Karthika Deepam 2 April 12th: దీపని ప్రశాంతంగా ఉండనివ్వనంటున్న నర్సింహ.. భర్తపై కోపంతో రగిలిపోతున్న పారిజాతం!
తను ఎక్కడ దొరికిపోతుందో అని పారిజాతం దీపని బాధపడేలాగా మాట్లాడుతుంది. ఆ మాటలకు బాధపడిన దీప ఇంట్లోంచి వెళ్ళిపోవాలనుకుంటే కార్తీక్ ఆపుతాడు. అయినా వెళ్ళిపోతాను అంటున్న దీపని పండగ వెళ్ళాక చూద్దాం పండుగ ఇక్కడ జరగనివ్వండి అని చెప్తాడు శివ నారాయణ. తప్పక ఒప్పుకుంటుంది దీప. బట్టలు కొనుక్కోవటానికి కార్తీక్ తో పాటు వెళ్లిన దీపం చూసి షాక్ అవుతాడు నర్సింహ. ఇదంతా గత ఎపిసోడ్‌లో జరిగిన కథ. ఏప్రిల్ 12వ తేదీ కార్తీకదీపం సీజన్ 2లో 17వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..
దీపని అలా చూసిన ఆమె భర్త నర్సింహ కోపంతో రగిలిపోతూ మందు తాగుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన అతని రెండో భార్య ఏంటి అంత మౌనంగా తాగుతున్నావు.ఎప్పుడూ లోడలోడా మాట్లాడుతూ ఉంటావు కదా అంటూ ఆవిడ గానీ కనిపించిందా అంటుంది. నర్సింహ కోపంగా చూస్తూ ఇంకో ఆమ్లెట్ కావాలి కారం ఎక్కువ వేసి తీసుకురా అంటాడు. అర్థమైంది, అలా అని రాత్రంతా తాగుతూ కూర్చోకు రేపు ఉగాది త్వరగా పని కానిచ్చి పడుకో అని చెప్పి ఆమ్లెట్ తేవడానికి వెళ్తుంది. మరోవైపు ఇంకా కిందికి రాని కుటుంబ సభ్యులందరినీ కిందికి రమ్మని తొందర పెడతాడు శివ నారాయణ.

వస్తున్నాను తాతయ్య అంటూ కార్తీక్ బయటికి వచ్చే సమయానికి అక్కడికి వచ్చి పెళ్లి కొడుకు లాగా ఉన్నావు, పెళ్లి జరగాలంటే ఎంగేజ్మెంట్ చేసుకోవాలా అని వగలు పోతూ అడుగుతుంది. వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకోవడం చూసిన కార్తీక్ తండ్రి మేము పెళ్లి చేసే వరకు ఆగండి మరీ తొందరపడి పోకండి అని నవ్వుతూ వెళ్ళిపోతాడు. మీరు అపార్థం చేసుకుంటున్నారు అని కార్తీక్ చెప్తాడు కానీ అతను వినిపించుకోడు. జోత్స్న కూడా సిగ్గుపడుతూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అది చూసిన కార్తీక్ పారు ఎందుకు ఇంకా నిజం చెప్పలేదు అనుకుంటాడు.
మరోవైపు దీపకి బట్టలు ఇవ్వటానికి వస్తారు సుమిత్ర, జోత్స్న. మేము బట్టలు కొనుక్కున్నాము అంటుంది దీప. కానీ మా ఇంట్లో ఉన్న వాళ్ళకి బట్టలు పెట్టడం మాకు ఆనవాయితీ మీరు కొనుక్కున్న బట్టలు మానేసి ఈ బట్టలు కట్టుకోండి అంటుంది సుమిత్ర. ఆ బట్టలు ఎందుకు కట్టుకోవాలి అంటుంది శౌర్య. మీ అమ్మ నీకు ఎప్పుడు బట్టలు కొంటుంది కానీ ఈ అమ్మమ్మ కొనటం స్పెషల్ కదా అందుకే ఈ బట్టలు వేసుకోండి.
త్వరగా వచ్చేయండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు సుమిత్ర వాళ్లు. తీసుకోక తప్పడం లేదు అనుకుంటుంది దీప.నర్సింహా రెండవ భార్య అతనికి ఉగాది పచ్చడి ఇస్తుంది. ఎప్పుడూ ప్రేమగా తినిపిస్తావు కదా అంటాడు నర్సింహ.మీ మొదటి భారీ దగ్గర నుంచి విడాకులు తీసుకొని ఆ పత్రాలను నా చేతిలో పెట్టకపోతే పచ్చడి మొహాన కొడతాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

నువ్వు ఇక్కడికి ఏదో పని మీదే వచ్చావని నాకు అర్థమవుతుంది, ఇక నిన్ను వెంటాడటమే నా పని, నిన్ను ప్రశాంతంగా ఉండనివ్వను దీపా అనుకుంటాడు నర్సింహ. మరోవైపు ఇంటికి వచ్చిన పంతులు గారిని నా జాతకం చెప్పండి అంటాడు కార్తీక్. దశరద్ గారికి కాబోయే అల్లుడు మీరు మీ జాతకం బాగానే ఉంటుంది అంటారు పంతులుగారు. అందరూ నా మీదే ఫోకస్ చేసినట్లు ఉన్నారు అనుకుంటాడు కార్తీక్.
మీ జాతకమే కాదు అందరి జాతకాలు చెప్తాను ముందుగా పూజ ముగిస్తాను అంటారు పంతులు. ఇంతలో దీప,శౌర్య కూడా అక్కడికి వస్తారు. దీప ని చూసిన శివనారాయణ ఈమె అవడానికి పేద పిల్లె కానీ ఉన్నవారి అమ్మాయిలాగా అనిపిస్తుంది అనుకుంటాడు. సుమిత్ర కూడా అదే విషయాన్ని బయటకి అంటుంది. నా కోడలు నాలాగా ఆలోచిస్తుంది అనుకుంటాడు శివ నారాయణ.
అడ్డమైన వాళ్ళందరినీ తెచ్చి నెత్తి మీద పెట్టుకుంటాడు వీడి నెత్తి పగలగొట్టాలని ఉంది అని మనసులోనే మొగుణ్ణి తిట్టుకుంటుంది పారిజాతం. ఆ తర్వాత దీప శివ నారాయణని పెద్దయ్య గారు అని పిలిస్తే వద్దు తాతయ్య గారు అని పిలువు అంటాడు. మరి నేను ఏమని పిలవాలి అని శౌర్య అంటే ముత్తాత అని పిలు అంటాడు శివ నారాయణ. నాకు గిఫ్ట్ గా ముద్దు ఇవ్వు అంటాడు. శివ నారాయణ కి ముద్దు పెట్టి నిన్ను ముద్దుల తాత అని పిలుస్తాను అంటుంది శౌర్య.

మీ తాతని చంపిన వాడు నీ ఎదురుగానే ఉన్నాడు అని మనసులో అనుకుంటుంది దీప. నువ్వు ఇక్కడ ఎంత ఇబ్బందిగా కూర్చున్నావో నాకు అర్థం అవుతుంది అనుకుంటాడు కార్తీక్. ఇంతలో శివ నారాయణ మాట్లాడుతూ ఎప్పటిలాగే పోటీ ప్రారంభించండి గెలిచిన వాళ్లకి తులం చైన్ గిఫ్ట్ గా ఇస్తాను అంటూ చైన్ చూపిస్తాడు,జడ్జిగా దీపని ఉండమంటాడు.ఏం పోటీ అని అడుగుతుంది దీప.
ఉగాది పచ్చడి పోటీ, ఎవరు టేస్ట్ గా చేస్తే వాళ్ళకి చైన్ అంటాడు శివ నారాయణ. ఉగాది పచ్చడి ప్రిపేర్ చేయడానికి కుటుంబ సభ్యులందరూ కిచెన్ లోకి వెళ్తారు. ఇక్కడ ఈయన ఆ పెద్దావిడ తప్పితే అందరూ చాలా మంచివారు, మమ్మల్ని ప్రేమగా చూసుకుంటున్నారు అనుకుంటుంది దీప. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.


Click it and Unblock the Notifications











