Karthika Deepam 2 April 27th: తప్పంతా దీపదే అంటున్న పారిజాతం.. పోలీసులకి లొంగిపోతానంటున్న బంటు!
సుమిత్ర పై దాడి చేసిన వాడితో మాట్లాడుతూ దీపకీ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోతాడు బంటు. దీప వంటలు బాగా చేయడంతో సుమిత్ర వాళ్ళందరూ దీపని మెచ్చుకుంటారు. దీపని ఊరు నుంచి పొమ్మని లేదంటే బ్రతకనివ్వనని సుమిత్ర ఇంటికి వచ్చి మరీ దీపని బెదిరిస్తాడు నర్సింహ. మీ బావకి నువ్వంటే ఇష్టం లేదని జోత్స్న ని రెచ్చగొడతారు ఆమె ఫ్రెండ్స్. తాగి కార్ యాక్సిడెంట్ చేస్తుంది జోత్స్న. ఇదంతా గత ఎపిసోడ్‌లో జరిగిన కథ. ఏప్రిల్ 27 వ తేదీ కార్తీకదీపం సీజన్ 2లో 30వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే.
నిజం చెప్పినందుకు దీపపై కోప్పడుతూ ఉంటుంది పారిజాతం. నాకు విషయం తెలియదండి అందుకే మాట్లాడేసాను అంటుంది దీప. తెలియనప్పుడు నోరు మూసుకోవాలి అంటుంది పారిజాతం. నా కూతురు తప్పు చేసిందని బాధపడుతుంటే మీరు తనని అంటారేంటి, నిజం తను చెప్పకపోయినా పోలీసులకి నిజం కనుక్కోవడం పెద్ద పని కాదు, అయినా తన జాతకంలోనే అవమానాల పాలు అవుతుందని ఉంది అని బాధపడుతుంది సుమిత్ర. మరోవైపు కార్తీక్ పోలీస్ స్టేషన్ కి వస్తాడు.

జోత్స్న దగ్గరికి వెళ్లి జరిగింది తెలుసుకొని ఆమెకి ఓదారుస్తాడు. తర్వాత లాయర్ బెయిల్ ఇవ్వటంతో జోత్స్న ని తీసుకొని అక్కడినుంచి బయలుదేరుతారు కార్తీక్ వాళ్ళు. బయటికి వచ్చేటప్పటికి మీడియా వాళ్ల పై ప్రశ్నల వర్షం కురిపిస్తుంది అయినా ఏమి మాట్లాడకుండా అక్కడినుంచి బయలుదేరుతారు కార్తీక్ వాళ్ళు. మరోవైపు అనసూయ భోజనం చేయడానికి హోటల్ కి వస్తుంది.
ఒకవేళ దీపకి నర్సింహ దొరకకపోవటంతో ఏ హోటల్లో అయినా వంటలు చేస్తుందేమో అనుకుంటుంది అనసూయ. అనుకొని ముందుగా ఆ హోటల్లోనే దీపని వెతుకుతుంది కానీ అక్కడ దొరకదు దీప.మరోవైపు ఇంటికి వచ్చిన జోత్స్న ఏడుస్తూ ఉంటుంది. ఇదంతా ఆ దీప వల్లే తను నోరు మూసుకొని ఊరుకుంటే నేను బంటుగాడిని పోలీస్ స్టేషన్ కి పంపించేసేదాన్ని అంటుంది పారిజాతం.
దీప ఏడుస్తూ నాకు నిజం తెలియక మాట్లాడేశాను అంటుంది. అయినా మీరు తనని అంటారేంటి మీరు దాచేసినంత మాత్రాన పోలీసులు నిజం తెలుసుకోకపోరు. అయినా మీకు చాలా సార్లు చెప్పాను తప్పు చేసిన ప్రతిసారి మనవరాలిని వెనకేసుకు రావద్దని అయినా మీరు వినలేదు అంటుంది సుమిత్ర. శివ నారాయణ కూడా నా మనవరాలు జోలికి రావద్దని చాలాసార్లు చెప్పాను అని పారిజాతాన్ని మందలిస్తాడు.
ఒక్కగానొక్క మనవరాలు కదా అని కాస్త గారాబం చేశాను అది కూడా తప్పేనా అంటుంది పారిజాతం. తెగేలాగా లాగొద్దు పారు అని పారిజాతాన్ని హెచ్చరిస్తాడు కార్తీక్. ఇక ఈ టాపిక్ ఇక్కడితో వదిలేయండి అంటాడు దశరథ్. ఏడుస్తూ జోత్స్న చేతులు పట్టుకొని తెలియక చేశాను క్షమించమని వేడుకుంటుంది దీప. కానీ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది జోత్స్న. ఆ తర్వాత ఇంట్లోకి వెళ్తున్న పారిజాతం ఇకమీదట జోత్స్న ఆ దీప ని దగ్గరికి కూడా రానివ్వదు అనుకుంటుంది.
అంతలోనే బంటు ఆమె దగ్గరికి వచ్చి నేను నిజం చెప్పేసే పోలీసులకి లొంగి పోదాం అనుకుంటున్నాను, నేను మీకోసం ఏం చేయడానికైనా సిద్ధపడుతుంటే మీరు నన్ను జైల్లో పెట్టాలని చూస్తారా? నేను జైలుకు వెళ్తే నాతో పాటు మీరు కూడా జైలుకు వస్తారు అంటూ పారిజాతాన్ని బెదిరిస్తాడు బంటు.నేను మీకోసం ఏమైనా చేస్తాను అని అంటావు కదా నా మీద ఏ మాత్రం విశ్వాసం ఉందో చూద్దామని అలా చేశాను కానీ మీ నాన్నకి ఉన్నంత విశ్వాసం నీకు లేదు అంటుంది పారిజాతం.
నా విశ్వాసాన్ని పరీక్షించడానికి అలా చేశారా.. నాకు తెలియదమ్మా, నేను పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళను అంటాడు బంటు. సరే ఖర్చులకి డబ్బులు ఉన్నాయా అంటుంది పారిజాతం. బంటు లేవు అనడంతో రేపు గుర్తు చేయు ఇస్తాను అనటంతో అక్కడినుంచి వెళ్ళిపోతాడు బంటు. ఎవరిని ఎక్కడ నొక్కాలో నాకు బాగా తెలుసు అనుకుంటుంది పారిజాతం. మరోవైపు దీప దొరకక పోవడంతో ఊర్లో ఉన్న హోటల్స్ అన్ని వెతికాను.
ఇక రేపు ఒక్కరోజు వెతుకుతాను దొరకకపోతే ఇంటికి వెళ్ళిపోతాను అనుకొని ఫుట్ పాత్ మీద పడుకుంటుంది అనసూయ. మరోవైపు కార్తీక్ జోత్స్న తో మాట్లాడుతూ అంత ఓవర్ గా డ్రింక్ చేసినప్పుడు డ్రైవ్ చేయడం ఎందుకు నాకు కాల్ చేయొచ్చు కదా అంటాడు. కాల్ వచ్చింది అనే కదా నువ్వు వెళ్ళిపోయావు అని కోపంగా అంటుంది జోత్స్న. వెళ్తే మళ్ళీ రాననుకున్నావా అంటాడు కార్తీక్. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం.


Click it and Unblock the Notifications











