Karthika Deepam 2 April 26th: బంటుని బలి చేయాలనుకున్న పారిజాతం.. పోలీస్ స్టేషన్ లో జోత్స్న!

పాపని షాపింగ్ తీసుకువెళ్లినందుకు కార్తీక్ పై కోప్పడుతుంది దీప. సుమిత్ర పై దాడి చేసిన వాడితో మాట్లాడుతూ దీపకీ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోతాడు బంటు. దీప వంటలు బాగా చేయడంతో సుమిత్ర వాళ్ళందరూ దీపని మెచ్చుకుంటారు. దీపని ఊరు నుంచి పొమ్మని లేదంటే బ్రతకనివ్వనని సుమిత్ర ఇంటికి వచ్చి మరీ దీపని బెదిరిస్తాడు నర్సింహ. మీ బావకి నువ్వంటే ఇష్టం లేదని జోత్స్న ని రెచ్చగొడతారు ఆమె ఫ్రెండ్స్. ఇదంతా గత ఎపిసోడ్‌లో జరిగిన కథ. ఏప్రిల్ 26 వ తేదీ కార్తీకదీపం సీజన్ 2లో 29వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..

బర్త్డే పార్టీలో కార్తీక్ ప్రవర్తన, దానికి తోడు జోత్స్న ఫ్రెండ్స్ ఆమెని రెచ్చగొట్టడంతో ఎక్కువగా డ్రింక్ చేసిన జోత్స్న తూలుతూ డ్రైవ్ చేస్తుంది. ఆ మత్తులోనే ఇంటికి వచ్చిన జోత్స్న తూలుతూ కారు దిగుతూ ఉండడాన్ని చూస్తుంది దీప. పరిగెత్తుకొని వచ్చి ఆమెని పట్టుకుంటుంది. బావ ఇంటికి వచ్చాడా అని అడుగుతుంది జోత్స్న. దీప ఏమి సమాధానం చెప్పకపోవడంతో రాలేదు కదా బావకి నేనంటే ఇష్టం లేదు అంటుంది జోత్స్న.

Karthika Deepam season 2 April 26th 2024 Episode Number 29 Here is full story

ఆమెని తీసుకెళ్లి మంచం మీద పడుకోబెడుతుంది దీప. తనకి ఈ అలవాటు ఉందని సుమిత్రమ్మ గారికి తెలుసో లేదో రేపు చెప్పాలి అనుకుంటుంది దీప. ఇదంతా పారిజాతం గమనిస్తుంది కానీ దీప పక్కన ఉండగా జోత్స్నని ప్రశ్నిస్తే బాగోదు అని ఊరుకుంటుంది. మరుసటి రోజు ఉదయాన్నే గార్డెన్ లో మాట్లాడుకుంటూ ఉంటారు బంటు, పారిజాతం. అప్పుడే అక్కడికి వచ్చిన పోలీసుల్ని చూసి కంగారు పడతారు. కారుని పోలీసులు పరిశీలిస్తూ ఉంటారు.

ఇంతలో దశరథ్, సుమిత్ర బయటకి వస్తారు ఆ కారు ఎవరిది అని అడుగుతారు పోలీసులు. మా అమ్మాయిది అంటుంది సుమిత్ర. వెంటనే తనని పిలిపించండి అంటారు పోలీసులు. బంటు ని జోత్స్నని పిలవమని చెప్పి ఏం జరిగింది అని పోలీసుల్ని అడుగుతాడు దశరథ్. రాత్రి ఈ కారు డ్రైవ్ చేస్తున్న వాళ్ళు ఒక యాక్సిడెంట్ చేశారు, ముగ్గురికి తీవ్రంగా గాయాలు అయ్యాయి ఒకరి పరిస్థితి విషమంగా ఉంది అంటాడు పోలీస్. అప్పటికే జ్యోత్స్న, బంటు అక్కడికి వచ్చేస్తారు.

Karthika Deepam season 2 April 26th 2024 Episode Number 29 Here is full story

మనవరాలు పరిస్థితి అర్థం చేసుకున్న పారిజాతం బంటుని చెంప మీద కొట్టి రాత్రి నువ్వే కదా కారు డ్రైవ్ చేసావు అంటూ బంటు ని పోలీసుల వైపు నెట్టి రాత్రి మా మనవరాలు మా ఇంట్లోనే ఉంది వీడే కార్ డ్రైవ్ చేసాడు వీడిని అరెస్టు చేయండి అంటుంది. బంటు కంగారు పడిపోతాడు. అప్పుడే అక్కడికి వచ్చిన దీప బంటు కార్ డ్రైవ్ చేయడం ఏమిటి రాత్రి జ్యోత్స్న కార్ డ్రైవ్ చేసింది అంటుంది. సుమిత్ర మాట్లాడుతూ తను కార్ డ్రైవ్ చేయడం నువ్వు చూసావా అని అడుగుతుంది. అప్పుడు దీప రాత్రి జరిగిందంతా చెప్పి ఏం జరిగింది అని అడుగుతుంది దీప.

రాత్రి ఈ కారు యాక్సిడెంట్ చేసింది అయితే కారు డ్రైవ్ చేస్తున్నది ఎవరు అనే విషయంపై క్లారిటీ లేదు కానీ మీరు నిజాయితీగా సాక్ష్యం చెప్పినందుకు థాంక్స్ అని చెప్పి జ్యోత్స్నని అరెస్టు చేయమంటాడు ఎస్సై. దీప నిజం చెప్పినందుకు కంగారుపడుతుంది. దశరథ్ ఎస్ఐతో మీరు అమ్మాయిని తీసుకు వెళ్ళండి మేము వెనక వస్తాము అంటాడు. జ్యోత్స్నని అరెస్టు చేసి తీసుకువెళ్తారు పోలీసులు. పారిజాతం మనవరాలను పోలీసులు తీసుకువెళుతుంటే గోలపెడుతుంది, రక్షించమని భర్తని అడుగుతుంది.

Karthika Deepam season 2 April 26th 2024 Episode Number 29 Here is full story

మరోవైపు హైదరాబాదులో అడుగుపెట్టిన అనసూయ కొడుకు కోడల్ని వెతుక్కుంటూ బయలుదేరుతుంది. మరోవైపు సుమిత్ర జరిగిందంతా కాంచన కి ఫోన్ చేసి చెప్తుంది. కాంచన కంగారుపడుతూ భర్త, కొడుకుకి విషయం చెప్పడంతో కార్తీక్ పోలీస్ స్టేషన్ కి బయలుదేరుతాడు. మరోవైపు పోలీస్ స్టేషన్లో ఉన్నజ్యోత్స్న ని విడిపించడం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు శివ నారాయణ, దశరధ్. స్టేషన్ ముందు మీడియా వాళ్ళు హడావిడి చేస్తూ ఉంటారు.

మరోవైపు పోలీసులతో అలా మాట్లాడినందుకు దీపని మందలిస్తూ ఉంటుంది పారిజాతం. నాకు అసలు విషయం తెలియదు అందుకే మాట్లాడేసాను అంటుంది దీప. సుమిత్ర కూడా దీపనే వెనకేసుకొస్తుంటే పారిజాతం మందలిస్తుంది.నువ్వు ప్రతి దానికి తనని వెనకేసుకొరాకు నిన్ను కాపాడిందని నెత్తిన పెట్టుకున్నావు ఇప్పుడు నీ పరువును బజారున పడేసింది అంటూ చివాట్లు పెడుతుంది. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X