Karthika Deepam 2 April 16th: దీప ఇచ్చిన షాక్‌కు కంగుతిన్న పారిజాతం.. శౌర్య ద్వారా నిజం తెలుసుకున్న కార్తీక్!
సుమిత్ర బలవంతం మీద ఇంట్లో ఉండటానికి ఒప్పుకుంటుంది దీప. బట్టలు కొనుక్కోవటానికి కార్తీక్ తో పాటు వెళ్లిన దీపని చూసి షాక్ అవుతాడు నర్సింహ. ఉగాది పచ్చడి పోటీ పెడతాడు శివ నారాయణ. ఆ పోటీకి జడ్జిగా దీపని నియమిస్తాడు. ఉగాది పచ్చడి ఎవరిదీ బాగోక పోవడంతో దీపే ఉగాది పచ్చడి చేసి విజేత అవుతుంది. గుడిలో దీప భర్త ఆమెని అవమానించేలాగా మాట్లాడతాడు. కార్తీక్ అతని చెంప చెళ్ళు మనిపిస్తాడు.ఇదంతా గత ఎపిసోడ్‌లో జరిగిన కథ. ఏప్రిల్ 16వ తేదీ కార్తీకదీపం సీజన్ 2లో 20వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..
సుమిత్ర వాళ్ళు కార్తీక్, జ్యోత్స్న ల పెళ్లి గురించి మాట్లాడుకుంటూ ఉండగానే కార్తీక్ లోపలికి వస్తాడు. కార్తీక్ కార్ లోంచి దీప దిగటం చూసి షాక్ అవుతుంది పారిజాతం. కార్తీక్ ని పెళ్లి గురించి అడుగుతారు పెద్దవాళ్లు. పెళ్లి ఇష్టం లేదనే విషయం గురించి చెప్పమని పారిజాతానికి సైగ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కార్తీక్. మెట్లు ఎక్కుతుంటే అక్కడ శౌర్య కనిపిస్తుంది. గుడిలో జరిగిన సంఘటన అంతా గుర్తుతెచ్చుకొని బాధపడతాడు కార్తీక్. ఇంటికి వెళ్ళిన తర్వాత దీప కూడా జరిగింది తలుచుకొని బాధపడుతుంది.

మంచినీళ్లు తాగాలనుకునే లోపు పారిజాతం అక్కడికి వచ్చి నా మనవడు డోర్ తీస్తేనే గాని కిందికి దిగలేవా, అయినా వాడిది మంచి మనసు కారు ఎక్కమంటాడు నువ్వు ఎక్కేయటమేనా అంటూ పెద్దగా అరుస్తుంది. నోరు ఉంది కదా అని నాలుక తిప్పెయ్యకండి, నేను చెయ్యి తిప్పాల్సి వస్తుంది విషయం తెలుసుకోకుండా మాట్లాడకండి అని గట్టిగా మాట్లాడుతుంది దీప. ఆ మాటలకి ఒక్కసారిగా ఖంగుతింటుంది పారిజాతం. నువ్వు మాట్లాడుతున్నది ఎవరితోనో తెలుస్తుందా అంటుంది.
నేను తప్పు చేయకుండా ఎవరితోనూ మాట పడను, అది తెలియచేయడం కోసమే ఇలా మాట్లాడుతున్నాను అంటుంది దీప. మంచినీళ్లు తాగుతున్నట్లుగా ఉన్నావు తాగు కొంచెం చల్లబడతావు అని చెప్పి అక్కడి నుంచి చల్లగా జారుకుంటుంది పారిజాతం. మరోవైపు శౌర్య తో మాట్లాడుతూ ఆమె విషయాలు అన్నీ తెలుసుకుంటాడు కార్తీక్. శౌర్య తండ్రిని ఎప్పుడూ చూడలేదని తండ్రిని వెతకడం కోసమే ఇక్కడికి వచ్చారని తెలుసుకుంటాడు.
మా నాన్న కూడా నీలాగే ఉంటాడా, నాకు మా నాన్నతోనే ఉండిపోవాలని ఉంది అంటూ మాట్లాడుతుంది శౌర్య. అప్పుడే అక్కడికి వచ్చిన దీప శౌర్య ని కోప్పడి అక్కడి నుంచి లాక్కుపోతుంది. ఇంటికి వచ్చిన తర్వాత ఎవరితో ఏం మాట్లాడుతున్నావో అర్ధం అవుతుందా వాళ్లతో అలా మాట్లాడకూడదు అని చెప్తుంది. అయితే నాన్న ఎలా ఉంటారో నువ్వే చెప్పు అని నిలదీస్తుంది శౌర్య. నీలాగే ఉంటాడని చెప్పాను కదా అంటుంది దీప.
కార్తీక్ కూడా నాలాగే ఉంటాడు కదా, అయినా ఎందుకు నామీద గట్టిగా మాట్లాడుతున్నావు నువ్వు నాతో గట్టిగా మాట్లాడవు నేను నీతో మాట్లాడను అని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శౌర్య. అందరూ నామీద అలిగే వాళ్లే, మళ్ళీ అమ్మ అనుకోని వస్తావు కదా అప్పుడు నీ పని చెప్తాను అంటుంది దీప. ఇంకా ఇక్కడే ఉండి వాళ్లని ఇబ్బంది పెట్టకూడదు వెళ్ళిపోదామని చెప్పాలి అనుకుంటుంది.

మరోవైపు జ్యోత్స్న తల్లితో పుట్టిన రోజుకి లాస్ట్ టైం వంటలు చేయించిన వాడితో వంటలు చేయించొద్దు అని చెప్తుంది. అంతలోనే అక్కడికి దీప వస్తుంది. నువ్వు వంటలు బాగా చేస్తావ్ అంట కదా నీ కూతురు చెప్పింది. రేపు జ్యోత్స్న పుట్టినరోజు వంటలన్నీ నువ్వే చేయాలి అంటుంది సుమిత్ర. దీప వెళ్ళిపోదామని చెప్పడానికి వస్తే వంటలు చేయమంటున్నారు ఏమిటి అని మనసులో అనుకుంటుంది.
ఏమ్మా.. నీ వంటలు మాకు రుచి చూపించవా అని అడుగుతాడు జోత్స్న తండ్రి. వీళ్ళ రుణం తీర్చుకోవడానికైనా వంట చేయాలి అనుకుంటుంది దీప. తప్పకుండా చేస్తాను అని చెప్పి అక్కడి నుంచి బయటికి వచ్చేస్తుంది. బయటికి వస్తున్న దీప ని చూసి కంగారు పడి దాక్కుకుంటాడు బంటు. దీప వెళ్ళిపోవటం చూసి వెనక్కి తిరిగేసరికి అతని వెనకే దీప ఉంటుంది.
ఒక్కసారిగా షాక్ అవుతాడు బంటు. ఎందుకు నన్ను చూసి కంగారు పడుతున్నావు ఏమైనా తప్పు చేసావా అని అడుగుతుంది. నేనేం తప్పు చేశాను, నేను పారిజాత అమ్మగారు నమ్మినబంటుని నా పేరు కూడా బంటువే అని చెప్పి అక్కడి నుంచి జారుకుంటాడు బంటు. నన్ను చూసి ఎందుకు కంగారు పడుతున్నాడు అని మనసులో అనుకుంటుంది దీప. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.


Click it and Unblock the Notifications











