Karthika Deepam 2 April 23th: పారిజాతం పై ఫైర్ అయిన కార్తీక్.. నర్సింహ చెంప పగలగొట్టిన సుమిత్ర!

దీపని ఒప్పించి శౌర్య ని షాపింగ్ కి తీసుకువెళ్తాడు కార్తీక్. అక్కడ నర్సింహ దంపతులని చూసిన శౌర్య భయంతో దాక్కుంటుంది. కన్ఫ్యూజ్ అవుతాడు కార్తీక్. దీప ని ఊరు నుంచి పంపించేయమని నర్సింహాని హెచ్చరిస్తుంది శోభ. పాపని షాపింగ్ తీసుకువెళ్లినందుకు కార్తీక్ పై కోప్పడుతుంది దీప. సుమిత్ర పై దాడి చేసిన వాడితో మాట్లాడుతూ దీపకీ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోతాడు బంటు. ఇదంతా గత ఎపిసోడ్‌లో జరిగిన కథ. ఏప్రిల్ 23 వ తేదీ కార్తీకదీపం సీజన్ 2లో 26వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..

దీప వంట పనులు చేస్తూ ఉంటే ఆమెకి సాయం చేయటానికి వచ్చినట్లుగా వచ్చిన సుమిత్ర ఆమె జీవితం గురించి తెలుసుకోవాలనుకుంటుంది. దీప మాటల్లో ఆమె భర్త ఒక డ్రైవర్ అని తెలుసుకుంటుంది. మిగతా విషయాలను కూడా అడుగుతుంది కానీ దీప సమాధానం చెప్పకుండా తప్పించుకుంటుంది. నీ కష్టాన్ని కూడా చెప్పుకోలేనంత ఆత్మ అభిమానం నీకు ఎందుకు అని దీప గురించి అనుకుంటుంది సుమిత్ర. మరోవైపు తన చేతిలో రోజా పువ్వు వుంచినందుకు పారిజాతంపై కోప్పడతాడు కార్తీక్.

పెళ్లి ఇష్టం లేదని చెప్పమని చెప్పాను కదా ఇంకా చెప్పలేదేమిటి అని నిలదీస్తాడు. తనని పెళ్లి చేసుకోవడానికి నీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి అని అడుగుతుంది పారిజాతం. జ్యోత్స్న అంటే ఇష్టం లేదని కాదు నువ్వు,అత్త, మావయ్య, తాతయ్య ఎలాగో తను కూడా అంతే. చేయి పట్టుకుని నడవడానికి, చిటికెన వేలు పట్టుకొని నడవడానికి చాలా తేడా ఉంటుంది అందుకే ఈ విషయం ఎంత తొందరగా వాళ్లకు చెప్తే అంత మంచిది. వాళ్లు బాధపడితే నేను చూడలేను అంటాడు కార్తీక్. నాకు కొంచెం టైం ఇవ్వు, నువ్వేమి టెన్షన్ పడకు మీ పెళ్లి జరగకుండా చూసే పూచి నాది అంటుంది పారిజాతం.

Karthika Deepam season 2 April 23th

కానీ కార్తీక్ వెళ్లిపోయిన తర్వాత ఈ పారిజాతం మాటలు నీటి మీద మూటలు అని నవ్వుకుంటుంది. మరోవైపు దీప చేసిన పాయసం తిన్న సుమిత్ర వాళ్లు ఆ పాయసాన్ని ఎంతో మెచ్చుకుంటారు. అప్పుడే అటుగా వస్తున్న కార్తీక్ ని పిలిచి పాయసాన్ని టేస్ట్ చేయమంటారు. పాయసం టేస్ట్ చేసిన కార్తీక్ చాలా బాగుంది ఎవరు చేశారు అంటాడు. దీప చేసింది, నువ్వు కట్టబోయే రెస్టారెంట్లో ఈమెని చెఫ్ గా పెట్టుకో అంటుంది సుమిత్ర.

సరే అంటాడు కార్తీక్. వద్దమ్మా నా పనులు నాకు ఉన్నాయి నా జీవితం వేరు నేను వెళ్ళాలి అంటుంది దీప. చెఫ్ అంటే మంచి జీతం వస్తుంది నీ జీవితం మారిపోతుంది అంటుంది సుమిత్ర. జోత్స్న కూడా దీపని ఒప్పించడానికి చూస్తుంది కానీ దీప ఆ ప్రపోజల్ ని రిజెక్ట్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆమెని ఇబ్బంది పెట్టవద్దు అంటాడు కార్తీక్. మరోవైపు కంగారు పడుతూ వస్తున్న శౌర్యని ఏం జరిగింది అని అడుగుతుంది దీప.

ఆరోజు పూలు కోస్తుంటే గొడవపడ్డాడు కదా ఆ బూచాడు వచ్చాడు, పద పోయి దాక్కుందాం అంటుంది శౌర్య. నువ్వు లోపలికి వెళ్ళు నేను ఇప్పుడే వస్తాను అని బయటికి వస్తుంది దీప. అక్కడ నర్సింహ ని చూసి ఎందుకు వచ్చావు అని అడుగుతుంది. ఆరోజు నా చెంప పగలగొట్టిన వాడి ఇల్లే కదా ఇది.వాడు నా కూతుర్ని వాడి కూతురు లాగా చూసుకుంటున్నాడు, నా భార్య ని వాడి భార్య లాగా చూసుకోవడం లేదు కదా అని నీచంగా మాట్లాడుతాడు.

నా బ్రతుకుని బజారున పడేసింది చాలు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు అంటుంది. నేను వెళ్ళటం కాదు నువ్వే ఈ ఊరు నుంచి వెళ్ళు, నువ్వుంటే శోభ నాతో ఉండనంటుంది పద ఇప్పుడే నిన్ను బస్సు ఎక్కిస్తాను అంటూ ఆమె చేయి పట్టుకుంటాడు నర్సింహ. తన చెయ్యి పట్టుకుంటున్నావు ఎవడ్రా నువ్వు అంటూ అతని చెంప పగలగొడుతుంది సుమిత్ర. దానికి తాళి కట్టిన భర్తని అంటాడు నర్సింహ.

Karthika Deepam season 2 April 23th 2024 Episode Number 26 Here is full story

నిజమా అని ఆశ్చర్యంగా అడుగుతుంది సుమిత్ర. దీప ఏమి మాట్లాడదు. నర్సింహ పద నిన్ను నాతో పాటు తీసుకువెళ్తాను అని దీప చేయి పట్టుకోబోతే అతడిని వారిస్తుంది సుమిత్ర. నీ మాటల్లోను,దీప మౌనంలోనూ అర్థమవుతుంది నువ్వు ఎలాంటి భర్తవో . తను ఇక్కడినుంచి రాదు అంటుంది సుమిత్ర. ఆ మాట చెప్పడానికి మీరెవరు అంటాడు నర్సింహా. నేను ఆమె తల్లిని అంటుంది సుమిత్ర. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X