Karthika Deepam 2 April 18th: తల్లితో నిజం చెప్పాలనుకున్న కార్తీక్.. నర్సింహని రెచ్చగొడుతున్న శోభ!
ఉగాది పచ్చడి ఎవరిదీ బాగోక పోవడంతో దీపే ఉగాది పచ్చడి చేసి విజేత అవుతుంది. గుడిలో దీప భర్త ఆమెని అవమానించేలాగా మాట్లాడతాడు. కార్తీక్ అతని చెంప చెళ్ళు మనిపిస్తాడు. జోత్స్న పుట్టిన రోజున వంటలు చేయటానికి ఒప్పుకుంటుంది దీప. దీపని ఒప్పించి శౌర్య ని షాపింగ్ కి తీసుకువెళ్తాడు కార్తీక్. అక్కడ నర్సింహ దంపతులని చూసిన శౌర్య భయంతో దాక్కుంటుంది. కన్ఫ్యూజ్ అవుతాడు కార్తీక్ ఇదంతా గత ఎపిసోడ్‌లో జరిగిన కథ. ఏప్రిల్ 19వ తేదీ కార్తీకదీపం సీజన్ 2లో 23వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..
కార్తీక్ ఇంటికి వెళ్ళటం కోసం కారు దగ్గరికి వచ్చేసరికి అక్కడ దీప గౌను తో సహా ఉంటుంది. విషయం అర్థం చేసుకుంటాడు కార్తీక్. పాపకి ఎందుకు దగ్గరవుతున్నారు, మీరు పాపతో ప్రేమగా ఉండడం నాకు ఇష్టం లేదు ఇక్కడ ఉన్నన్ని రోజులు ప్రశాంతంగా ఉండనివ్వండి అంటుంది దీప. రౌడీ చిన్న పాప తనకి కూడా సరదాలు సంతోషాలు ఉంటాయి అంటాడు కార్తీక్. వాటిని తీర్చడానికి నేనున్నాను మీరెవరు తన కోరికలు తీర్చడానికి అని అడుగుతుంది దీప. మా అత్త ని కాపాడటానికి మీరెవరు అని నిలదీస్తాడు కార్తిక్. మీరు మా అత్తని ఏ ఉద్దేశ్యము లేకుండా కాపాడినట్లే నేను కూడా పాపకి దగ్గరవడంలో ఎలాంటి ఉద్దేశ్యము లేదు అంటాడు.

అలాగే షాపులో నర్సింహ కనిపించిన సంగతి కూడా చెప్తాడు. మీరు శౌర్యకి ఏమైనా చెప్పారా అని అడుగుతుంది దీప. కన్న తల్లి మీరే చెప్పలేనప్పుడు నేను ఎందుకు చెప్తాను. అసలు ఏం జరిగింది నిజం తెలిస్తే నేనేమైనా సాయం చేయగలను కదా అంటాడు కార్తీక్. నాకు ఏమైనా సాయం చేయాలనుకుంటే మీరు పాపకి దూరంగా ఉండండి ఆ ఒక్క సాయం చాలు అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది దీప.
ఇప్పటికే గిల్టీగా ఉన్న నేను పాప చిరునవ్వులో ఆ బాధ తగ్గించుకుంటున్నాను మీరు అడిగిన సాయం చేయలేను దీప అనుకుంటాడు కార్తీక్. మరోవైపు భర్తకి భోజనం వడ్డించిన శోభ అన్నంలో కూర వడ్డించకుండా ఉప్పు కారం కలుపుతుంది. ఏంటి ఈ పిచ్చి పని అంటాడు నర్సింహ. నిన్ను చేతకాని వాడిని చేసేసింది నీ మొదటి భార్య తను ఈ ఊర్లో ఉండకూడదు ఇక్కడినుంచి పంపించెయ్అని వార్నింగ్ ఇస్తుంది.

అలాగే చేతికున్న గాజులు తీసేసి ఇవి నువ్వు వేసుకోవాలో నేను వేసుకోవాలో నువ్వే నిర్ణయించుకో అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. భార్య రెచ్చగొట్టడంతో మరింత రెచ్చిపోయిన నర్సింహ దీపని, దానికి సహాయం చేస్తున్న వాడిని ఇద్దరినీ వదిలిపెట్టను అనుకుంటాడు. మరోవైపు జోత్స్న కొన్న బట్టలు చూసి మురిసిపోతూ ఉంటారు కార్తీక్ తల్లిదండ్రులు. ఈ పెళ్లి ఇష్టం లేదని పారు చెప్పేలాగ లేదు నేను ఎలాగైనా అమ్మకు చెప్పాలి అనుకుంటాడు కార్తీక్.
అదే విషయం తల్లికి చెప్పబోతే నువ్వు హోటల్ కన్స్ట్రక్షన్ బిజీలో పడి మమ్మల్ని మర్చిపోయినా పర్వాలేదు కానీ జోత్స్న విషయంలో అశ్రద్ధ చేయవద్దు అని ఎమోషనల్ అవుతుంది కాంచన. మన బిడ్డ మనల్ని కష్టపెట్టే పని ఏది చేయడు అంటాడు కార్తీక్ తండ్రి. ఇక ఏమీ మాట్లాడలేక అక్కడ నుంచి వెళ్ళిపోతున్న కార్తీక్ నేను నిజం చెప్పలేను పారుతోనే నిజం చెప్పించాలి అనుకుంటాడు. మరోవైపు అమ్మకి తెలియకుండా డ్రాయింగ్ వేస్తూ ఉంటుంది శౌర్య.

కలర్ పెన్సిల్స్ చూసిన దీప అవి ఎక్కడవి అని అడుగుతుంది. కార్తీక్ కొన్నాడు నేనే కొనమన్నాను అంటుంది శౌర్య. అలా కొనమని అడగకూడదు అంటుంది దీప. మరుసటి రోజు పొద్దున్నే గుమ్మం ముందు రంగుల ముగ్గు వేస్తూ ఉంటుంది దీప. శౌర్య దీప దగ్గరికి వచ్చి ఆమెకి హ్యాపీ బర్త్డే చెప్పి తను డ్రాయింగ్ వేసిన షీట్ ఇస్తుంది. ఆ పేపర్ ఎగిరి వెళ్లి కార్తీక్ దగ్గర పడుతుంది. అది చూసిన కార్తీక్ ఏమిటి అని అడుగుతాడు ఈరోజు మా అమ్మ బర్త్డే నేను అమ్మకి ఈ డ్రాయింగ్ గిఫ్ట్ గా ఇచ్చాను అని చెప్పి ఆ పేపర్ తీసుకొని మళ్లీ దీపకి ఇస్తుంది శౌర్య.
సరేగాని వెళ్లి పూలు కోసుకొని తీసుకురా ముగ్గు మీద వేద్దాం అంటుంది దీప. పూలు కోస్తే గొడవలు అవుతాయి అంటుంది శౌర్య. వీళ్ళ ఇంట్లో వేసే ముగ్గు కోసమే కదా పూలు తెంపేది ఏమీ పరవాలేదు వెళ్ళు అంటుంది దీప. సరే అంటూ శౌర్య పూలు కొయ్యటానికి వెళ్తే ఆమెని కొయ్యొద్దంటాడు బంటు. మా అమ్మకు చెప్తాను ఉండు అంటూ విషయాన్ని తల్లికి వినపడేలా చెప్తుంది శౌర్య. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.


Click it and Unblock the Notifications











