దీప బతుకుందా? చనిపోతుందా? వంటలక్క చావుపై మోనిత కుట్రలు మరోసారి బట్టబయలు

అత్యంత ప్రేక్షకాదరణ పొందుతున్న కార్తీకదీపం సీరియల్‌లో కార్తీక్, దీప మధ్య గొడవలు పెరుగుతున్న క్రమంలో మోనితకు మరింత ఆసక్తి పెరిగింది. దీప బతకపోతే కార్తీక్‌ను పెళ్లి చేసుకోవాలనే ఆశ రోజు రోజుకు పెరిగిపోతున్నది. ఈ క్రమంలో దీప ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవడానికి మోనిత తెగ ఆరాటపడిపోతున్నది. ఈ క్రమంలో దీప ఆరోగ్యాన్ని చూస్తున్న డాక్టర్ భారతీని మోనిత ఇంటికి డిన్నర్‌కు పిలిచింది. ఈ నేపథ్యంలో డాక్టర్ భారతీ, డాక్టర్ మోనిత మధ్య జరిగిన సంభాషణ ఇలా సాగింది...

హద్దులు దాటేస్తున్న మహేశ్వరీ.. యువ హీరోయిన్ రేర్ ఫోటోలు...

డాక్టర్ భారతీని డిన్నర్‌కు ఆహ్వానించిన మోనిత

డాక్టర్ భారతీని డిన్నర్‌కు ఆహ్వానించిన మోనిత

డిన్నర్‌కు ఆహ్వానించడంతో మోనిత ఇంటికి వచ్చిన డాక్టర్ భారతీ.. ఆతిథ్యానికి కారణమైన అసలు పాయింట్ ఏమిటి? ఏ మాట్లాడాలనుకొన్నావు అంటూ అడిగింది. దాంతో దీప వల్ల కార్తీక్ పడే బాధను చూడలేకపోతున్నాను. దీప హెల్త్ కండీషన్ బాగా లేదా అంటూ మోనిత ప్రశ్నించింది. దాంతో అవును దీప కండిషన్ బాగాలేదనే విషయం నీకు అర్థం కాలేదా అంటూ డాక్టర్ భారతీ సమాధానం చెప్పింది. మందులు వాడితే.. సర్జరీ చేస్తే దీప హెల్త్ బాగుపడుతుందా అని మళ్లీ ప్రశ్నిస్తే.. ఆ విషయం ఆ ఇద్దరికి సంబంధించిన విషయం.. డాక్టర్ కార్తీక్ అంతా చెప్పాను, నీతో దీప హెల్త్ విషయం చెప్పడం సరికాదు అంటూ ముక్తసరిగా జవాబిచ్చింది.

కార్తీక్ గురించే నా బాధ అంత అంటూ

కార్తీక్ గురించే నా బాధ అంత అంటూ

దీప ఆరోగ్యంపై కార్తీక్ బెంగ పెట్టుకొంటున్నాడు. ఇప్పటి వరకు ఇక్కడే ఉండి నాతో తన బాధను పంచుకొన్నాడు. ఆమె మొండితనాన్ని సహించలేకపోతున్నాడు. మధ్యలో బాగా నలిగిపోతున్నాడు అని మోనిత అంటే.. భార్య కాబట్టి ఇలాంటివి భరించాలి అని డాక్టర్ భారతి సమాధానం ఇచ్చింది. అందుకు సమాధానంగా.. ఏదో ఇంటర్ పాసైన దానిని పెళ్లి చేసుకొన్నాడు. ఆమెకు వంటగదిలో మంట దగ్గర ఉండటం, వేడిలో మగ్గిపోవడం వ్యసనం అంటూ మోనిత ఆక్రోషాన్ని వెళ్లగక్కింది. దాంతో మోనిత తీరుకు కొంత ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది.

ఆ రోజు ట్యాబ్లెట్లు ఇస్తే...

ఆ రోజు ట్యాబ్లెట్లు ఇస్తే...

భారతీ అనుమానంగా చూసినా.. మోనిత తన ఆక్రోషాన్ని వెల్లగక్కుతూనే.. కార్తీక్ ఎంత చెప్పినా.. వినకుండా దీప అపార్థం చేసుకొంటుంది. శ్రీరామ నవమి రోజున నేను ట్యాబ్లెట్స్ ఇస్తే.. ఎంత పంతంతో విసిరికొట్టిందో తెలుసుగా.. మనం దీప పరిస్థితి తెలిసే కదా అక్కడికి వెళ్లాం. నిజం తెలియనంత కాలం నీవు, నేను దీపకు అర్థం కాలేం అంటూ మోనిత ప్రసంగం ఇవ్వడంతో తన తీరును చూసి డాక్టర్ భారతీ చిన్నగా నవ్వింది.

 నేను ప్రేమించిన తర్వాతే దీపతో పెళ్లి

నేను ప్రేమించిన తర్వాతే దీపతో పెళ్లి

మోనితను చూస్తూ భారతీ అలానే నవ్వుతూ ఉంటే.. ఏమిటి అలా నవ్వుతున్నావు అని అడిగింది. అయితే ప్రకృతి చెప్పింది నిజమేనన్నమాట అంటూ భారతీ నవ్వుల్లో మునిగిపోయింది. దాంతో అవును నేను కార్తీక్‌ను ప్రేమించానని చెప్పి ఉంటుందా? అంటే .. నీవు అంతగా ఆలోచిస్తుంటే నవ్వు రాదా? అయినా పెళ్లి జరిగిన వాడిని ఎందుకు ప్రేమించాలి.. అది తప్పు కదా అంటూ భారతీ ప్రశ్నించింది. దాంతో నేను ప్రేమించిన తర్వాతే ఆయనకు పెళ్లి జరిగింది అంటూ మోనిత నిష్టూరంగా మాట్లాడింది.

Recommended Video

Ormax 2020 : Premi Viswanath Bags A New Award For Karthika Deepam | Filmibeat Telugu
దీప బతకడానికి అవకాశం ఉందా?

దీప బతకడానికి అవకాశం ఉందా?

మళ్లీ ఆ టాపిక్‌ను కొనసాగిస్తూ.. నా సంగతి వదిలేయ్.. దీప సంగతి చెప్పు. ఆమె పోతే నేను ఆ ప్లేస్‌ను భర్తీ చేసుకోవాలన్న ఆశతో అడగడం లేదు. కార్తీక్ అంత బాధపడుతున్నాడంటే.. దీప బతకడానికి అవకాశం ఉందా? అని మోనిత అడిగితే... దీప పరిస్థితి చాలా సీరియస్‌గా ఉంది. అంతా కార్తీక్ చేతిలోనే ఉంది అంటూ భారతీ చెప్పడంతో మోనిత ఆలోచనల్లో పడిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X