబుతూ.. డాక్టర్ బాబును నేను అపార్థం చేసుకొంటున్నానా? పిల్లలకు నేను కావాలని నన్ను తీసుకొచ్చినట్టు ఉన్నారు. రెస్ట్ కాదు. గెస్ట్‌గా ఉండమని చెబుతున్నాడు. రెస్ట్ పేరుతో గెస్ట్ రూమ్‌లో పడి ఉంటమంటున్నాడు. నేనంటే గిట్టదు. నా చేతి వంట అంటే అంతకంటే గిట్టదు. పిల్లలు తల్లి లేకపోతే ఏడుస్తారు. నన్ను తీసుకు రాకపోతే పిల్లల దృష్టిలో చెడ్డవాళ్లు అవుతారని తీసుకొచ్చారా అంటూ ప్రశ్నించింది.

దీప నీ చావు మాటలు ఆపు..

దీప నీ చావు మాటలు ఆపు..

దీప ఇక ఆపు.. నీ మాటలు వినలేకపోతున్నాను. పదేళ్ల నుంచి నన్ను ఏదో ఒకటి అంటుంటే వింటున్నారు కదా.. ఇప్పుడు నేను అంటుంటే వినలేకపోతున్నారా? అంతేలే నీ కొడుకు కదా.. అంటూ అత్త సౌందర్యకు ఘాటుగా జవాబిచ్చింది.

దీప ప్రతీది నెగెటివ్‌గా ఆలోచించకు

దీప ప్రతీది నెగెటివ్‌గా ఆలోచించకు

దీప మాటలకు అడ్డు పడుతూ.. నీకు ప్రతీది నెగెటివ్‌గానే కనిపిస్తున్నది. కొంచెం ప్రశాంతంగా ఆలోచించవే. అందరం నీ మంచి కోరేవాళ్లమే. తొందరపడి అందర్ని అపార్థం చేసుకోకు. ఎలాంటి పిచ్చి నిర్ణయాలు తీసుకోకు. భయపడకు అత్తయ్య.. నేను ఎక్కడికి వెళ్లను. ఇది నా ఇల్లు. నేను చచ్చే వరకు ఈ ఇంటిలోనే ఉంటాను అంటూ దీప ఆవేదన వ్యక్తం చేసింది.

Recommended Video

Ormax 2020 : Premi Viswanath Bags A New Award For Karthika Deepam | Filmibeat Telugu
 నేను ఎక్కడికి వెళ్లను ఇక్కడే చస్తా..

నేను ఎక్కడికి వెళ్లను ఇక్కడే చస్తా..

దీప నోటి నుంచి చావు అనే మాట వినేసరికి అత్త సౌందర్య తట్టుకోలేకపోయింది. ఇంకోసారి చావు మాట నీ నోటి నుంచి వినలేను అంటూ ప్రాధేయపడింది. దాంతో నన్ను బయటకు పంపిచడానికి ఇలాంటి పనులు చేస్తున్నట్టు ఉన్నారు. కానీ నేను ఎక్కడికి వెళ్లను. ఇక్కడే చస్తా అంటూ దీప స్పష్టం చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X