For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బతికినంత కాలం దూరంగా.. నా అంతిమ యాత్రలో వీడ్కోలు చెప్పడానికి.. కార్తీక్‌తో దీప ఎమోషనల్

  |

  తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీలో టాప్ రేటింగ్‌తో దూసుకెళ్తున్న కార్తీకదీపం సీరియల్‌లో మరోసారి గుండెను పిండేసే సన్నివేశాలు కనిపించాయి. కార్తీక్ బాబు, దీప మధ్య భావోద్వేగాలు గుప్పుమన్నాయి. ఇక తన జీవితం ఎంతో కాలం సాగదనే ఆలోచనలో, ఆవేదనలో పడిన దీప కన్నీరుమున్నీరైంది. భర్త కార్తీక్‌కు దగ్గరై తనలోని భావాలను దీప పంచుకొన్నారు. దీప, కార్తీక్ మధ్య చోటచేసుకొన్న సన్నివేశాలు ఎలా ఉన్నాయంటే..

  నీవు ఎంతోకాలం బతకవు దీప..

  నీవు ఎంతోకాలం బతకవు దీప..

  ఇంటి నుంచి ఎవరికీ చెప్పకుండా వచ్చిన దీపను వెతుక్కుంటూ శ్రీరాంనగర్‌లోని ఇంటికి కార్తీక్ బాబు చేరుకొన్నారు. వారిద్దరి మధ్య జరిగిన సంభాషణల్లో తీవ్రస్థాయి వాగ్వాదాలు చోటుచేసుకొన్నాయి. ఆ సందర్బంగా నన్ను చంపేయ్ అంటూ కార్తీక్ చేతులు పట్టుకొని దీప ఏడ్చింది. దాంతో నిన్ను ఎవరో చంపనక్కర్లేదు. నీవే చావబోతున్నావు అంటూ అసలు విషయాన్ని బయటపెట్టారు. ఆ క్రమంలో చెప్పలేని పరిస్థితుల్లో దీప నీవు ఎంతోకాలం బతకవనే విషయాన్ని కార్తీక్ చెప్పారు. దాంతో దీప ఒక్కసారిగా ఎమోషనల్ అవుతూ కనిపించింది. భార్య బాధను అర్థం చేసుకొన్న కార్తీక్ పలు రకాల ఆలోచనల్లో పడ్డారు.

  క్రికెటర్ యజ్వేంద్ర చాహల్ భార్య బోల్డ్ ఫోటోలు వైరల్.. ఘాటుగా క్లీవేజ్ షోతో హంగామా

  పులికి ఆహారం అయ్యే ఆవులా

  పులికి ఆహారం అయ్యే ఆవులా

  తన జీవితం ఇంకా ఎంతో కాలం సాగదనే ఆవేదన చెందుతూ కార్తీక్‌తో దీప మాట్లాడుతూ.. పిల్లలకు పాలిచ్చి.. సుద్దులు చెప్పి.. అప్పగింతలు చేసి అడవికెళ్లి పులి ఆహారంగా మారే ఆవుగా మారిపోతున్నా? ఎందుకు వచ్చాను? ఎందుకు వెళ్లిపోతున్నాను. రావడానికి వెళ్లి పోవడానికి మధ్య ఈ అర్ధం లేని ప్రయాణం ఎందుకు? నాతో ప్రయాణం మొదలుపెట్టిన వారాంతా మధ్యలో దిగిపోయేవాళ్లే. నా పిల్లలు కూడా. ఎందుకీ గమ్యం లేని ప్రయాణం. చావు తప్ప ఇంకో స్టేషన్ లేదా డాక్టర్ బాబు అంటూ భోరుమని దీప విలపించారు.

  ప్రియమణి బోల్డ్ అండ్ బ్యూటీపుల్ గ్యాలరీ.. మీరెప్పుడూ చూడని ఫోటోలు

  డిప్రెషన్‌లోకి వెళ్తావనే చెప్పలేదు..

  డిప్రెషన్‌లోకి వెళ్తావనే చెప్పలేదు..

  నీ ఆరోగ్యం బాగాలేదని చెబితే నీవు డిప్రెషన్‌లోకి వెళ్లిపోతావనే నీకు చెప్పడానికి ఆలోచించాను. కానీ రాను రాను మొండిగా తయారు అవుతానంటే.. చెప్పక తప్పలేదు. ఇలాగే ఏడుస్తూ కూర్చుంటే పిల్లలకు తెలుస్తుంది. నీవే తట్టుకోలేకపోతున్నావు.. వాళ్లు తట్టుకొంటారా అంటూ దీపను సముదాయించే ప్రయత్నాన్ని డాక్టర్ కార్తీక్ బాబు చేశారు.

  యామిని భరద్వాజ్ హోమ్లీ ఫోటోషూట్.. సంప్రదాయ పద్దతిలో మరింత అందంగా

  జబ్బుకు వైద్యం ఒక్కటే కాదు.. ధైర్యం కూడా

  జబ్బుకు వైద్యం ఒక్కటే కాదు.. ధైర్యం కూడా

  ఏ జబ్బుకైనా మందులు ఉంటాయి. మందులు వేసుకోవడం ఒక్కటే వైద్యం కాదు. ధైర్యంగా ఉండటం కూడా ముఖ్యమే. నీకు వైద్యం చేయించడానికి నేను ఉన్నాను. దిగులు పడకు.. భయపడకుండా ఉండు అంటూ దీపకు డాక్టర్ కార్తీక్ ధైర్యం చెప్పారు. ధైర్యం చెబుతూ పక్కనే కూర్చున్న భర్తతో దీప మాట్లాడుతూ.. ఇలాంటి పరిస్థితుల్లో కూడా నన్ను పట్టుకోవాలని అనిపించడం లేదా? భుజం మీద చేయి వేసి ఓదార్చాలనిపించడం లేదా అని అడిగితే.. అదేం లేదు.. నేను ఏదో ఆలోచిస్తున్నాను అంటూ దీపకు సర్దిచెప్పారు.

  నా అంతిమ యాత్రలో

  నా అంతిమ యాత్రలో

  తనలో పొంగుకొస్తున్న బాధను వెల్లడిస్తూ.. ఉన్నంత కాలం నా చేతిని వదిలేశారు. ఈ రోజు దాకా దూరంగా ఉన్నారు. కనీసం శాశ్వతంగా వెళ్తున్నప్పుడైనా తోడుగా ఉన్నారు. కాపురంలో కలిసి నడవకపోయినా.. నా అంతిమ యాత్రలో కలిసి నడిచి.. తుది వీడ్కోలు చెప్పేందుకు పక్కనే ఉన్నారు. థ్యాంక్స్ డాక్టర్ బాబు అంటూ దీప కుమిలికుమిలి ఏడ్చింది.

  English summary
  Karthika Deepam's May 17th's 1041 episode update: Deepa gets emotional and told cow and tiger story to her kids. Popular Television serial Karthika Deepam completed 1000 Episode recently. There are twist in 1041 episode: Dr Karthik shocked over Deepa health report. Deepa's serious health issues sent shock waves to Karthik
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X