Karthika Deepam 2 May 3rd: నర్సింహ గురించి నిజం తెలుసుకున్న పారిజాతం.. అత్తా కోడళ్ల మాటలు వినేసిన సుమిత్ర!
దీప మీద జోత్స్న మనసు విరిగిపోయేలాగా చేస్తుంది పారిజాతం. బంటు ఇచ్చిన సలహాతో దీప కి డబ్బిచ్చి అక్కడ నుంచి పంపించేసే ప్రయత్నం చేస్తుంది పారిజాతం. పారిజాతం మాటలకు బాధపడిన దీప ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. ఇంతలో ఇంటికి పోలీసులు రావటంతో కార్తీక్ మళ్ళీ ఆమెని వెనక్కి తీసుకువస్తాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో జరిగిన కధ. మే3 వ తేదీ కార్తీకదీపం సీజన్ 2లో 35వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందనే విషయంలోకి వెళితే..
నా సిన్సియారిటీని ప్రశ్నిస్తున్నారు, మీరు కూడా సిన్సియర్గా ఉండండి. సాక్షిని ఎక్కడికి వెళ్ళకుండా చూసుకునే బాధ్యత మీదే తను కనిపించకపోతే నేను మిమ్మల్నే అడుగుతాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సీఐ. కార్తీక్ కూడా పనుంది అని చెప్పి బయటకి వెళ్ళిపోతాడు. తర్వాత శివ నారాయణ దీపని మందలిస్తాడు. నేను ప్రేమతో వేసిన గొలుసు ఎందుకు తీసేసావు, అయినా చెప్పకుండా వెళ్ళిపోవడమేమిటి అంటాడు. ఆ చైన్ పాప మెడలో వెయ్యమని చెప్పి సుమిత్రతో చెప్తాడు.

దీపతో పాటు వచ్చినది ఆమె అత్తగారు అని తెలుసుకుంటారు. ఇంట్లోంచి వెళ్లిపోయినందుకు సుమిత్ర కూడా దీపని మందలిస్తుంది. మీరు వెళ్ళండి నేను వచ్చి తర్వాత మాట్లాడుతాను అంటుంది. అనసూయ వెళ్ళమంటే ఇంట్లోకేమో అనుకొని వెళ్తుంటే మనం ఉండవలసింది ఇక్కడ కాదు అని చెప్పి అవుట్ హౌస్ చూపిస్తుంది దీప. నేను చూస్తున్నదంతా నిజమేనా అసలు ఏం జరుగుతుంది అని అయోమయంగా కోడల్ని అడుగుతుంది అనసూయ.
ఇంటికి వెళ్లి మాట్లాడుకుందాం పదా అంటుంది దీప. ముందు వండి పెట్టు ఆకలేస్తుంది అని అనసూయ అనటంతో సరే అంటుంది దీప. మరోవైపు పారిజాతం దగ్గరికి వచ్చిన బంటు దిగులుగా ఉన్న పారిజాతాన్ని చూసి ఏమైంది అంటాడు. వదిలిపోయిందనుకున్న దరిద్రం మళ్ళీ నెత్తి మీదకు వచ్చింది, అయినా నేను చెప్పిన పని చేసావా అని అడుగుతుంది పారిజాతం. చేశాను, ఆ వచ్చినవాడు మరెవరో కాదు దీప మొగుడు, డ్రైవర్ పనిచేస్తాడు అని చెప్తాడు బంటు.
మన ఇంట్లో వాళ్లే మనల్ని మోసం చేస్తున్నారు, వచ్చినవాడు దీప మొగుడని సుమిత్రకు తెలుసు కానీ మన దగ్గర ఏమీ మాట్లాడలేదు. దీప మొగుడు దగ్గరికి వెళ్లకుండా ఇక్కడ ఎందుకు ఉంది, ఇప్పుడు మళ్లీ అత్త వచ్చింది అంటే వాళ్ళ మధ్య ఏదో జరుగుతుంది అదేంటో కనుక్కోవాలి అంటుంది పారిజాతం. మరోవైపు పనిచేసుకుంటున్న దీపని కొడుకు గురించి అడుగుతుంది అనసూయ. మాట దాట వేస్తూ ఉంటుంది దీప.
నేనేమైనా పిచ్చిదాని లాగా కనిపిస్తున్నానా ఎన్నిసార్లు అడిగినా తప్పించుకుంటున్నావు, ఇప్పుడు శౌర్య కూడా ఎక్కడ లేదు ఇప్పుడు నిజం చెప్పు అంటుంది అనసూయ. జరిగిందంతా చెప్తుంది దీప. వాడు రెండో పెళ్లి చేసుకుంటే నువ్వెలా ఊరుకున్నావు అంటుంది అనసూయ. నిలదీశాను కానీ ఇప్పుడు అతనికి తల్లి, పెళ్ళాం, కూతురు ఎవరు అక్కర్లేదు. అతని దారి అతను చూసుకున్నాడు. అక్కడ నుంచి వస్తుంటేనే సుమిత్ర గారు కలిశారు.
అక్కడినుంచి జరిగిందంతా మీకు తెలుసు అంటుంది. వాడు నిన్ను అప్పుల్లో వదిలేసాడు అనుకున్నాను కానీ ఇలా కష్టాల్లో వదిలేసాడు అనుకోలేదు, ఇవన్నీ ఆ ఇంట్లో వాళ్లకు తెలుసా అని అడుగుతుంది అనసూయ. అడిగారు కానీ చెప్పలేదు నువ్వు కూడా ఏమీ చెప్పొద్దు అంటుంది దీప. కానీ అప్పటికే నిద్రపోయిన పాపని తీసుకొని వచ్చిన సుమిత్ర ని చూసే షాక్ అవుతారు అత్త కోడళ్లు ఇద్దరూ. మరోవైపు కాంచన భర్త ఆమెకి భోజనం తినిపిస్తూ ఉంటాడు.
అంతలోనే అక్కడికి వచ్చిన కార్తీక్ ని వీరేశలింగం గారు అని పిలుస్తాడు అతని తండ్రి. ఎందుకు అలా పిలుస్తున్నారు అంటాడు కార్తీక్. మీరు ఊరు వెళ్ళిపోతున్న ఆడవాళ్ళని ఆపుతున్నారంట కదా, వాళ్ళ బాధ్యతలు తీసుకుంటున్నారంట కదా అంటాడు కార్తీక్ తండ్రి. పారు ఫోన్ చేసిందా అంటాడు కార్తీక్. ఎవరు ఫోన్ చేస్తే ఏముంది నీ పనులతోనే నువ్వు బిజీగా ఉన్నావు ఇప్పుడు మళ్ళీ కొత్త సమస్యలు అవసరమా అంటుంది కాంచన. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.


Click it and Unblock the Notifications











