Karthika Deepam May 18th Episode: చిన్న కోరికలు తీరుకుండానే మరణానికి చేరువగా.....!
బుల్లితెరపై అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొంటున్న కారత్ీక దీపం సీరియల్‌లో ఊహించని సంఘటనలు చోటుచేసుకొంటున్నాయి. ఇప్పటి వరకు మానసికంగా దూరంగా ఉన్న కార్తీక్, దీప ఇద్దరూ దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. తన ఆరోగ్యం విషమంగా మారే ప్రమాదం ఉందని తెలుసుకొన్న తర్వాత దీప తీవ్ర ఆందోళనకు, డిప్రెషన్ లోనవుతున్నారు. ఈ క్రమంలో శ్రీనగర్ కాలనీ బస్తీలోని ఇంటిలో ఉన్న దీపను, పిల్లలను కార్తీక్ బాబు దగ్గరుండి చూసుకొంటున్నారు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య ఎమోషనల్ సన్నివేశాలు చోటుచేసుకొన్నాయి. ఆ విషయాల్లోకి వెళితే...

మదనపడిన డాక్టర్ బాబు...
నేను ఎన్నోళ్లో దీప విషయంలో ఎలా ఆలోచించానో నాకే తెలియదు. సందర్బాన్ని బట్టి మాట్లాడానా? కోపం, ఆవేశంతో చల్లార్చుకోవడానికి ఇష్టం ఉన్నట్టు మాట్లాడానా? నిర్దయగా వదిలేశానా? అవన్నీ ఇప్పుడు అనవసరం. దీప తప్పు చేసిందా లేదా అనేది సెకండరీ అనే ఆవేదన కార్తీక్ బాబు కళ్లలో కనిపించింది.

మనిషిలా ఆలోచించాలంటూ కార్తీక్
దీప ఆరోగ్య పరిస్థితి దిగజారుతున్న సమయంలో ఇప్పుడు నేను ఒక మనిషిలా ఆలోచించడమే కాకుండా స్పందించాలి కూడా. దీపను బతికించుకోవాలి కూడా. యస్ నా వైపు నుంచి తప్పు లేకుండా దీపను చూసుకోవాలి. దట్స్ ఆల్ అంటూ కార్తీక్ మనసులో అనుకొన్నారు. పిల్లలకు దోశెలు వేయడమే కాకుండా ఉదయమే కాఫీ తీసుకొని దీప వద్దకు వెళ్లారు.

దీప కోసం కాఫీ చేసిన కార్తీక్
ఉదయం నిద్రలోనే ఉన్న దీపను లేపి చేతికి కాఫీ గ్లాస్‌ను కార్తీక్ అందించాడు. కాఫీ తాగు అంటూ.. నేను ఇందాకే తగాను.. మీ కోసం దోశెలు వేశాను. అందరికి హాట్ ప్యాక్‌లో పెట్టాను. స్నానం చేసి టిఫిన్ చేయి.. ఆ తర్వాత ట్యాబ్లెట్లు ఇస్తాను అంటూ కార్తీక్ ప్రేమగా మాట్లాడారు.

ఇద్దరం ఒకే గ్లాస్‌లో కాఫీ తాగాలని
కాఫీ ఇచ్చి కార్తీక్ అక్కడి నుంచి వెళ్లిపోతుండగా పిలిచి తన పక్కనే కూర్చోబెట్టుకొన్నారు. నాకు చిన్న చిన్న కోరికలు ఉన్నాయి. అవి తీరుకుండానే పోతున్నాను. ఒకే గ్లాస్‌లో ఇద్దరం కలిసి కాఫీ తాగాలని నా కోరిక. కానీ నీతో ఉన్నప్పుడు ధైర్యం రాలేదు. మీకు దూరంగా ఉన్నప్పుడు అలాగూ అడగలేకపోయాను. ఎలాగూ పోతున్నాను.. కదా.. అందుకే ధైర్యంగా అడుగుతున్నాను అంటూ దీప తన మనసులోని విషయాలను చెప్పారు.
Recommended Video

నాపై ప్రేమతోనే చేస్తున్నావా?
కార్తీక్ చూపిస్తున్న ప్రేమపై అనుమానాలు వ్యక్తం చేస్తూ దీప అసలు విషయం అడిగింది. నాపై ప్రేమ ఉండే ఇదంతా చేస్తున్నారా? అని దీప అంటే.. అనవసరమైన ఆలోచనలు పక్కన పెట్టి ఆరోగ్యం గురించి ఆలోచించు అంటూ కార్తీక్ సమాధానం చెప్పారు. ఇలా దీప, కార్తీక మధ్య ఎన్నో ఎమోషనల్ సన్నివేశాలు తాజా ఎపిసోడ్‌లో కనిపించాయి.


Click it and Unblock the Notifications











