Karthika Deepam 2 April 15th: నర్సింహ చెంప చెల్లుమనిపించిన కార్తీక్.. కార్లోంచి దిగుతున్న దీపని చూసి షాకైన

సుమిత్ర ఇంటి నుంచి వెళ్ళిపోతాను అంటున్న దీపని పండగ వెళ్ళాక చూద్దాం ముందు పండుగ ఇక్కడ జరగనివ్వండి అని చెప్తాడు శివ నారాయణ. తప్పక ఒప్పుకుంటుంది దీప. బట్టలు కొనుక్కోవటానికి కార్తీక్ తో పాటు వెళ్లిన దీపని చూసి షాక్ అవుతాడు నర్సింహ. ఉగాది పచ్చడి పోటీ పెడతాడు శివ నారాయణ. ఆ పోటీకి జడ్జిగా దీపని నియమిస్తాడు. ఉగాది పచ్చడి ఎవరిదీ బాగోక పోవడంతో దీపే ఉగాది పచ్చడి చేసి విజేత అవుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో జరిగిన కథ. ఏప్రిల్ 15వ తేదీ కార్తీకదీపం సీజన్ 2లో 19వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..

గుడిలో దేవుడికి దణ్ణం పెట్టుకుంటూ నాకు అన్యాయం చేసిన వాడు, నా జీవితంలో నుంచి సుఖసంతోషాలను దూరం చేసిన వాడు నా కంటికి కనిపించకుండా ఉండేలా చూడు అని కోరుకుంటుంది దీప. కార్తీక్ కూడా అదే గుడికి వచ్చి దీపకి నిజం చెప్పుకునే అవకాశాన్ని కలిగించు అని దండం పెట్టుకుంటాడు. పూజ పూర్తయిన తర్వాత దీప గుడి బయటికి వస్తుంది.అప్పుడే గుడి లోపలికి వస్తు నర్సింహ కనిపిస్తాడు. నువ్వు ఊరికి పోకుండా ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. దీప సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతుంటే ఆమెని పట్టుకొని ఆపుతాడు నర్సింహ.

Karthika Deepam season 2 April 15th 2024 Episode Number 19 Here is full story

ఆమె పైట అతని చేతిలోకి వస్తుంది. అది చూసి షాక్ అవుతుంది దీప. అప్పుడే కార్తీక్ నరసింహ చెంప పగలగొడతాడు. ఎవడు నువ్వు, ఆమె పైట పట్టుకోవలసిన అవసరం ఏమొచ్చింది అంటూ కాలర్ పట్టుకుని నిలదీస్తాడు. కార్తీక్ ని గుర్తుపడతాడు నరసింహ. దీప వైపు కోపంగా చూస్తూ నీ మెడలో తాళి కట్టిన మొగుడ్ని నేనే అని చెప్పు అని కోపంగా చెప్తాడు. ఆ మాటలు విన్న కార్తీక్ షాక్ అయ్యి అతని కాలర్ మీద నుంచి చేతులు తీసేస్తాడు.

మొగుడ్ని కొట్టించే అంత స్టేజ్ కి వచ్చావన్నమాట అనే దీపతో అసహ్యంగా మాట్లాడుతాడు నర్సింహ. మర్యాదగా మాట్లాడు అంటుంది దీప. నువ్వు వాడితో కారులో తిరగడం నేను చూడలేదు అనుకున్నావా.. బిడ్డని చూసుకుంటానని కూడా మాటిచ్చాడా అంటాడు నరసింహ. ఆ మాటలకి కోపంతో రగిలిపోతుంది దీప. కాలికున్న చెప్పు తీసి ఎక్కువ మాట్లాడితే చంప పగులుతుంది అని వార్నింగ్ ఇస్తుంది.

నువ్వు మర్యాదగా ఊరికి వెళ్ళిపో ఇక్కడే ఉంటే మాత్రం నిన్ను వదిలిపెట్టను అని వార్నింగ్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు నర్సింహ. ఆ తర్వాత దీప కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు సుమిత్ర భర్తకి, శౌర్య కి పాయసం తీసుకువస్తుంది. సుమిత్ర భర్త కాలికి షూ లేస్ విడిపోవడం చూసి కట్టాలనుకుంటుంది శౌర్య. నువ్వు ఇలాంటి పనులు చేయకూడదు స్కూల్ కి వెళ్లి చదువుకోవాలి అంటాడు సుమిత్ర భర్త. మేము ఊరికి వెళ్ళిపోతాం కదా అక్కడ చదువుకుంటానండి అంటుంది శౌర్య.

Karthika Deepam season 2 April 15th 2024 Episode Number 19 Here is full story

మీరు నాతో చాలా బాగా మాట్లాడుతున్నారు మా నాన్నమ్మ ఎప్పుడూ నాతో ఇలా మాట్లాడదు. ఊరికి వెళ్ళిపోయిన తర్వాత మిమ్మల్ని అప్పుడప్పుడు కలవచ్చా అని అంటుంది శౌర్య . అసలు నిన్ను ఇక్కడి నుంచి వెళ్ళనిస్తే కదా మళ్ళీ ఇక్కడికి రావడానికి, మమ్మల్ని కలవడానికి. నువ్వు ఇక్కడే ఉండి స్కూల్లో చదువుకో. కార్లో వెళ్లి రావచ్చు అంటుంది సుమిత్ర. అందుకు ఆనందపడుతుంది శౌర్య. ఆ తర్వాత ఆమెకు పాయసం తినిపిస్తుంది సుమిత్ర.

శౌర్య పాయసం బాగోలేదు మా అమ్మ అయితే చాలా బాగా చేస్తుంది అంటుంది. మీ అమ్మ ఊర్లో ఏం చేస్తుంది అని అడుగుతుంది సుమిత్ర. మా అమ్మ ఊర్లో వంట చేసి అందరికీ క్యారేజీలు ఇస్తుంది అని చెప్తుంది శౌర్య . నువ్వు చెప్పలేని విషయాలు చాలా తెలుసుకున్నాను దీప అనుకుంటుంది సుమిత్ర. మరోవైపు గుడిలో జరిగిందాని గురించి తలచుకుంటూ కోపంగా నడుచుకుంటూ వచ్చేస్తుంది దీప. ఆ తర్వాత చుట్టూ చూసేసరికి దారి తప్పానని తెలుసుకుంటుంది.

దారిలో శివ నారాయణ ఇంటి గురించి అడిగితే వాళ్ళకి తెలియదు అని చెప్తారు. ఇంతలో కార్తీక్ అక్కడికి వచ్చి మీరు గుడి దగ్గరే దారి తప్పారు అందుకే నేను వచ్చాను రండి కార్ లో తీసుకువెళ్తాను అని చెప్తాడు. గుడి దగ్గర జరిగింది చాలదా అంటూ విసుక్కుంటుంది దీప. ఇంతలో అటుగా వెళుతున్న వ్యక్తిని శివ నారాయణ ఇంటి అడ్రస్ అడుగుతుంది. ఇంటి అడ్రస్ చెప్తాడు కార్తీక్.

Karthika Deepam season 2 April 15th 2024 Episode Number 19 Here is full story

నేను కూడా అటే వెళ్తున్నాను అని చెప్తాడు. ఆ వచ్చిన వ్యక్తి మరేమీ అతనితో వెళ్ళమ్మా అని బలవంతంగా కార్తీక్ కారు ఎక్కేలాగా చేస్తాడు. వేరే దారి లేక కార్తీక్ కార్ ఎక్కుతుంది దీప. మరోవైపు కాబోయే కోడలికి బర్త్డేకి గిఫ్ట్ ఇవ్వటానికి రెండు నెక్లెస్లు సెలెక్ట్ చేసి వాటిని ఫోటోలు తీసి సెలెక్ట్ చేసుకోమంటుంది కార్తీక్ తల్లి. సుమిత్ర ఆ ఫోటోలు తీసుకెళ్లి కూతురికి చూపిస్తుంది. నా కూతురు నానమ్మ కావాలని చాలా కంగారు పడుతున్నట్లుగా ఉంది అని నవ్వుతాడు శివ నారాయణ.

పిల్లలిద్దరూ పెళ్ళికి సిద్ధంగా ఉన్నారు మనదే ఆలస్యం అంటుంది పారిజాతం. హోటల్ కన్స్ట్రక్షన్ అయ్యేవరకు కార్తీక్ ఆగమన్నాడు అంటాడు కార్తీక్ తండ్రి. అలా అనక వెంటనే పెళ్లి చేసేయండి అని అంటారా ఏంటి అంటుంది పారిజాతం. జోత్స్న కూడా పెళ్లికి సిద్ధం అంటుంది. ఇంతలోనే ఇంటికి వచ్చిన కార్తీక్ ని చూస్తుంది పారిజాతం. ఆ వెనుకనే కారు దిగుతున్న దీపని చూసి షాక్ అవుతుంది. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X