Karthika Deepam2 April 13th:కార్తీక్ ని క్షమించేది లేదంటున్న దీప..శౌర్యకి గోల్డ్ చైన్ గిఫ్ట్ ఇచ్చిన శివ నారాయణ
దీప ఇంట్లోంచి వెళ్ళిపోవాలనుకుంటే కార్తీక్ ఆపుతాడు. అయినా వెళ్ళిపోతాను అంటున్న దీపని పండగ వెళ్ళాక చూద్దాం ముందు పండుగ ఇక్కడ జరగనివ్వండి అని చెప్తాడు శివ నారాయణ. తప్పక ఒప్పుకుంటుంది దీప. బట్టలు కొనుక్కోవటానికి కార్తీక్ తో పాటు వెళ్లిన దీపని చూసి షాక్ అవుతాడు నర్సింహ. ఉగాది పచ్చడి పోటీ పెడతాడు శివ నారాయణ. ఆ పోటీకి జడ్జిగా దీపని నియమిస్తాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో జరిగిన కథ. ఏప్రిల్ 13వ తేదీ కార్తీకదీపం సీజన్ 2లో 18వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..
పోటీలు పడి మరీ ఉగాది పచ్చడి చేస్తూ ఉంటారు కుటుంబ సభ్యులందరూ. భోజనాలు అయిన తర్వాత మన ఇంటికి బయలుదేరుదాం అంటాడు కార్తీక్. సాయంత్రం నాన్న గారికి ఏదో పని ఉందంట అంటుంది అతని తల్లి. అయితే సాయంత్రం అందరం కలిసి వెళ్దాం అంటాడు కార్తీక్. ఈ సంవత్సరమైనా పెళ్లి చేసుకో కార్తీక్ నా కోడలు మాత్రం ఎంతని ఎదురు చూస్తూ ఉంటుంది అంటుంది కార్తీక్ తల్లి. టాపిక్ మార్చేస్తాడు కార్తీక్.

ఉగాది పచ్చడిలో ఎంత కారం వేయాలి అని అడుగుతుంది జోత్స్న. 3 చెంచాలు వేయమని చెప్తుంది పారిజాతం. కుటుంబ సభ్యులందరినీ చూసి శౌర్య అన్నట్టు ఇంత పెద్ద కుటుంబం ఉంటే ఎంత బాగుంటుంది అనుకుంటుంది దీప. ఆ తర్వాత అందరూ ఉగాది పచ్చడి తీసుకొచ్చి పెడతారు. దీపని జడ్జి చేయమంటాడు శివ నారాయణ. మీరు పెద్దవారు మీరే చేయండి అంటుంది దీప. నేను కోడలి పక్షపాతిని అందుకే నిన్ను చేయమంటున్నాను అంటాడు శివ నారాయణ.

అప్పుడు జోత్స్న పచ్చడి రుచి చూసిన దీప కారం ఎక్కువైంది అని చెప్తుంది. నువ్వే కదా మూడు చెంచాల కారం వేయమని చెప్పావు అని పారిజాతం మీద కోప్పడుతుంది జోత్స్న. పందెంలో గెలవడం కోసం ఇలాంటి పనులు కూడా చేస్తున్నావా పారు అని నవ్వుతాడు కార్తీక్. ఆ తర్వాత కార్తీక్ వాళ్ళ చేసిన పచ్చడిలో చేదు ఎక్కువైందని, సుమిత్ర వాళ్లు చేసిన పచ్చడిలో ఉప్పు ఎక్కువ అయిందని చెప్తుంది దీప.

అయితే అందరూ కమ్మగా తినేటట్లు నువ్వు ఉగాది పచ్చడి చేయమ్మా అంటాడు శివ నారాయణ. నేను చేసింది నచ్చుతుందో లేదో తాతయ్య గారు అంటుంది దీప. పర్వాలేదు బానే ఉంటుంది అని ఎంకరేజ్ చేస్తాడు శివ నారాయణ. ఇంతలో పూజారి గారు వచ్చి రాశి ఫలాలు చెప్తాను అంటారు. ఈ లోపు నేను ఉగాది పచ్చడి చేసి తీసుకు వస్తాను అని కిచెన్లోకి వెళుతుంది దీప. పూజారి రాశి ఫలాలు చెప్తూ ఉండగా దీప ఉగాది పచ్చడి చేసి తీసుకు వస్తుంది.

అందరికీ ఉగాది పచ్చడి ఇస్తూ ఆఖరికి కార్తీక్ దగ్గరికి వస్తుంది. పచ్చడి తీసుకుంటూ లో గొంతుకతో క్షమించాలి అనుకోవచ్చా అంటాడు కార్తీక్. అది ఈ జన్మలో జరగదు అంటుంది దీప. ఆ తర్వాత అందరూ ఉగాది పచ్చడి తిని దీపని మెచ్చుకుంటారు. అందరికీ పచ్చడి నచ్చింది కాబట్టి ఈ చైను దీప గెలుచుకున్నట్లు అందుకే ఈ చైన్ దీపకిస్తాను అంటాడు శివ నారాయణ. అందుకు ఒప్పుకోదు దీప.
అయితే సరే నీకు మానేసి పాపకి ఇస్తాను అని చెప్పి శౌర్య మెడలో చైన్ వేస్తాడు శివ నారాయణ. మళ్లీ పూజారి గారు రాశి ఫలాలు చెప్తూ ఉంటే పెద్దవాళ్ళం మాకు ఎందుకు పిల్లలకు చెప్పండి అంటాడు శివ నారాయణ. దీప ని నీ రాశి ఏమిటి అని అడుగుతాడు నాకు తెలియదు మా నాన్న ఎప్పుడూ చెప్పలేదు అంటుంది దీప. ఎప్పుడు పుట్టావో చెప్పాడా అని వెటకారంగా అడుగుతుంది పారిజాతం. ఆమెకి తల్లిదండ్రులు లేరు అని చెప్తుంది సుమిత్ర.
ఆ తర్వాత జోత్స్న జాతకం చెప్తారు పూజారి గారు. ఆమెకి జాతకం ఏమీ బాగోలేదని, ఈ సంవత్సరం పెళ్లి కూడా జరిగే సూచనలు లేవని చెప్తాడు. అందుకు పరిహారంగా శనివారం పూజలు చేయమని చెప్తాడు. అప్పుడు కార్తీక్ జాతకం చూడమంటుంది అతని తల్లి. అతని జాతకం కూడా చూసిన పూజారి గారు మంచికి పోతే చెడు ఎదురవుతుంది అయినప్పటికీ ఓర్పుతో శత్రువులని జయిస్తాడు. అయినప్పటికీ కష్టనష్టాలు అనుభవించాల్సి ఉంటుంది అంటారు పూజారి.

వీడు జాతకం హైవేలో స్పీడ్ బ్రేకర్ లాగా ఉంది అది ప్రశాంతంగా ముగిసి పోవాలంటే ఏం చేయాలో మీరే చెప్పండి అంటాడు కార్తీక్ తండ్రి. ఏడు సోమవారాలు పూజలు చేయమని చెప్తారు పూజారి గారు. దీనికి చూస్తే ఈ సంవత్సరం పెళ్లి రాతలేదు, వాడేమో పెళ్లి చేసుకోను అంటున్నాడు, దీనికి ఏమో శనివారం పూజలు వాడికి ఏమో సోమవారం పూజలు రోజులే కలవలేదు
ఇంక వీరిని ఎలా కలపాలో ఏంటో అనుకుంటుంది పారిజాతం. ఇంతలో శౌర్య గుడికి వెళ్దాం అన్నావ్ అమ్మ అంటుంది. ఇది అయిపోయాక వెళ్దాం అంటుంది దీప. ఇంతలో శివ నారాయణ మాట్లాడుతూ దోష నివారణ చేయించండి అంతా మంచే జరుగుతుంది అని పంతులు గారితో చెప్తారు. జాతకంలో లేనిది జీవితంలో ఏం జరుగుతుంది అనుకుంటాడు కార్తీక్ తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.


Click it and Unblock the Notifications











