Karthika Deepam 2 April 30th: కిరీటం పోగొట్టుకున్న జోత్స్న.. దీపని డబ్బుతో కొనాలని చూస్తున్న పారిజాతం!

దీపని ఊరు నుంచి పొమ్మని లేదంటే బ్రతకనివ్వనని సుమిత్ర ఇంటికి వచ్చి మరీ దీపని బెదిరిస్తాడు నర్సింహ. మీ బావకి నువ్వంటే ఇష్టం లేదని జోత్స్న ని రెచ్చగొడతారు ఆమె ఫ్రెండ్స్. తాగి కార్ యాక్సిడెంట్ చేస్తుంది జోత్స్న. దీప నిజం చెప్పటంతో జోత్స్న ని పోలీసులు అరెస్టు చేస్తారు. దీప మీద జోత్స్న మనసు విరిగిపోయేలాగా చేస్తుంది పారిజాతం. ఇదంతా గత ఎపిసోడ్‌లో జరిగిన కథ. ఏప్రిల్ 30 వ తేదీ కార్తీకదీపం సీజన్ 2లో 32వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..

జరిగిందాన్ని తలుచుకొని ఏడుస్తూ ఉంటుంది దీప. అది చూసిన శౌర్య ఎందుకు ఏడుస్తున్నావ్ అని అడుగుతుంది. నిజం చెప్పినందుకు అంటుంది దీప. నిజం చెప్పకూడదా? నిజం చెప్తే ఏడుస్తారా అని ప్రశ్నిస్తుంది శౌర్య. ఆమెని సమాధానపరిచి పడుకోబెడుతుంది దీప. సమస్య ఇక్కడితో తీరిపోయింది కాబట్టి సరిపోయింది లేదంటే జోత్స్న నా మొహం కూడా చూసేది కాదు అనుకుంటుంది దీప.

Karthika Deepam season 2 April 30th 2024 Episode Number 32 Here is full story

మరుసటి రోజు బంటు వచ్చి ఇంట్లో వాళ్ళందరినీ కంగారుగా పిలుస్తాడు, టీవీ ఆన్ చేయండి మన అమ్మాయి గారి గురించి న్యూస్ లో చెప్తున్నారు అంటాడు. పారిజాతం టీవీ ఆన్ చేస్తుంది, మిస్ హైదరాబాద్ గా ఎన్నికైన జోత్స్న బాధ్యత లేకుండా కారు నడిపి యాక్సిడెంట్ చేసింది. ఆమె బాధ్యత రాహిత్యానికి ఆమె మిస్ హైదరాబాద్ కిరీటం వెనక్కి తీసుకుంటున్నట్లుగా వార్తల్లో చెప్తారు. ఈ న్యూస్ చూసి ఇంట్లో వాళ్ళందరూ కంగారు పడతారు. జ్యోత్స్న ఫ్రస్టేట్ అవుతూ కోపంగా అక్కడినుంచి వెళ్ళిపోతుంది.

ఆమె వెనకే వెళుతుంది సుమిత్ర. దీప సంగతి చూసి అప్పుడు తన దగ్గరికి వెళ్తాను అని ఆవేశంగా పారిజాతం దీప దగ్గరికి వెళ్తుంది. బాధపడుతున్న జ్యోత్స్న ని ఓదారుస్తుంది సుమిత్ర. ఇదంతా దీప వల్లే జరిగింది తనే సాక్ష్యం చెప్పకుండా ఉండి ఉంటే ఇదంతా జరిగేది కాదు అంటుంది. నువ్వు జాగ్రత్తగా ఉండి ఉండాల్సింది తనని ఎందుకు అనటం అంటుంది సుమిత్ర. తనని వెనకేసుకుని రావద్దు, నా క్రౌన్ వెనక్కి పోయింది అంటే నా పరువు మొత్తం పోతుంది.

సోషల్ మీడియాలో నా ఫాలోవర్స్ అందరూ నన్ను అన్ ఫాలో అవుతున్నారు, నేను దీనిని అంత ఈజీగా తీసుకోలేను అంటూ తనని ఒంటరిగా వదిలేయమని తల్లిపై కేకలు వేసి ఆమెని అక్కడి నుంచి పంపించేస్తుంది జ్యోత్స్న. మరోవైపు దీప దగ్గరికి వెళ్లిన పారిజాతం జరిగిందంతా చెప్పి నువ్వు ముందు ఇంట్లోంచి బయటికి పో అని ఆమె బట్టల బ్యాగు బయటకి విసిరేస్తుంది. దీపని కూడా నెట్టేస్తే అప్పుడే అక్కడికి వచ్చిన సుమిత్ర దీపని పట్టుకొని పారిజాతాన్ని మందలిస్తుంది.

Karthika Deepam season 2 April 30th 2024 Episode Number 32 Here is full story

మిమ్మల్ని మావయ్య గారు పిలుస్తున్నారు మీరు వెళ్ళండి, దీప ఎక్కడికి వెళ్లదు ఇక్కడే ఉంటుంది అంటుంది. తనేమైనా నీ కడుపున పుట్టినా కూతురా అంతగా వెనకేసుకొస్తున్నావు అంటుంది పారిజాతం. అవును అంటుంది దీప. పారిజాతం కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈవిడ వెళ్లి జోత్స్న తో మాట్లాడుతుందో ఏమో నేను కూడా పెడతాను కానీ నువ్వు మాత్రం ఎక్కడికి వెళ్లొద్దు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సుమిత్ర.

రాత్రి సమస్య తీరిపోయింది అనుకున్నాను కానీ ఇంత పెద్దదవుతుందనుకోలేదు అనుకుంటుంది దీప. మరోవైపు పారిజాతం దగ్గరికి వచ్చిన బంటు ఆ దీప ని బయటికి పంపించేసారా అని అడుగుతాడు. బ్యాగ్ కూడా బయటికి విసిరేసాను ఇంకేం చేయమంటావు అంటుంది పారిజాతం. నేను ఒక సలహా చెప్తాను వినండి, డబ్బుకు లొంగని మనిషి ఉండదు, అందులోనూ తను కష్టాల్లో ఉంది కాబట్టి డబ్బు తీసుకుంటుంది అని చెప్తాడు బంటు.

డబ్బు తీసుకొని దీప దగ్గరికి వెళ్తుంది పారిజాతం. ఈ డబ్బు తీసుకొని నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటుంది. వెళ్లిపోవడానికి నాకు డబ్బక్కర్లేదు అంటుంది దీప.నువ్వు చేసిన పనికి జోత్స్న నీ మొఖం కూడా చూడదు, దీప ని ఇంట్లోంచి పంపించేయమని అందరికీ ఇప్పుడే చెప్పింది కానీ ఆ విషయం సుమిత్ర నీకు చెప్పలేదు, అందుకే డబ్బిచ్చి నన్ను పంపించింది అని చెప్తుంది. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X