Karthika Deepam 2 April 17th: పారిజాతం ముందు బంటు వేషాలు..దీప ప్రసన్నం కోసం కార్తీక్ తంటాలు!
బట్టలు కొనుక్కోవటానికి కార్తీక్ తో పాటు వెళ్లిన దీపని చూసి షాక్ అవుతాడు నర్సింహ. ఉగాది పచ్చడి పోటీ పెడతాడు శివ నారాయణ. ఆ పోటీకి జడ్జిగా దీపని నియమిస్తాడు. ఉగాది పచ్చడి ఎవరిదీ బాగోక పోవడంతో దీపే ఉగాది పచ్చడి చేసి విజేత అవుతుంది. గుడిలో దీప భర్త ఆమెని అవమానించేలాగా మాట్లాడతాడు. కార్తీక్ అతని చెంప చెళ్ళు మనిపిస్తాడు. జోత్స్న పుట్టిన రోజున వంటలు చేయటానికి ఒప్పుకుంటుంది దీప. ఇదంతా గత ఎపిసోడ్‌లో జరిగిన కథ. ఏప్రిల్ 17వ తేదీ కార్తీకదీపం సీజన్ 2లో 21వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..
బంటు పారిజాతం దగ్గరికి వచ్చి నేను ఆ దీపని గడగడలాడించేసాను, ఇక మీదట ఆమె నన్ను చూస్తే జడుచుకోవాల్సిందే అని ప్రగల్బాలు పలుకుతాడు. ఇంటికి మెయిన్ పిల్లర్ లాంటి దాన్ని అది నన్నే తీసి పారేసినట్లు మాట్లాడుతుంది అలాంటిది దాన్ని నువ్వు గడగడలాడించేసావంటే నేను నమ్మాలా అంటూ వెటకారంగా మాట్లాడుతుంది పారిజాతం.

గుడి ముందు పోతురాజు లాంటి వాడిని నన్ను అంత మాట అనేసారేమిటి అంటాడు బంటు. నువ్వు గుడి ముందు పోతురాజు అయితే అది గుడిలోని అమ్మోరు దాన్ని చూసి నువ్వు జడుచుకోకుండా ఉంటే చాలు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పారిజాతం. మీ మొహం లో నవ్వు చూడటానికి నేను ఏం చేయటానికైనా సిద్ధం అనుకుంటాడు బంటు. మరోవైపు షాపింగ్ కి బయలుదేరిన కార్తీక్ వాళ్లకి కారు దగ్గర శౌర్య కనిపిస్తుంది.
ఇక్కడ ఏం చేస్తున్నావ్ అంటాడు కార్తీక్. కారుకి ఉన్న కిటికీ ని చూస్తున్నాను అంటుంది శౌర్య.అది కిటికీ కాదు సన్ రూఫ్ అంటారు అంటూ దాని గురించి వివరిస్తాడు కార్తీక్. పద టైం అయిపోతుంది అని జోత్స్న కార్తీక్ తో అంటుంది. నేను కూడా మీతో రావచ్చా అంటుంది శౌర్య. జ్యోత్న వద్దంటుంది కానీ కార్తీక్ ఆమెని ఒప్పిస్తాడు. శౌర్య చేతిలో ఉన్న బొమ్మని అమ్మకి ఇచ్చేసి బయటికి వెళ్తున్నామని అమ్మకి చెప్పేసి రా అంటాడు.
అమ్మకి నాకు మాటలు లేవంటూ జరిగిందంతా చెప్పింది శౌర్య. అమ్మ దగ్గర నువ్వే పర్మిషన్ తీసుకో అని రిక్వెస్ట్ చేస్తుంది. చేసేదిలేక బొమ్మ తీసుకొని దీప దగ్గరికి వెళ్తాడు కార్తీక్. శౌర్య ని మాతో పాటు తీసుకు వెళ్తాం అని పర్మిషన్ అడుగుతాడు. దీప ఒప్పుకోదు. ఆమెని ఒప్పిస్తాడు కార్తీక్. కార్తీక్ అక్కడ నుంచి వెళ్తుంటే నాకు చెప్పుకోవటానికి ఉన్న ఒకే ఒక బంధం శౌర్య, ఆమె జాగ్రత్త అని చెప్తుంది దీప అలాగే ఆమెకు బట్టలు లాంటివి ఏమీ కొనొద్దు అని కూడా చెప్తుంది.
ఇంతకన్నా లాగిపెట్టి కొట్టినా అంతగా బాధ అనిపించదు. అయినా ఆ తప్పు నేను కావాలని చేయలేదు ఇది నిజం మీరు ఎప్పటికైనా తెలుసుకుంటారు అని ఆశిస్తున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. శౌర్య వీళ్ళకి బాగా దగ్గర అయిపోతుంది ఇదే కంటిన్యూ అయితే నేను దానిని ఆపగలనా అనుకుంటుంది దీప. మరోవైపు మల్లేష్ ఇంట్లో బూజులు దులుపుతూ ఉంటుంది దీప అత్త అనసూయ.
అప్పుడే అక్కడికి వచ్చిన మల్లేష్ పని త్వరగా చేయడం లేదని ఆమెని మందలిస్తాడు. ఆ మాటకి అనసూయ సమాధానం చెప్తే ఎక్కువ చేస్తున్నావ్ ఏంటి మళ్లీ మాట్లాడితే ఆ ఇల్లు నా పేరు మీద రాయించేసుకుంటాను అని బెదిరిస్తాడు. ఆ ఇంటి జోలికి వెళ్లొద్దు అంటుంది. మల్లేష్ అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత కోడల్ని తిట్టుకుంటుంది అనసూయ. పట్నం వెళ్లి మూడు రోజులైంది అక్కడ ఏం జరిగిందో కనీసం ఫోన్ చేసి చెప్పాలి కదా దీని పీడ ఎప్పుడు విరగడ అయిపోతుందో అనుకుంటుంది.

మరోవైపు బట్టల షాప్ కి వచ్చిన శౌర్య కి ఒక ఫ్రాక్ నచ్చుతుంది. దీప చెప్పిన మాటలు కార్తీక్ కి గుర్తొస్తాయి కానీ పాప సంతోషం ముందు రెండు తిట్లు తిన్నా పర్వాలేదు అనుకోని ఆ ఫ్రాక్ కొంటాడు కార్తీక్. తర్వాత జ్యోత్స్న కి డ్రెస్ సెలక్ట్ చేయడానికి ఆమె దగ్గరికి వెళ్తాడు కార్తీక్. ఇంతలో శౌర్య బట్టలు చూస్తూ ఉంటే ఆమెకి నర్సింహ రెండవ భార్య కనిపిస్తుంది. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం


Click it and Unblock the Notifications











